Search
  • Follow NativePlanet
Share
» »అతి త‌క్కువ బ‌డ్జెట్‌లో ట్రిప్ ప్లానింగ్‌కు... తెలంగాణ‌లోని మినీ మాల్దీవులు ఉత్త‌మం.!

అతి త‌క్కువ బ‌డ్జెట్‌లో ట్రిప్ ప్లానింగ్‌కు... తెలంగాణ‌లోని మినీ మాల్దీవులు ఉత్త‌మం.!

హైద‌రాబాద్ న‌గ‌ర‌వాసులు వారాంతంలో ఎక్క‌డికైనా వెళ్లాల‌ని ప్లాన్ చేస్తున్నారా..? వీకెండ్ బోర్ కొట్ట‌కుండా ఉండేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధంచేస్తుకుంటున్నారా...? అయితే, మ‌రెందుకాల‌స్యం దేశంలోని ఇత‌ర ప్రాంతాల‌కు సంద‌ర్శ‌న‌కు వెళ్లే బ‌దులు హైద‌రాబాద్‌లోని అద్భుత‌మైన ప్ర‌దేశాలు ఎన్నో దాగి ఉన్నాయి. అందులో ముఖ్యంగా అతి త‌క్కువ బ‌డ్జెట్‌లో మాల్దీవుల‌ను చూసిన అనుభూతిని పొందొచ్చు. హైదార‌బాద్‌లో మాల్దీవులేంటీ..? అని అనుకుంటున్నారా..? అదేనండి తెలంగాణ‌ మినీ మాల్దీవులుగా పేరుగాంచిన సోమ‌శిల ప‌ర్యాట‌క ప్రాంతం.

ప‌చ్చ‌ని ప్ర‌కృతి అందాలు..

రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సోమశిలను తెలంగాణ మినీ మాల్దీవులు అని పిలుస్తుంటారు. ఈ వీకెండ్‌లో అతి త‌క్కువ బ‌డ్జెట్‌తో మీరు ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించేయొచ్చు. ఇటీవ‌లే ఈ ప్రాంతానికి జాతీయ ఉత్తమ గ్రామీణ పర్యాటక అవార్డు కూడా దక్కింది. ఈ ప్ర‌దేశం హైదరాబాద్ న‌గ‌రానికి సుమారు 180 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. సోమశిల పర్యాటక ప్ర‌దేశంగా ఎంతో పేరుగాంచింది. ఇక్క‌డి ప‌చ్చ‌ని అడ‌వులు, నదీ జలాలు ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. ఈ ప్రాంతం వీకెండ్‌ ట్రిప్‌కు ఎంతో అనువైన‌దని చెప్పుకోవ‌చ్చు.

ttemple

ఆ పేరెలా వ‌చ్చింది...

సోమ‌శిల కృష్ణా నదీ తీర ప్రాంతంలోని ఒక ద్వీపంగా మాదిరిగా ఉంటుంది. ఈ గ్రామంలో కృష్ణా బ్యాక్‌వాటర్ ఉండటంతో ప‌ర్యాట‌కుల‌కు ఒక ద్వీపం వంటి అనుభూతి కలుగుతుంది. అందుకే ఈ ప్ర‌దేశాన్ని అంద‌రూ మినీ మాల్దీవులు అని పిలుస్తుంటారు. ఇక్క‌డి ప్ర‌కృతి అందాలు ప‌ర్యాట‌కుల‌కు సాద‌ర ఆహ్వానం ప‌లుకుతాయి. అందుకే ఇక్క‌డికి వ‌చ్చే వారి కోసం రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తోంది. సంద‌ర్శకులకు బోటింగ్ సదుపాయం కూడా ఉంది. ఇక్కడే బస చేసేందుకు టూరిస్టుల‌కు కాటేజీలు కూడా నిర్మించారు.

vizag beaches

కృష్ణా నదీ తీరంలో బోటు షికారు చేస్తూ ఇక్క‌డి ప‌చ్చ‌ని అడ‌వి అందాల‌ను ప్ర‌త్య‌క్షంగా వీక్షించొచ్చు. అంతేకాదండోయ్‌..ఇక్క‌డి ప్రత్యేక‌ చేప వంటకాల రుచుల‌ను కూడా ఆస్వాదించొచ్చు. ఇక్కడి నుంచి శ్రీశైలాన్ని కూడా వెళ్లొచ్చు. అది కూడా బోటింగ్ ద్వారా...సోమశిలలో సంద‌ర్శించేందుకు ఎన్నో పుణ్య‌క్షేత్రాలు ఉన్నాయి. ఇక్క‌డ సుమారు 15 దేవాలయాలు ఉన్నాయి. ఇక్క‌డికి వ‌చ్చి భ‌క్తులు త‌మ మొక్కుల‌ను చెల్లించుకోవ‌చ్చు.

hyderabad beaches

చేరుకోవ‌డం ఎలా..?

సోమశిలను చేరుకునేందుకు అన్ని ర‌వాణా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఇక‌, హైదరాబాద్‌ నుంచి వెళ్లాలనుకునేవారు నేషనల్ హైవే 65పై నుంచి వెళ్లాల్సి ఉంటుంది. హైదార‌బాద్ సిటి నుంచి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో సోమ‌శిల ఉంటుంది. 3 నుంచి 4 గంటలు ప్రయాణంలో అక్క‌డికి వెళ్లొచ్చు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో సోమ‌శిల గ్రామం ఉంది. సోమ‌శిల‌ను చేరుకునేందుకు టూరిజం డిపార్ట్ మెంట్ నుంచి ప్రత్యేక బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. సొంత వెహికల్స్ వెళ్లేవారు కూడా వెళ్లొచ్చు. మరెందుకాల‌స్యం ఈ వారంతంలో సోమశిల టూర్‌కు సిద్ధమ‌వ్వండి మ‌రి..

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+