Search
  • Follow NativePlanet
Share
» »చండ,ముండ అనే ఇద్దరు రాక్షసులను సంహారించిన దుర్గా పరమేశ్వరి ఆలయం

చండ,ముండ అనే ఇద్దరు రాక్షసులను సంహారించిన దుర్గా పరమేశ్వరి ఆలయం

చండ,ముండ అనే ఇద్దరు రాక్షసులను సంహారించిన దుర్గా పరమేశ్వరి ఆలయం

కేరళలోని మల్లం దుర్గా పరమేశ్వరి దేవాలయం చాలా ప్రసిద్ద చెందినది. ఈ ఆలయంలో ములియార్ గ్రామం , బోవికనం సమీపంలో కాసరగాడ్ జిల్లా, కేరళలో ఉంది. ఈ దుర్గా పరమేశ్వరి ఆలయం వంద సంవత్సరాల పురాతన చరిత్ర కలిగినది. శ్రీ దుర్గా పరమేశ్వర ఆశీస్సుల కోసం భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ఆలయాన్ని మహరాష్ట్రాకు చెందిన బ్రాహ్మనులు చాలా అద్భుతంగా నిర్మించారు.

ఈ ఆలయం గోపురు చాలా అందంగా ఆకర్షిస్తుంటుంది. ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది, రోజూ దివ్వదర్శనంతో పాటు అమ్మను దర్శించే భక్తులకు ఉచితంగా అన్నదానం చేస్తారు. ఇక్కడి వచ్చే ఏ భక్తుడుకు అన్న ప్రసాదలు తినకుండి కాలీ కడుపుతో వెళ్లరు.వేల సంఖ్యలో నైవేద్యంను అన్నప్రసాదంగా స్వీకరిస్తారు. కాబట్టి ఈ అమ్మను ''మల్లన్నపూర్నేశ్వరి'' అని కూడా పిలుస్తారు. ప్రతి రోజూ మూడు సార్లు పూజనిర్వహిస్తారు, రాత్రి సమయంలో సత్యనారాయణ పూజ, హువిన పూజలు ప్రత్యేకమైన పూజలు. మరి ఈ మల్లం దుర్గాపరమేశ్వర ఆలయ విశేషం గురించి తెలుసుకుందాం..

 దుర్గా పరమేశ్వరి అమ్మకు అంకితం

దుర్గా పరమేశ్వరి అమ్మకు అంకితం

మల్లం దుర్గా పరమేశ్వరి ఆలయంను దుర్గా పరమేశ్వరి అమ్మకు అంకితం చేయబడినది. మల్లం దుర్గా పరమేశ్వరి ఆలయంలో మంగళవారలు మరియు శుక్రవారాలు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. ఈ రెండు రోజుల్లో సాధారణ రోజుల కంటే ఎక్కువగా భక్తులు రద్దీగా ఉంటారు. ఈ రోజుల్లో భజన కూడా చేయడం వల్ల భక్తుల ఎక్కువగా వస్తుంటారు.

PC: mallam temple FB

కాసరగాడ్ జిల్లాలో అత్యంత ప్రసిద్ది చెందినది

కాసరగాడ్ జిల్లాలో అత్యంత ప్రసిద్ది చెందినది

కాసరగాడ్ జిల్లాలో అత్యంత ప్రసిద్ది చెందిన ఈ ఆలయంలో రోజూ ఉదయం 5 గంటలకు పూజను ప్రారంభిస్తారు. చూడటానికి సాధారణ ఆలయంలాగే కనిపించినప్పటికి, చాలా పురాతనమైనదని అక్కడి వారు చెబుతారు.

PC: mallam temple FB

ప్రత్యేక రోజుల్లో దాదాపు లక్ష మంది భక్తులు, అన్నదానం

ప్రత్యేక రోజుల్లో దాదాపు లక్ష మంది భక్తులు, అన్నదానం

ప్రత్యేక రోజుల్లో దాదాపు లక్ష మంది భక్తులు దుర్గా పరమేశ్వరి అమ్మను దర్శించుకోవడం నిజంగా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎంత మంది భక్తులు అమ్మను దర్శించినా రుచికరమైన అన్న ప్రసాదాలకు కొదవ ఉండదు.

PC: mallam temple FB

ఏడు రోజులపాటు వార్షికోత్సవాలు

ఏడు రోజులపాటు వార్షికోత్సవాలు

ఫిబ్రవరి మరియు మార్చి నెలల్లో దేవాలయ ఏడు రోజులపాటు వార్షికోత్సవాలు చాలా ఘనంగా జరుపుతారు. పండుగ పర్వదినాల్లో కూడా ఆలయం భక్తులతో రద్దిగా ఉంటుంది. అమ్మవారిని తమ ఆరోగ్యకరమైన భవిష్యత్ కోసం, సంతోషకరమైన జీవితాన్ని పొందడానికి , కళ్యాణ ప్రాప్తి పొందుటకు దుర్గా పరమేశ్వరి అమ్మను వేడుకుంటే తమ కోరికలు తప్పక నెరువేరుతాయని భక్తుల విశ్వసిస్తారు.

PC: mallam temple FB

భక్తితో ఇక్కడ పూజలు నిర్వహిస్తే

భక్తితో ఇక్కడ పూజలు నిర్వహిస్తే

భక్తితో ఇక్కడ పూజలు నిర్వహిస్తే తప్పకుండా కళ్యాణప్రాప్తి, పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుంది, ఆర్థిక సమస్యల నుండి విముక్తి కలుగుతుంది. ధన, ధాన్య భాగ్యం, అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్యం ప్రాప్తి, విద్యార్థులకు విద్యాప్రాప్తి ఇలా వివిధ రకాలుగా అమ్మ ఆశీస్సులు పొందుతారని భక్తుల నమ్మకం.

నవరాత్రి, కార్తీక మాసాల్లో వసంతోత్సవం

నవరాత్రి, కార్తీక మాసాల్లో వసంతోత్సవం

నవరాత్రి, కార్తీక మాసాల్లో వసంతోత్సవం నిర్వహిస్తారు. ఈ సమయంలో కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా మహిళ ఎక్కువగా ఈ ఆలయానికి వస్తుంటారు. ఈ ఆలయం వల్ల కాసరగాడ్ లో ఇది ఒక ప్రధాన టూరిస్ట్ ప్రదేశంగా ప్రసిద్ది చెందినది.

PC: mallam temple FB

ఈ ఆలయానికి ఒక పురాణ గాథ

ఈ ఆలయానికి ఒక పురాణ గాథ

ఈ ఆలయానికి ఒక పురాణ గాథ కూడా ఉంది. పురాణ కథ ప్రకారం, దుర్గా పరమేశ్వరి దేవి డారుక అనే మహిశాసున్ని ఇక్కడే హతమార్చినట్లు పురాణ కథనం. మహిశాసురన్ని భారతదేశంలో మరెక్కడా మహిశాసుర సంహారం జరగలేదు.

చండ మరియు ముండ అని పిలవబడే ఇద్దరు రాక్షసులను

చండ మరియు ముండ అని పిలవబడే ఇద్దరు రాక్షసులను

చండ మరియు ముండ అని పిలవబడే ఇద్దరు రాక్షసులను దుర్గాదేవి సంహరించినట్లు పురణాకథలు తెలుపుతున్నాయి. వీరి సంహరించడానికి అమ్మవారు ఈ భూమిపై ఒక శక్తి రూపంలో వెలసింది.

PC: mallam temple FB

ఇద్దరు రాక్షసులను ఖండన చేసిన దుర్గాదేవి

ఇద్దరు రాక్షసులను ఖండన చేసిన దుర్గాదేవి

ఈ దుర్గా దేవి ఈ భూమి మీద జీవనోపాధిని కల్పించే దైవిక శక్తి . చండ మరియు ముండ అనే రాక్షసులకు ఆమెను వివాహమాడాలనే కోరిక ఉన్నంది. అందుకు దేవుళ్ళు కోపోద్రికులైరి. ఆ సమయంలో వారిని శాంతిప చేయుటకై ఆ ఇద్దరు రాక్షసులను ఖండన చేసిందని పురాణాల కథల ద్వారా తెలుస్తున్నది.

ఈ అమ్మను చాముండేశ్వరి అని పేరుతో కూడా పిలుస్తారు.

ఈ అమ్మను చాముండేశ్వరి అని పేరుతో కూడా పిలుస్తారు.

ఇలా ఆ ఇద్దరు రాక్షసులను సంహరించడం వల్ల ఈ అమ్మను చాముండేశ్వరి అని పేరుతో కూడా పిలుస్తారు. దుర్గా పరమేశ్వరి అమ్మను కాళికాదేవికి దగ్గరగా కూడా పోలుస్తారు. కొన్ని సార్లు పార్వతి దేవిగా కూడా కొలుస్తారు. చండ, ముండ, భండ, మహిషాది దుష్టరాక్షసులను సంహరించి సకల లోకాలకు ఆనందాన్ని ప్రసాదించిన దుర్గామాతకు అపరాజిత అనేపేరు.

PC: Jonoikobangali

సాంప్రదాయక దుస్తుల్లో వెళ్లాలి

సాంప్రదాయక దుస్తుల్లో వెళ్లాలి

ఈ ఆలయానికి వెళ్ళే సమయంలో డ్రెస్ కోడ్ ను గుర్తుపెట్టుకుంటే మంచిది. దేవాలయంలో ప్రవేశించే మహిళలు సాంప్రదాయక దుస్తులు ధరించి అమ్మవారిని దర్శించుకోవడం మంచిది.

కాసర్‌గోడ్ జిల్లా కేరళరాష్ట్ర ఉత్తర భూభాగంలో ఉంది.

కాసర్‌గోడ్ జిల్లా కేరళరాష్ట్ర ఉత్తర భూభాగంలో ఉంది.

కాసర్‌గోడ్ జిల్లా కేరళరాష్ట్ర ఉత్తర భూభాగంలో ఉంది. జిల్లా కొబ్బరి నార మరియు చేనేత వస్త్రాలకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. జిల్లాలో తులునాడు మరియు కూర్గ్ వంటి ప్రముఖ పర్యాటక ఆకర్షక ప్రాంతాలు ఉన్నాయి. జిల్లాలో 29.3 కి.మీ పొడవైన సముద్రతీరం ఉంది. జిల్లాలో పర్వతశ్రేణి కూడా ఉంది. జిల్లాలో కొండలు, నదులు, గుడులు, సముద్రతీరాలు మరియు కోటలు ఉన్నాయి.

ఎలా వెళ్ళాలి:

ఎలా వెళ్ళాలి:

కాసరగూడ నుండి ఇతర పట్టణాల నుండి బస్ సౌకర్యం ఉంది. కెఎస్ ఆర్టిస్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.
కాసరగూడ రైల్వే స్టేషన్ ప్రధాన నగరంలో ఉంది.
మంగళూరు అంతరాష్ట్రియ విమాన సౌకర్యం కూడా ఉంది. ఇది కాసరగూడకు సుమారు 50కిలోమీటర్ల దూరంలో ఉంది.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+