Search
  • Follow NativePlanet
Share
» »మీరేమైనా ఈ ఆకారాలకు సరైనా పేరు పెట్టగలరేమో ప్రయత్నించండి? ఆల్ ది బెస్ట్

మీరేమైనా ఈ ఆకారాలకు సరైనా పేరు పెట్టగలరేమో ప్రయత్నించండి? ఆల్ ది బెస్ట్

భారత దేశంలో వివిధ ఆకారాలతో ఉన్న శిలలకు సంబంధించిన కథనం.

భౌగోళికంగా భారత దేశం విభిన్న వాతావరణ పరిస్థితులను కలిగి ఉంది. అక్కడి వాతావరణ పరిస్థితులకు కఠినమైన శిలలు కూడా తమ రూపాన్ని మార్చుకొంటున్నాయి. కొన్ని లక్షల ఏళ్ల క్రితం ఏర్పడిన శిలలలు అక్కడి వాతావరణ పరిస్థితుల వల్ల మొదట్లో ఉన్న తమ రూపాన్ని పోగొట్టుకొని కొత్త రూపాన్ని సంతరించుకొంటున్నాయి. ఇందులో కొన్ని పర్యాటక స్థలాలుగా కూడా మారాయి. మరికొన్ని శాస్త్రవేత్తల ప్రయోగశాలలుగా మారిపోయాయి. అలా ఆకారాన్ని మార్చుకొన్న శిలల్లో కొన్ని జంతువుల రూపాన్ని పొందగా మరికొన్ని మనషుల రూపాలతో ఆకట్టుకొంటున్నాయి. ఈ నేపథ్యంలో సహజంగా రూపాన్ని మార్చుకొన్ని కొన్ని శిలలకు సంబంధించిన కథనం.

తాబేలు ఆకారం

తాబేలు ఆకారం

P.C: You Tube

ఈ తాబేలు ఆకారం శిల మనకు రాజస్థాన్ లోని మౌంట్ అబు పర్వత శిఖరం వద్ద నక్కీ సరస్సు వద్ద మనకు కనిపిస్తుంది. అరావళి పర్వత ప్రాంతాల్లో భాగమైన ఈ తాబేలు ఆకారం శిలతోపాటు ఒంటే, నంది, సన్యాసిని ఆకారం వంటి శిలలు కూడా ఈ దారిలో కనిపిస్తాయి.

గిల్బర్ట్ హిల్

గిల్బర్ట్ హిల్

P.C: You Tube

65 మిలియన్ సంవత్సరాలకు పూర్వం ఏర్పడిన ఈ ఏక శిల ముంబైలో ఉంది. అగ్ని పర్వతం బద్దలు కావడం వల్ల ఇది ఏర్పడిందని చెబుతారు. ఇటువంటి శిలలు ప్రపంచంలో రెండేచోట్ల ఉన్నాయి. అందులో ఒకటి అమెరికాలోని వయోమింగ్ లో ఉంది.

యానా రాక్స్

యానా రాక్స్

P.C: You Tube

కర్నాటకలోని పశ్చిమ కనుమల్లోని యానా గ్రామంలో మనకు యానా రాక్స్ ఉన్నాయి. వీటిని భైరవేశ్వర శిఖరం, మోహిని శిఖరం అని స్థానికంగా పిలుస్తారు. ఇవి వరుసగా 120 మీటర్లు, 90 మీటర్ల ఎత్తు ఉంటాయి. ఇవి సాలిడ్ బ్లాక్, క్రిస్టలైన్ లైమ్ స్టోన్ శిలల కలయిక వల్ల ఏర్పడ్డాయి.

మార్బల్ రాక్స్

మార్బల్ రాక్స్

P.C: You Tube

మార్బల్ రాక్ జబల్ పూర్ వద్ద ఉన్నాయి. 3 కిలోమీటర్ల పొడవైన ఈ అందమైన శిలలు ప్రముఖ పర్యాటక కేంద్రంగా మన్నలను అందుకొన్నాయి. మధ్యప్రదేశ్ లోనే కాకుండా భారత దేశంలోనే ఇటువంటి శిలలు ఇక్కడ మాత్రమే చూడగలం.

సెయింట్ మేరీస్ ఐల్యాండ్

సెయింట్ మేరీస్ ఐల్యాండ్

P.C: You Tube

కర్నాటకలోని ప్రముఖ పర్యాటక కేంద్రం ఉడిపికి దగ్గరగా 7 కిలోమీటర్ల దూరంలో సెయింట్ మేరీస్ ఐల్యాండ్ ఉంది. బ్లాస్ట్ రాక్స్, ఖనిజ రూపంలో స్థూపాకారంగా మనకు కనిపిస్తాయి. భారత దేశంలో ఇటువంటి శిలల రూపాన్ని మనం సెయింట్ మేరీస్ ఐల్యాండ్ లో తప్ప మరెక్కడా చూడలేము.

పిల్లార్ రాక్

పిల్లార్ రాక్

P.C: You Tube

కొడైకొనాల్ పర్యాటకానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ పిల్లార్ రాక్ ను చూడకుండా వెనక్కు తిరగరు. దాదాపు 400 అడుగుల ఎతైన మూడు పెద్ద శిలలు చూపరులను ఇట్టే ఆకట్టుకొంటాయి. ఈ శిలల చుట్టు పక్కల ఉన్న ప్రక`తి కూడా మనలను రారమ్మని ఆహ్వానిస్తూ ఉంటుంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+