Search
  • Follow NativePlanet
Share
» » పటాకుల పేలుళ్లు - శివకాశి వెలుగులు !

పటాకుల పేలుళ్లు - శివకాశి వెలుగులు !

దీపావళి దీపాల పండుగ. ప్రపంచం లోని చాలా ప్రాంతాలు ఈ పండుగను ఆచరిస్తాయి. అసలు దీపావళి అంటే ఏమిటి ? దీపం వెలిగిస్తే, అజ్ఞాన అంధకారం తొలిగి పోతుందని చెపుతారు ? హిందువులు అయితే శ్రీరాముడు తన వనవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చాడని చెపుతారు. సిక్కులు తమ ఆరవ గురువును వదలి వేసిన దినమని చెపుతారు లేదా జైనులు అయితే వారి మహావీరుడు ముక్తి పొందిన దినమంటారు. ఇంత అట్టహాసంగా జరిపే ఈ దీపావళి లోని ప్రాముఖ్యత ఏమిటి ? పిల్లలు, పెద్దలు, ప్రతి సంవత్సరం ఒకే రకంగా ఎందుకు ఆనందిస్తారు ? బహుశా, మట్టి ప్రమిదలలోని దీపాల వెలుగులు చూశా ? లేక బాక్సుల కొలది తియ్యని మిఠాయిలు తిని ఆనందించేందుకా ? లేక రంగు రంగుల కొత్త దుస్తులు ధరించినందుకా ? లేక వారి వారి ఇండ్లను అలంకరణలతో ముంచెత్తి నందుకా ? మరి ఈ దీపావళి పండుగకు శివ కాశికి గల సంబంధం ఏమిటి ?

పేలుళ్లు, వెలుగుల శివకాశి దీపావళి!

పై ప్రశ్నలకు సమాధానాలు ఊహించిందుకు ఏమీ బహుమతి లేదండోయ్ ...అసలు విషయం ...తుస్సు మని, డాం ...అని పేలి వెలుగులను అందించే టపాకాయలు ఈ దీపావళి పండుగలో పిల్లలకైనా, పెద్దలకైనా గొప్ప ఆకర్షణగా నిలుస్తాయి. కంటికి వెలుగుతో, చెవికి గొప్ప శబ్దంతో, మనసులకు ఆహ్లాదం కలిగించే ఈ టపాసుల కాల్పుల ఆనందం మరి దేనికీ సాటి రాదు.

అందరికి సంభ్రమం కలిగించే రీతిలో ఇవి అన్ని ఆకారాలలో శివకాసి పట్టణంలో తయారవుతాయి. వేలిగేటపుడు వివిధ రకాల ధ్వనులు కూడా చేస్తాయి. మరి మీకు ఇంతటి ఆనందం కలిగించే ఈ టపాసులు తయారు అయ్యేది శివకాశి లోనే. శివకాశి తమిళ్ నాడు రాష్ట్రంలో ఒక చిన్న పట్టణం. చెన్నై నగరానికి 533 కి. మీ. లు దూరంలో వుంటుంది. బెంగుళూరు కు 499 కి. మీ. ల దూరం కలదు.

ఎంతో బిజీ గా...

దీపావళి వచ్చిందంటే చాలు, ఈ పట్టణానికి వెళ్ళే రోడ్లు, ట్రైన్ మార్గాలు ఎంతో బిజి గా వుంటాయి. ప్రజలు మారు మూలలనుడి కూడా ఈ పట్టణానికి వచ్చి టపాసులు అధిక మొత్తాలలో కొనుగోలు చేస్తారు.

అందమైన పడమటి కనుమలకు తూర్పు దిశ గాను, సత్తూర్ కు పడమట గాను కల ఈ శివ కాసి పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందినది. ఈ పట్టణాన్ని మన ప్రియతమ భారత దేశ మొదటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రు "కుట్టి జపాన్" అంటే చిన్న జపాన్ అని జపాన్ దేశంతో పోల్చేవారు. ప్రతి సంవత్సరం శివకాశి దీపావళి నాటికి వెలుగులతో నిండి పోతుంది.

శివకాశి ఒకప్పుడు మదురై లో ఒక భాగంగా వుంది అనేక మంది రాజులచే పాలించబడింది. పాండ్య వంశ రాజులలో ఒక రాజు కాశి నుండి ఒక శివ లింగం తెప్పించి తెన్ కాశి లో ప్రతిష్టించేందుకు ప్రయత్నించాడు. కాని విధి మరో రకంగా వుంది, ఆ లింగాన్ని మోస్తున్న ఆవు శివ కాశి లో ఆగి పోగా ఆ లింగం అక్కడే ప్రతిష్టించ బడింది. కనుకే, దీనికి శివకాశి అనే పేరు వచ్చింది.

ప్రస్తుతం ఈ టవున్, దీపావళి టపాసుల తయారీ పరిశ్రమ లతో పేరు గాంచింది. దీనితో పాటు ప్రింటింగ్, అగ్గి పెట్టెల పరిశ్రమలు కూడా ఇక్కడ అభివృద్ధి చెందాయి. దేశంలో తయారు అయ్యే టపాసులలో 75 శాతం ఇక్కడే తయారు అవుతాయి. ఇక్కడి వారికి అమోఘమైన ఉపాధి కల్పన దొరుకుతోంది.

అయితే, దురదృష్టవశాత్తూ, ఈ టపాసుల పరిశ్రమలు చైల్డ్ లేబర్ ను ప్రోత్సహిస్తున్నాయి. ఈ చట్ట వ్యతిరేక అంశాన్ని తొలగించేందుకు, అనేక స్వచ్చంద సంస్థలు, గవర్నమెంట్ తో కలసి కృషి చేస్తున్నాయి.

 పటాకుల పేలుళ్లు - శివకాశి వెలుగులు !

ఇతర ఆకర్షణలు

శివ కాశి లో పర్యాటకులకు చూసేందుకు భద్రకాళి అమ్మన్ టెంపుల్ కలదు. దీనికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. పండుగలలో టెంపుల్ శిఖరం ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఈ టెంపుల్ సౌత్ ఇండియా లోనే పెద్ద కాళి మాత టెంపుల్ గా పేరొందింది. పడమటి కనుమలలో కల అయ్యనార్ జలపాతాలు ఇక్కడ తప్పక చూడ దగిన ఆకర్షనలలో ఒకటి.

టపాసులు కాల్చాలా ?

మన ఆనందాలు ప్రదర్సిన్చుకోవటానికి టపాసులు కాల్చాలా ? అనేది... ఎవరికీ వారు నిర్ణయించుకోవలసిన అంశం. అయితే, వీటి తయారీలో ఈ పట్టణం ప్రజలు ఒక విభిన్న అనుభూతి పొందుతారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+