వేసవి సెలవుల్లో, ఇంట్లో ఖాళీగా కూర్చొని బోర్ ఫీలవుతున్నారా..? ఎక్కడికైనా విహారయాత్రలు ప్లాన్ చేస్తున్నారా..? అయితే, మరెందుకాలస్యం ఈ సమ్మర్‌లో సందర్శించేందుకు దేశంలో ఎన్నో ప్రసిద్ధిచెందిన ప్రాంతాలు చాలానే ఉన్నాయి. సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిళ్లు వంటిది తమిళనాడు. ఈ సెలవుల్లో తమిళనాడులో సందర్శించేందుకు ప్రసిద్ధిచెందిన పర్యాటకల ప్రదేశాలు చాలానే ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ రాష్ట్రాలలో తమిళనాడు ఒకటి.
తమిళనాడు దాని వారసత్వం, దేవాలయాలు, చరిత్రకు ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ఈ రాష్ట్రం భారతదేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. తమిళనాడులోని అన్ని నగరాలు చారిత్రాత్మక, మతపరమైన మరియు ప్రకృతి సౌందర్యంతో గొప్పవి. వేసవి సెలవుల్లో ఇక్కడికి వెళ్లడం వల్ల ఓ అద్భుతమైన అనుభూతిని పొందొచ్చు. తమిళనాడులో సందర్శించడానికి ఉత్తమమైన నగరాల గురించి ఇప్పడు తెలుసుకుందాం.
తమిళనాడు రాష్ట్ర సంస్కృతి, చరిత్ర ప్రతి ఒక్క పర్యాటకుడిని ఇక్కడికి వచ్చేలా చేస్తోంది. ఈ వేసవి సెలవుల్లో తమిళనాడును సందర్శించాలని ఆలోచిస్తున్నట్లయితే మాత్రం మీ జాబితాలో తప్పకుండా మదురై, రామేశ్వరం వంటి చారిత్రక నగరాలతో పాటు మహాబలిపురం ప్రదేశాలను కూడా చేర్చండి. రండి. ఈ అందమైన నగరాల గురించి తెలుసుకుందాం.

మహాబలిపురం
తమిళనాడులోని మహాబలిపురం ప్రసిద్ధిచెందిన ప్రదేశం. దీనిని మామల్లపురం అని కూడా అంటారు. ఇది ఆగ్నేయ భారతదేశం, తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లా లోని ఒక పట్టణం. ఇది కంచి పట్టణానికి సుమారు 66 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది రాష్ట్ర రాజధాని చెన్నైకి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది తీర దేవాలయం, గణేష్ రథ దేవాలయం, వరాహ గుహ దేవాలయం వంటి అనేక చారిత్రక ప్రదేశాలతో కూడిన పురాతన నగరం మహాబలిపురం. కుటుంబ సమేతంగా సందర్శించడానికి ఇది గొప్ప ప్రదేశమని చెప్పుకోవచ్చు. తమిళనాడు చరిత్రను తెలుసుకోవాలనుకునేవారు కూడా ఈప్రాంతాన్ని సందర్శించొచ్చు.

కాంచీపురం
కాంచీపురం, కంచి, లేదా కాంజీపురం అని పిలుస్తుంటారు. కాంచీపురం జిల్లా తమిళనాడు రాష్ట్రంలో బంగాళాఖాతం తీరంలో ఉన్న చెన్నై నగరానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జిల్లా రాజధాని కాంచీపురం పాలార్ నది ఒడ్డున ఉంది. కాంచీపురం చీరలకు, దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన నగరం. కాంచీపురంలో చూడదగ్గ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఈ నగరం ఎంతో పురాతనమైనది. వేల సంవత్సరాల కంటే పాతది. తమిళనాడు ఒకప్పుడు చోళ మరియు పల్లవ రాజవంశాలచే పాలించబడింది. కాంచీపురం సందర్శించేందుకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యంగా కైలాసనాథర్ ఆలయం, కంచి కామాక్షి అమ్మన్ దేవాలయం. ఈ ఆలయాలను వీక్షించేందుకు నిత్యం వేలాది మంది ప్రజలు ఇక్కడికి వస్తుంటారు.
మధురై
మదురై, దక్షిణ తమిళనాడులోని నగరం. ఈ ప్రాంతం ఒక హిందూ ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుగాంచింది. ఇది వైగై నదీ తీరాన ఉంది. మధురై ప్రపంచంలోని పురాతనకాల నివాస నగరాలలో ఒకటి. ఇక్కడ ఉన్న మీనాక్షి అమ్మన్ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ అమ్మవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుండి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఇది పార్వతీ దేవి మీనాక్షి రూపం. ఈ ఆలయాన్ని మీనాక్షి సుందరేశ్వరాలయం అని కూడా పిలుస్తుంటారు.
నీలగిరి కొండలు
తమిళనాడులోని నీలగిరి కొండలు ఎంతో అందంగా, పచ్చదనంతో నిండి ఉంటాయి. ఎవరైనా సెలవుల్లో పర్వతాలను ఆస్వాదించాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ ప్రదేశానికి రావాల్సిందే. ఇక్కడ ఎత్తైన పర్వతాలు, దట్టమైన అడవులు, జలపాతాలు, ప్రకృతి అందాలు పర్యాటకుల హృదయాలను గెలుచుకుంటాయి.

రామేశ్వరం
శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన రామేశ్వరం తమిళనాడు రాష్ట్రంలోనే ఉంది. ఈ ఆలయం అగ్నితీర్థం, ధనుష్కోడి, పంచముఖి హనుమాన్ దేవాలయంతో కూడిన ప్రధాన పుణ్యక్షేత్రం. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు.



Click it and Unblock the Notifications













