Search
  • Follow NativePlanet
Share
» »రిషికేష్‌లోని టూరిస్ట్ అట్రాక్షన్ ప్రాంతాలివే.. త‌ప్ప‌క చూడాల్సిందే!

రిషికేష్‌లోని టూరిస్ట్ అట్రాక్షన్ ప్రాంతాలివే.. త‌ప్ప‌క చూడాల్సిందే!

మే నెల మొద‌లుకాగానే విప‌రీత‌మైన ఎండ‌ల‌తో ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. అయితే, గత కొన్నిరోజుల నుంచి దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం వాతావ‌ర‌ణంలో ప‌లు మార్పులు వ‌చ్చాయి. కొన్ని ప్ర‌దేశాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. అది తాత్కాలిక ఉప‌శ‌న‌మంగా మాత్ర‌మే క‌నిపిస్తోంది. మరికొన్ని రాష్ట్రాల్లో మాత్ర‌మ విప‌రీత‌మైన ఎండ‌లు, ఉక్క‌పోత‌తో ప్ర‌జ‌లు విల‌విల‌ల్లాడిపోతున్నారు. ఇక‌, ఈ స‌మ్మ‌ర్ హాలీడేస్‌లో విహార‌యాత్ర‌ల‌కు వెళ్లాల‌నుకునేవారు చాలామంది ఉంటారు. చ‌ల్ల‌ని, ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్లాలని మ‌రికొంద‌రు భావిస్తుంటారు.

అలాంటి వారు ఇప్పుడు ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌‌ను సందర్శించడం ఎంతో ఉత్త‌మం. ఇది ప్రకృతి అందాలతో నిండి ఉండే అద్భుతమైన ప్రదేశమే కాకుండా ఎంతో మంది ప‌ర్యాట‌కులు ఇష్టపడే గమ్యస్థానంగానూ పేరు సాధించింది. రిషికేశ్ ప్రధానంగా ఆధ్యాత్మికత పరంగా, యోగా కేంద్రంగా, సాహస ప్రియుల గమ్యస్థానంగా మంచి గుర్తింపు పొందిన ప్ర‌దేశం. ఈ సీజ‌న్‌లో ఈ ప్ర‌దేశాన్ని త‌ప్ప‌కుండా వీక్షించాల్సందే. మ‌రెందుకాల‌స్యం ఇక్క‌డి ప్ర‌కృతి అందాల‌తో పాటు ప్ర‌సిద్ధిచెందిన ప్ర‌దేశాల‌ను వీక్షించేందుకు ఇక‌, బ‌య‌లుదేరాల్సిందే.

రిషికేష్‌లో బంగీ జంపింగ్ నుండి రివర్ రాఫ్టింగ్ వరకు అనేక కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు. రిషికేశ్ ఢిల్లీ నుండి కేవలం కొన్ని గంటల దూరంలో మాత్ర‌మే ఉంటుంది. దీని కారణంగా, అది రెండు రోజుల సెలవు లేదా సుదీర్ఘ వారాంతం కావచ్చు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్ ప్ర‌జ‌లు త‌ప్ప‌కుండా రిషికేష్‌లోని ఈ ప్రాంతాల‌ను చూడాల్సిందే. ఇక‌, దేశంలోని ఇత‌ర ప్రాంతాల‌నుంచి కూడా ప్ర‌జ‌లు ఇక్క‌డికి చేరుకోవ‌చ్చు. రిషికేశ్ చుట్టూ ఉన్న ఈ అంద‌మైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

rishikesh places

దోడితాల్

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో ఉన్న దోడితాల్, పచ్చని పర్వతాలతో చుట్టుముట్టబడిన ఒక అందమైన సరస్సు అని చెప్పుకోవ‌చ్చు. ఇది ప‌ర్యాట‌కుల‌కు నైనిటాల్ వంటి అనుభూతిని కలిగిస్తుంది. పురాణాల ప్రకారం, గణేశుడు ఇక్కడ జన్మించాడ‌ని చెబుతుంటారు. అందుకే ఈ ప్రాంతాన్ని గణేశాల్ అని కూడా పిలుస్తుంటారు. ట్రెక్కింగ్ ఔత్సాహికులకు ఈ ప్రాంతం ఎంతో అనువైన‌ది.

లాండూర్‌

ఉత్తరాఖండ్‌లోని లాండూర్ చాలా అందమైన ప్రదేశం. ఇక్క‌డ‌ దేవదార్ పైన్ చెట్ల దట్టమైన అడవుల మధ్య విస్త‌రించి ఉన్నాయి. కుటుంబస‌భ్యులు లేదా స్నేహితులు లేదా భాగస్వామితో ఈ ప్రాంతాన్నీ వీక్షించొచ్చు. వేసవి కాలంలో ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. లాండూర్‌లో సందర్శించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఇది ఒక సుందరమైన, ఆహ్లాదకరమైన పట్టణంగా అభివ‌ర్ణిస్తుంటారు.

rishikesh

ఇది ఎలాంటి పర్యాటకులనైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. అంత‌టి చారిత్రక నేపథ్యం ఈ ప్రాంతానికి ఉంది. అక్కడి నిర్మాణాలు సైతం ప‌ర్యాట‌కులను ఎంత‌గానో ఆకర్షిస్తాయి. ఇక‌, ఈ లాండౌర్ నుండి ఆయా హిమాలయ పర్వతాలను చూడొచ్చు. లాండూర్‌లో ఒకప్పుడు నాలుగు బ్రిటీష్ కాలం నాటి చర్చీలు ఉండేవి. ఇప్పుడవి రెండుకు మాత్రమే పరిమితమయిన‌ట్లు తెలుస్తోంది.

కాన్‌థాల్‌

ముస్సోరీ, నైనిటాల్, ముక్తేశ్వర్, అల్మోరా, ఇవన్నీ ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధిచెందిన ప్రాంతాల‌ని చెప్పుకోవ‌చ్చు. ఉత్త‌రాఖండ్ వ‌చ్చిన వారు త‌ప్ప‌కుండా ఈ ప్రాంతాల‌ను వీక్షిస్తారు. ఈ ప్రాంతాలు కాకుండా ఇక్క‌డి మ‌రో అంద‌మైన ప్రాంతం కాన్‌థాల్‌. ఈ ప్ర‌దేశం ఎత్తైన పర్వతాలు, పచ్చని అడవులు మరియు పెద్ద దేవదారు చెట్లకు ప్ర‌సిద్ధిచెందాయి. ఇవీ ఈ ప్ర‌దేశ అందాన్నే మార్చేస్తుంటాయి.

More News

    Read more about: rishikesh uttarakhand
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+