Search
  • Follow NativePlanet
Share
» »ముంబై వర్షాలు - మహానగర సుఖాలు !

ముంబై వర్షాలు - మహానగర సుఖాలు !

తీక్షణమైన ఎండలను అనుభవించిన తర్వాత వచ్చే వర్షాలు ప్రజలకు ఎంతో ఆహ్లాదం కలిగిస్తాయి. ముంబై స్థానికులకు మొట్టమొదటి సారిగా వర్ష రుతువులో పడే వర్షం అద్భుత ఆనందం కలిగిస్తుంది.

ఈ సమయంలో వీధులు పరిశీలిస్తే, అన్ని వయసుల వారు చల్లని గాలులకై వీధులలో తిరగటం కనపడుతుంది. వీరి చేతులలో వేడి వేడి టీ కప్పులు, పకోడీలు, పావ్ భాజీలు వంటి వేడి స్నాక్స్ కూడా కనపడుతూ వుంటాయి.

వయసు మళ్ళిన వారు గతం లోని మంచి రోజుల గురించి మాట్లాడుకుంటే, చిన్న వయసు వారు వారి ప్రియ స్నేహితులతో ముచ్చట్లు ఆడటం కూడా చూడవచ్చు. వర్ష రుతువు మొదలైతే చాలు నగర రూపమే మారిపోతుంది. మరి ఇంతటి ఆహ్లాదకర వాతావరణం లో ముంబై లోని కొన్ని ప్రదేశాలు ఎలా ఉంటాయనేది పరిశీలిద్దాం.

ముంబై హోటల్ వసతులకు ఇక్కడ క్లిక్ చేయండి

బాంద్రా బ్యాండ్ స్టాండ్

బాంద్రా బ్యాండ్ స్టాండ్

బాంద్రా బ్యాండ్ స్టాండ్ లో ఎవరికీ ఎవరూ తెలియరు. మరి చిరు జల్లుల ఆనందాలు పొందేందుకు, అదృష్టం బాగుంటే, వారి అభిమాన సినీ నటులను చూసేందుకు బాంద్రా వెళ్ళాల్సిందే. బ్యాండ్ స్టాండ్ మార్గం తాజ్ హోటల్ నుండి సుమారు ఒక కి. మీ. వరకూ విస్తరించి వుంటుంది. అరేబియా మహా సముద్రం పై నుండి చల్లని గాలులు సిటీ లోకి చొరబడుతూ వుంటాయి. ఈ ఆహ్లాదకర వాతావరణం కొరకు బాలి వుడ్ యాక్టర్ లు కూడా వస్తూ వుంటారు.

Photo Courtesy: Anuradha Sengupta

గేట్ వే అఫ్ ఇండియా

గేట్ వే అఫ్ ఇండియా


గేట్ వే అఫ్ ఇండియా ముంబై లోని ప్రసిద్ధ హెరిటేజ్ సైట్ లలో ఒకటి. ఇక్కడ మీరు రుతుపవనాల మాజిక్ చూడవచ్చు. స్థానిక రుచుల స్నాక్స్ తింటూ సముద్రం వంక చూస్తూ ఎంతో సమయం గడిపేయవచ్చు. ఇంకా మంచి అనుభూతి కావాలనుకుంటే, తాజ్ పాలస్ హోటల్ కు వెళ్ళండి. ఇక్కడ మీరు కొన్ని లెబనీస్ డిషెస్ కూడా తినవచ్చు.

Photo Courtesy: Ting Chen

హాజీ ఆలి మాస్క్

హాజీ ఆలి మాస్క్

హాజీ ఆలి మాస్క్ వద్ద వాతావరణం వర్షం పడితే ఎంతో విభిన్నంగా వుంటుంది. ఈ మసీదు సరిగ్గా సముద్రం మధ్యలో వుంది ప్రధాన భూభాగానికి ఒక చిన్న మార్గం ద్వారా కలుపబడి వుంది. ఆలాలూ పెద్ద ఎత్తున వస్తే జాగ్రత్త పడాలి సుమా....సముద్రపు అలలు మీ ఆడాలను తాకుతూ వుంటే, మార్గం అంతా హాయి గా నడవ వచ్చు. ఈ అనుభూతి విలువ కట్టలేనిది.

Photo Courtesy: Sourav Das

జుహు బీచ్

జుహు బీచ్

జుహు బీచ్ గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. విశాలమైన సముద్రం ఎదురుగా కనపడుతుంది. చుట్టూ అధిక జనాలు. సాయంత్రం అయిందంటే చాలు వీరు అంతా ఇక్కడకు వచ్చి ఆనందిస్తారు. చిరు తిండ్లు అనేక రకాలు దొరుకుతాయి. ఒక ప్లేట్ వేడి వేడి పావ్ భాజీ, ఒక గ్లాస్ వేడి టీ ఈ ప్రదేశంలో మీకు స్వర్గం చూపుతాయి.

Photo Courtesy: Swaminathan

మెరైన్ డ్రైవ్

మెరైన్ డ్రైవ్

ఈ ప్రదేశాన్ని సాధారణంగా క్వీన్స్ నెక్లెస్ అంటారు. దీనికి కారణం దీని కోస్తా తీరం వెంబడి సాయంత్రాలు వెలిగే దీపాల ఆకారం. ఈ దృశ్యాలను ఆనందిస్తూ ఎంతోమంది జంటలు కనపడతారు. వర్షం పడితే, ఈ జంటల జోరు మరింత అధికం అవుతుంది. శృంగార భరిత ఆనందాలు అధికం అవుతాయి. ఇక్కడకు మీరు జంటగా నే రావాలి సుమా !

Photo Courtesy: Michael Korcuska

వర్లి

వర్లి

ఇది మెరైన్ డ్రైవ్ వలెనె వుంటుంది. సెంట్రల్ ముంబై లో వర్ష వాతావరణం అనుభవించేందుకు ఇది ఒక అద్భుత ప్రదేశం. ఇక్కడ కూర్చుని వేడి వేడి పావ్ భాజీ లాంటి చిరు తిండ్లు తింటూ సముద్రం చూస్తూ గంటలు గడిపేయవచ్చు.

Photo Courtesy: Swaminathan

.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+