Search
  • Follow NativePlanet
Share
» »ఈ రంద్రం గుండా అవతలివైపునకు వెలితే వద్దన్నా సంతానం?

ఈ రంద్రం గుండా అవతలివైపునకు వెలితే వద్దన్నా సంతానం?

ఉత్తరాఖండ్ లోని ప్రముఖ హిల్ స్టేషన్ ముక్తేశ్వర్ గురించిన కథనం.

చిన్నప్పుడు దారిలో వెలుతూ జామకాయలు, మామిడికాయలను తెంపుకు తినడం, మనలనుపట్టుకోవడానికి వచ్చిన కాపాలాదారు నుంచి పారిపోవడం మరిచిపోలేని చిలిపి అనుభూతులు మిగులుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అటు వంటి ఓ ప్రదేశంలో పర్యాటకానికి వెలితే మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ ప్రదేశం మనలను సంతానవంతులనూ చేస్తుంది. ఇవన్నీ వినడానికి బాగుంటాయి. అయితే వాస్తవంగా అటువంటి చోటు ఉందా అనేది మీ ప్రశ్న అయితే దానికి సమాధానం కోసం ఈ కథనం చదవండి...

ముక్తేశ్వర

ముక్తేశ్వర

P.C: You Tube

దారి పొడుగునా పీచ్, ఫ్లమ్ పండ్లను తెంపుతూ ట్రెక్కింగ్ ద్వారా ముందుకు సాగిపోవడం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. అటువంటి ప్రదేశమే ముక్తేశ్వర్. కుమోన్ పర్వత శిఖరాల మధ్య సముద్ర మట్టం నుంచి 7500 అడుగుల ఎత్తులో ఈ ముక్తేశ్వరం ఉంటుంది.

ముక్తేశ్వర

ముక్తేశ్వర

P.C: You Tube
తమ సెలవులను గడపడానికి ఢిల్లీ వాసులు ఎక్కువగా ఇక్కడికి వెలుతుంటారు. ఇక్కడ ఫ్లమ్, పీచ్, ఆపిక్రోట్ తో మరెన్నో పండ్ల చెట్లు మీకు స్వాగతం పలుకుతాయి.

ముక్తేశ్వర

ముక్తేశ్వర

P.C: You Tube

ముక్తేశ్వరం నుంచి 9 కిలోమీటర్ల దూరంలో కపిలేశ్వరం దేవస్థానం ఉంది. అంతదూరం మీరు నడవలేరనుకొంటే అక్కడికి నేరుగా వాహనంలో వెళ్లవచ్చు. ఈ దేవాలయం అత్యంత పురాతనమైనది.

ముక్తేశ్వర

ముక్తేశ్వర

P.C: You Tube

ఇక్కడ ప్రధాన దైవం శివుడు. సుమారు 8-శతాబ్దాల మధ్య ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఇక ట్రెక్కింగ్ ద్వారా వెళితే మీకు పెద్ద గుట్ట కనిపిస్తుంది. దీనిని చౌలి కీ జలి అని పిలుస్తారు.

ముక్తేశ్వర

ముక్తేశ్వర

P.C: You Tube

ఈ గుట్ట పైకి చేరుకొంటే చుట్టూ ఉన్న హిమాలయ పర్వతాలతో పాటు కమోన్ పర్వత లోయ ప్రాంతాల అద్భుత సౌదర్యాలను చూడవచ్చు. ఈ స్థంలో రాక్ క్లైంబింగ్, జీప్ లీనింగ్ వంటి సాహస క్రీడలెన్నో అందుబాటులో ఉంటాయి.

ముక్తేశ్వర

ముక్తేశ్వర

P.C: You Tube

ముఖ్యంగా శివరాత్రి పర్వదినన సంతానలేమితో బాధపడేవారు ఈ గుట్ట పైభాగానికి చేరుకొని అక్కడ ఉన్న రంద్రం ద్వారా అటు వైపుకి వెళితే వారికి సంతాన భాగ్యం లభిస్తుందని చెబుతారు.

ముక్తేశ్వర

ముక్తేశ్వర

P.C: You Tube

వీకెండ్ లో ఇక్కడ ఎక్కువ మంది పర్యాటకులు ఉంటారు. అందువల్ల మిగిలిన రోజుల్లో ఇక్కడికి వెళ్లడం బాగుంటుంది. ఇక్కడి శివాలయం నిర్మించి దాదాపు 350 ఏళ్లవుతున్నట్లు చెబుతారు.

ముక్తేశ్వర

ముక్తేశ్వర

P.C: You Tube

ఇక్కడ శివుడు ఓ రాక్షసుడిని సంహరించడమే కాకుండా అతనికి ముక్తి ప్రసాదించినట్లు స్థానిక కథనం. అందువల్లే ఇక్కడ కొలువై ఉన్న పరమేశ్వరుడిని ముక్తేశ్వరుడిగా పిలుస్తారు.

ముక్తేశ్వర

ముక్తేశ్వర

P.C: You Tube

పూర్వం ముక్తేశ్వర మహారాజు ఇక్కడ ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆయన శిష్యుడైన సన్ శుదానంద జీ ఇక్కడ ఈ ధ్యాన కేంద్ర నిర్వహణను చూస్తున్నారు. ఈ స్థలం ధ్యానానికి, యోగకు అత్యంత అనువైనది.

ముక్తేశ్వర

ముక్తేశ్వర

P.C: You Tube

ముక్తేశ్వర చూడటానికి మార్చి నుంచి జులై మధ్యలో వెళ్లడం అత్యంత యోగ్యమైనది. మంచు తెమ్మరలో ప్రక`తిలో మీరు మమేకం కావాలంటే జనవరి నుంచి ఫిబ్రవరిలో కూడా ఇక్కడకు వెళ్లవచ్చు. చలి ఎక్కువగా ఉంటుంది.

ముక్తేశ్వర

ముక్తేశ్వర

P.C: You Tube

జూన్ లో ఇక్కడ పండ్లతోటలు విరబూసి అందంగా కనిపిస్తాయి. పర్యాటక రంగంలో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్న ముక్తేశ్వరం ఉత్తరఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ జిల్లాలలో ఉంది.

ముక్తేశ్వర

ముక్తేశ్వర

P.C: You Tube

నైనిటాల్ నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఈ ముక్తేశ్వరం ఉంటుంది. హవల్దా నుంచి 72 కిలోమీటర్లు, ఢిల్లీ నుంచి 343 కిలోమీటర్ల దూరంలో ఈ ముక్తేశ్వరం ఉంటుంది.

ముక్తేశ్వర

ముక్తేశ్వర

P.C: You Tube

ఢిల్లీ నుంచి ముక్తేశ్వరం చేరుకోవడానికి రోడ్డు ప్రయాణం చాలా అనుకూలం. స్వతం వాహనం కారు ద్వారా ప్రయాణానికి ఏడు గంటల సమయం పడుతుంది. ముక్తేశ్వరానికి నేరుగా రైలు సౌకర్యం లేదు.

ముక్తేశ్వర

ముక్తేశ్వర

P.C: You Tube

ముక్తేశ్వరానికి దగ్గర్లో అంటే కాత్కూడమ్. ఇది ఢిల్లీ నుంచి 327 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఉత్తర దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి ముక్తేశ్వరానికి నేరుగా బస్సు సౌకర్యం ఉంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+