రాజస్థాన్‌లో ప్రసిద్ధిచెందిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఇక్కడ పురాతన కట్టడాలు, చారిత్రక కోటలు అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిని చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు. ప్రతి ఏడాది ఇక్కడ అనేక జాతరలు జరుగుతుంటాయి. అందులో జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే జాతరలో నాగౌర్ ఫెయిర్ ఎంతో ముఖ్యమైనది. ఈ ఫెయిర్ ప్రతి సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరి నెలలో జరుగుతుంది. ఈ ఫెయిర్‌లో జంతు ప్రదర్శనను నిర్వహిస్తారు.
ఈ సంవత్సరం ఈ జాతర ఫిబ్రవరి 15 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 18 వరకు కొనసాగుతుంది. దీనిని రామ్‌దేవ్‌జీ పశువుల జాతర లేదా నాగౌర్ పశువుల జాతర అని కూడా పిలుస్తారు. ఈ జాతర సుమారు 56 సంవత్సరాల క్రితం ప్రారంభమైందని చెబుతుంటారు. ఈసారి జరుగబోయే ఈ జాతర ప్రత్యేకతలేంటో ఓసారి తెలుసుకుందామా..?
నాగౌర్ పశువుల జాతర రాజస్థాన్‌లో రెండవ అతిపెద్ద జాతరగా చెబుతారు. ఇది ప్రతి సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరి మాసంలో జరుగుతుంది. ఈ ఏడాది నాగౌర్ ఫెయిర్ ఫిబ్రవరి 15 నుండి ప్రారంభమయి ఫిబ్రవరి 18 వరకు కొనసాగుతుంది. ఈ జాతరలో పశువులు తమ జంతువులను కొనడానికి, విక్రయించడానికి సుదూర ప్రాంతాల నుండి ఈ జాతరకు వస్తుంటారు. ఈ ఫెయిర్‌లో అనేక జాతుల జంతువులను చూడొచ్చు. ప్రతి సంవత్సరం ఇక్కడ 75,000 ఒంటెలు, ఎద్దులు మరియు గుర్రాల వ్యాపారం జరుగుతుంది.

నాగౌర్ పశువుల సంత...
నాగౌర్ బికనీర్ మరియు జోధ్‌పూర్ మధ్య ఉన్న ఒక అందమైన ప్రసిద్ధిచెందిన నగరం. ఈ పశువుల సంతను ప్రతి సంవత్సరం మాఘ శుక్ల సప్తమి రోజున నాగౌర్ నగరానికి 5 కిలోమీటర్ల దూరంలోని మన్సార్ గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రజలు తమ జంతువులను ఈ జాతరకు తీసుకురావడానికి ముందు వాటిని బాగా అలంకరిస్తారు. నాగౌరి జాతి ఎద్దులను ఇక్కడ పెద్దఎత్తున విక్రయించడం జరుగుతుంది. ఒంటెలతో పాటు ఆవులు, గుర్రాలు, గొర్రెలు, సుగంధ ద్రవ్యాల వ్యాపారం కూడా ఇక్కడ జరుగుతుంది.
ఈ పండుగ ప్రధాన ఆకర్షణ మిర్చి బజార్, నాగౌర్ యొక్క ఎర్ర మిరపకాయ ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందింది. అంతే కాకుండా చెక్కతో చేసిన అందమైన చెక్కిన వస్తువులు, ఇనుముతో చేసిన వివిధ వస్తువులు, తోలుతో చేసిన వస్తువులు కూడా ఈ జాతరలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ వస్తువులను కొనుగోలు కూడా చేయవచ్చు.
జాతరలోని ఇతర ఆకర్షణలు ఇవే..
ఇక్కడ నిర్వహించే జాతరలో టగ్ ఆఫ్ వార్, ఒంటెల నృత్యం మరియు గుర్రపు నృత్యంతో సహా అనేక ఆటలు కూడా నిర్వహించబడతాయి. కూచమణి ఖయాల్ గానం, నాగౌర్ యొక్క స్థానిక కళ, సంస్కృతి గురించి తెలుసుకునే అవకాశం కూడా
పర్యాటకులకు లభిస్తుంది.

నాగర్ ఫెయిర్ చేరుకోవడం ఎలా..?
ఇక్కడికి చేరుకోవడానికి సమీప విమానాశ్రయం జోధ్‌పూర్‌లో ఉంది. ఇది 137 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జోధ్‌పూర్, జైపూర్ మరియు బికనీర్ వంటి నగరాల నుండి నాగౌర్‌కు రోడ్డు మార్గంలో అనేక బస్సు సేవలు అందుబాటులో ఉంటాయి. నాగౌర్ ఇండోర్, ముంబై, కోయంబత్తూర్, సూరత్, బికనేర్, జోధ్‌పూర్, జైపూర్ మొదలైన నగరాలకు రైలు ద్వారా అనుసంధానించబడి ఉంది. కాబట్టి ఇక్కడికి రైలుమార్గం ద్వారా కూడా చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications













