Search
  • Follow NativePlanet
Share
» »ఆయన విగ్రహాన్ని ఓడలో తరిలిస్తూ ఈస్ట్ ఇండియా కంపెనీ ఓడ ఏమయ్యిందో తెలుసా? అంత విశిష్ట విగ్రహ దర్శనంతో

ఆయన విగ్రహాన్ని ఓడలో తరిలిస్తూ ఈస్ట్ ఇండియా కంపెనీ ఓడ ఏమయ్యిందో తెలుసా? అంత విశిష్ట విగ్రహ దర్శనంతో

తిరుచెందూర్ లోని మురుగన్ దేవాలయం గురించి కథనం

ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిథులకు ఆ స్వామి చుక్కలు చూపించాడు. తనకు ఇష్టమైన ప్రాంతం నుంచి వేరోచోటికి తరలించాలనుకొన్న వారి ఆటలు సాగనివ్వలేదు. మధ్యలో వారు విగ్రహాన్ని వదిలి పలాయనం చిత్తగించారు. దాదాపు ఐదేళ్ల తర్వాత తిరిగి ఆ విగ్రహం సముద్ర గర్భంలో నుంచి దేవాలయం గర్భగుడిలోకి చేరుకొంది.

ఇందుకు సాక్ష్యం కూడా ఉంది. ఇదిలా ఉండగా ఇక్కడ స్వామివారి విభూతి బంగారు నాణ్యాలుగా మారిపోయింది. అంతేకాకుండా ఆయన మహిమ వల్ల బుట్టెడు ఉప్పు అనంత సంపదగా మారిపోయింది. ఇంతటి విశిష్టమైన విగ్రహంల కగిలిన దేవాలయం దేవాలయాల రాష్ట్రంగా చెప్పబడే తమిళనాడులో ఉంది. ఈ నేపథ్యంలో ఆ దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం...

సముద్ర తీరంలో

సముద్ర తీరంలో

P.C: You Tube

తమిళనాడులోని ఆరు సుబ్రహ్మణ్యక్షేత్రాల్లో అత్యంత విశిష్టమైనది తిరుచెందూర్ లోని సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం. ఇక్కడ సుబ్రహ్మణ్యస్వామి చిన్న బాలుడి రూపంలో దర్శనమిస్తారు. మిగిలిన ఐదు దేవాలయాలన్నీ కొండపై ఉంటే ఇక్కడ మాత్రమే సముద్ర తీరంలో స్వామివారు కొలువై ఉంటారు.

డచ్ ఈస్ట్ ఇండియా

డచ్ ఈస్ట్ ఇండియా

P.C: You Tube

తిరుచెందూర్ లోని మురుగన్ దేవాలయాన్ని 1646 నుంచి 1648 మధ్యలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్రమించుకొంది. పోర్చుగీసువారితో యుద్ధానికి అవసరమైన ఆయుధాలను ఆ సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధులు ఈ దేవాలయంలో దాచుకొనేవారు.

వదిలి వెళ్లిపోయారు

వదిలి వెళ్లిపోయారు

P.C: You Tube

స్థానిక భక్తులు ఎంతగానో పోరాడినా తిరిగి ఆలయాన్ని తమ స్వాధీనంలోని తీసుకోలేకపోయారు. ఇదిలా ఉండగా చివరికి స్థానిక నాయకుల ఒత్తిళ్లు, దాడులు భరించలేక ఆలయాన్ని ఈస్ట ఇండియా కంపెనీ వారు వదిలి వెళ్లిపోయారు.

మూలవిరాట్టును తమతో పాటు

మూలవిరాట్టును తమతో పాటు

P.C: You Tube

అయితే ఇలా వెళ్లే ముందు తమతో పాటు దేవాలయంలోని మూలవిరాట్టును తమతో పాడు ఓడలో తీసుకెళుతున్నారు. ఓడ సముద్ర మధ్యలో ఉండగానే అకస్మాత్తుగా తుఫాను రావడం ప్రారంభించింది. దీంతో ఓడ క్యాప్టెన్ ఆ విగ్రహాన్ని సముద్రం మధ్యలో పడేశాడు.

తుఫాను

తుఫాను

P.C: You Tube

దీంతో వెంటనే తుఫాను ఆగిపోయింది. ఇది జరిగిన దాదాపు ఐదేళ్ల తర్వాత సుబ్రహ్మణ్యస్వామి పరమభక్తుడైన వాడమలయప్పన్ పిళ్లై కు స్వామి కలలో కనిపించి సముద్రంతో తాను ఉన్న చోటును చెప్పాడు.

 సముద్రంలోని విగ్రహాన్ని గుర్తించి

సముద్రంలోని విగ్రహాన్ని గుర్తించి

P.C: You Tube

దీంతో ఆయన స్థానిక గ్రామపెద్దలను తీసుకుని సముద్రంలోకి వెళ్లి విగ్రహాన్ని గుర్తించి బయటికి తీసుకువచ్చాడు. అటు పై విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్టించారు. ఇందుకు సంబంధించిన పెయింటింగ్ మొత్తం ఆలయంలో మనం చూడవచ్చు.

తొమ్మిది అంతస్తుల రాజగోపురం

తొమ్మిది అంతస్తుల రాజగోపురం

P.C: You Tube

ఈ దేవాలయంలోని తొమ్మిది అంతస్తుల రాజగోపురం చూడదగినది. ఈ గోపురం నిర్మాణానికి సంబంధించి ఆసక్తికర కథనం ప్రచారంలో ఉంది. దాదాపు మూడు వందల ఏళ్లకు పూర్వం తిరువాయదురై మఠంలో నివశించే దేశికామూర్తికి ఈ సుబ్రహ్మణ్యస్వామి కలలో కనిపించాడు.

పేదవాడు

పేదవాడు

P.C: You Tube

ఆలయానికి తొమ్మిది అంతస్తుల రాజగోపురం నిర్మించాలని సూచించాడంటా. అయితే దేశికామూర్తి కడు పేదవాడు. దీంతో ఆలయ నిర్మాణం ఎలా అని అలోచిస్తూనే స్వామి వారి సూచనమేరకు గోపురం నిర్మాణానికి పూనుకొన్నాడు.

వీభూతి

వీభూతి

P.C: You Tube

గోపుర నిర్మాణానికి వచ్చిన కూలీలకు కూలికి సొమ్ము బదులు వారు చేసిన పనిని అనుసరించి స్వామివారి వీభూతిని ఇచ్చేవాడు. ఆ కూలీలు ఆ వీభూతిని తీసుకొని కొంత దూరం వెళ్లిన తర్వాత బంగారు నాణ్యాలుగా మారేవి.

ఆరు అంతస్తులు

ఆరు అంతస్తులు

P.C: You Tube

ఈ విషయం ఆనోట ఈనోట తెలిసి ప్రతి ఒక్కరూ ఆలయ నిర్మాణానికి సహకరించేవారు. అదేవిధంగా గోపుర నిర్మాణానికి కావాల్సిన అనేక ముడి పదార్థాలు కూడా ఇలాగే సమకూరేవి. ఈ విధంగా రాజగోపురం నిర్మాణం ఆరు అంతస్తులు పూర్తి చేసుకొంది.

 ఒక బుట్టు ఉప్పు

ఒక బుట్టు ఉప్పు

P.C: You Tube

అటు పై వీభూతి బంగారంగా మారడం నిలిచిపోయింది. అనంతరం సుబ్రహ్మణ్యస్వామి దేశికాచార్యుని కలలో కనిపించి మిగిలిన మూడు అంతస్తుల నిర్మాణానికి స్థానికంగా ఉండే సీతాపరి మరైక్కార్ అనే భక్తుని వద్దకు వెళ్లి ఒక బుట్ట ఉప్పు తీసుకురమ్మని ఆదేశించాడు.

 బంగారు నాణ్యాలుగా

బంగారు నాణ్యాలుగా

P.C: You Tube

దేశికామూర్తి స్వామి సూచనమేరకు సీతాపరి మరైక్కార్ వద్దకు వెళ్లి జరిగిన విషయం మొత్తం చెప్పి ఒక బుట్ట ఉప్పును తీసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యలో ఆ ఉప్పు కాస్త బంగారు నాణ్యాలుగా మారిపోయింది. ఆ బంగారు నాణ్యాలతో మిగిలిన మూడు అంతస్తుల రాజగోపురాన్ని నిర్మించాడని స్థానిక కథనం.

తిరునల్వీకి 60 కిలోమీటర్ల దూరంలో

తిరునల్వీకి 60 కిలోమీటర్ల దూరంలో

P.C: You Tube

తమిళనాడులో ఐఎస్ఓ సర్టిఫికెట్ పొందిన నాలుగో దేవాలయం తిరుచెందూర్ లోని ఈ సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం. పురాణ కాలంలో దీనిని జయంతిపురమని పిలిచేవారు. తిరునల్వీకి 60 కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+