Search
  • Follow NativePlanet
Share
» »ఆరువేల రూపాయ‌ల‌తో షిరిడిని చుట్టేద్దామా..!

ఆరువేల రూపాయ‌ల‌తో షిరిడిని చుట్టేద్దామా..!

ఆరువేల రూపాయ‌ల‌తో షిరిడిని చుట్టేద్దామా..!

సాయిబాబాను ఆరాదించే భక్తులు జీవితంలో ఒక్కసారైనా షిరిడికి వెళ్లాలని ఆకాంక్షిస్తారు. షిరిడి వెళ్లాల‌నే కోరిక ఉన్న‌వారికి ఐఆర్‌సీటీసీ టూరిజం ఓ శుభ‌వార్త తీసుకొచ్చింది. విజయవాడ నుంచి షిర్డీకి ఓ కొత్త ప్యాకేజీని అందిస్తుంది. ఈ ప్యాకేజీ జులై 25వ తేదీన అందుబాటులో ఉంటుంది. రండి ఆ వివ‌రాలేంటో చూద్దాం. ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీలు.. సామాన్యులకు అందుబాటు ధరలో ఉంటున్నాయి. తాజాగా విజయవాడ నుంచి షిర్డీకి ఓ ప్యాకేజీని ప్రకటించింది. 'SAI SANNIDHI EX - VIJAYAWADA' పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ ప్యాకేజీతో మూడు రాత్రులు, నాలుగు రోజుల టూర్ ప్యాకేజీ ల‌భిస్తుంది. ప్రతీ మంగళవారం ఈ టూర్ అందుబాటులో ఉంటుంది.

1

ఎక్క‌డ‌..

ముంబయికి నుంచి 300 కిలోమీట‌ర్ల దూరంలో, హైదరాబాదు నుంచి 600 కిలోమీట‌ర్ల దూరంలో షిరిడి ఉంది. చలికాలంలో చాలామంది సాయిబాబా భక్తులు నడుచుకుంటూ ఇక్కడికి చేరుకుంటారు. ఇక్క‌డికి సాయిబాబా ప‌ద‌హారేళ్ల‌ వయస్సులో వచ్చారని చెబుతుంటారు. 1918లో కాలం చేసేవరకు ఆయన అక్కడే ఉన్నారని చెబుతారు. ఈ సాయిబాబాను ద‌ర్శించుకునేందుకు భ‌క్తుల‌కు అరుదైన అవ‌కాశం ల‌భించింది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ జులై 25, 2023వ తేదీన అందుబాటులో ఉంటుంది. మొదటి రోజు విజయవాడలో ప్రారంభ‌మ‌వుతుంది. రాత్రి 10.15 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్‌లో సాయినగర్ షిరిడీ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాలి. రాత్రంతా ప్రయాణం ఉంటుంది. రెండో రోజు ఉదయం 6.15 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటారు. ఆ తర్వాత షిర్డీకి బయల్దేరుతారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత షిర్డీ ఆలయ సందర్శన ఉంటుంది. సాయంత్రం షాపింగ్ కోసం ఫ్రీ టైమ్ ఉంటుంది. రాత్రికి షిరిడీలో బస చేయాల్సి ఉంటుంది.

2

ఆల‌య విశేష‌తలు..

సాయిబాబా భక్తుడైన గోపాల్రావ్ 1922లో ఈ ఆలయాన్ని కట్టించారు. ప్రస్తుతం ఈ ఆలయం ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఈ ఆల‌య‌మంతా మార్బుల్ రాళ్లతో నిర్మించారు. ఈ ఆలయంలో ఒకేసారి 600 మంది కూర్చుని ప్రార్థనలు నిర్వ‌హించుకోవ‌చ్చు. రోజూ తెల్లవారుజాము 5 నుంచి రాత్రి 10 గంటల వరకు బాబాను దర్శించుకునే అవ‌కాశం ఉంటుంది. ప్రత్యేక‌సంద‌ర్భాల్లో రాత్రివేళ్లల్లో కూడా ఆలయం తెరిచే ఉంటుంది. బాబాకు ఇష్టమైన గురువారం రోజు ఇక్కడ చాలా రద్దీ ఉంటుంది. వారాంతంలో కూడా భక్తుల తాకిడి అధికమ‌నే చెప్పుకోవాలి. సాధారణ రోజుల్లోనే ఇక్కడ రోజుకు 60 వేల నుంచి లక్షకు పైగా భక్తులు వ‌స్తార‌ని అంచనా. వేసవిలో ఇక్కడ అడుగుపెట్టాలంటే చాలా క‌ష్టంగా ఉంటుంది.

3

మూడో రోజు..

ఇక మూడో రోజు ఉదయం శనిశిగ్నాపూర్ సందర్శన ఉంటుంది. అక్కడ్నుంచి మళ్లీ షిరిడీ చేరుకోవాల్సిం ఉంటుంది. రాత్రి 7.30 గంటలకు నాగర్‌సోల్ స్టేషన్‌లో తిరుగు ప్రయాణం మొదలవుతుంది. తెల్లవారుజామున 2.50 విజయవాడ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

ధ‌రెంత‌..?

కంఫర్ట్ క్లాస్ (3ఏసీ)లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 17430 ధర ఉండగా, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.10930, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 8890చెల్లించాలి. ఐదు నుంచి 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. ఇక స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 6430 గా ఉంది. సింగుల్ ఆక్యుపెన్సీకి 14970 గా నిర్ణయించారు. www.irctctourism.com వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు

More News

    Read more about: mumbai hyderabad
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+