Search
  • Follow NativePlanet
Share
» »పేరుకు నవ ‘బ్రహ్మ’ దేవాలయాలు అయినా మూలవిరాట్టు ‘శివుడే’

పేరుకు నవ ‘బ్రహ్మ’ దేవాలయాలు అయినా మూలవిరాట్టు ‘శివుడే’

పేరులో బ్రహ్మ ఉన్నా అవి శివాలయాలు. మొత్తం తొమ్మది ఒకే చోట కొలువై ఉన్నాయి. అంతేనా ఆ తొమ్మది దేవాలయాలు కూడా ఒక శక్తిపీఠం ఉన్న చోటున ఉన్నాయి. అందుకే వాటిని సందర్శిస్తే మొత్తం కష్టాలన్నీ తొలిగిపోతాయని చెబుతారు. దీంతో శివుడికి అత్యంత ఇష్టమైన ఈ కార్తీక మాసంలో ఈ దేవాలయాలను సందర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆ తొమ్మది దేవాలయాలు ఏవి, ఎక్కడ ఉన్నాయి తదితర వివరాలన్నీ మీ కోసం...

నవబ్రహ్మ ఆలయాలు

నవబ్రహ్మ ఆలయాలు

P.C: You Tube

నవబ్రహ్మ ఆలయాలు ఆలంపూర్ వద్ద ఉన్నాయి. ఇక్కడ తొమ్మది ఆలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలు శివుడికి అంకితం చేయబడ్డాయి. ఈ దేవాలయాలను బాదామి చాళుక్యులు నిర్మించారు. ఈ దేవాలయ నిర్మాణాన్ని పరిశీలిస్తే భారతీయ వాస్తుశైలి ఎంత గొప్పదో ఇట్టే తెలుస్తుంది.

నవబ్రహ్మ ఆలయాలు

నవబ్రహ్మ ఆలయాలు

P.C: You Tube

తుంగభద్ర నది యొక్క ఎడమ ఒడ్డున నవాబ్రహ్మ దేవాలయాలు ఒక ప్రాంగణంలో ఉన్నాయి. ఈ తొమ్మది దేవాలయాల పేర్లు వరుసగా తారక బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, బాల బ్రహ్మ, గరుడ బ్రహ్మ, అర్కా బ్రహ్మ, కుమార బ్రహ్మ, వీర బ్రహ్మ, విశ్వ బ్రహ్మ దేవాలయాలు.

నవబ్రహ్మ ఆలయాలు

నవబ్రహ్మ ఆలయాలు

P.C: You Tube

ఈ ఆలంపూర్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆలంపూర్‌లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఆలంపూర్ ఉంది.

నవబ్రహ్మ ఆలయాలు

నవబ్రహ్మ ఆలయాలు

P.C: You Tube

ఈ ఆలంపూర్ చారిత్రాత్మక ప్రాధాన్యం కలిగిన ప్రదేశం. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్యక్షేత్రం ఉంటుంది. తుంగభద్ర, కృష్ణా నదులు ఈ ఆలంపూర్ వద్ద కలుస్తాయి.

నవబ్రహ్మ ఆలయాలు

నవబ్రహ్మ ఆలయాలు

P.C: You Tube

ఆలంపూర్‌లోని నవబ్రహ్మ ఆలయాల్లోకెల్లా బాల బ్రహ్మ దేవాలయం ముఖ్యమైనది. ఇక్కడ ఇప్పటికీ పూజాదికార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయంలో చిన్న నంది మంటపం, దాని వెనుకాల విశఆలమైన ముఖ మంటపం, అటు పై ప్రవేశ మంటపం, అటు పై అంతరాళ మంటపం, వీటన్నింటినీ కలుపుతూ గర్భగుడి కలదు.

నవబ్రహ్మ ఆలయాలు

నవబ్రహ్మ ఆలయాలు

P.C: You Tube

ఈ గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఒక వసారా కూడా ఉంది. ఈ గుడిలో సప్తరుషుల విగ్రహాలను మనం చూడొచ్చు. ఈ దేవాలయంలోని విగ్రహం విగ్రహం వింతగా ఉంటుంది. ఒక లింగం మధ్యలో బిలం ఉంటుంది.

నవబ్రహ్మ ఆలయాలు

నవబ్రహ్మ ఆలయాలు

P.C: You Tube

ఈ బిలంలో మరోక శివలింగం ఉంటుంది. ఈ ఆలయంలో ఒక విగ్రహం చూడటానికి వింతగా ఉంటుంది. ఒక నల్లరాతి పై నగ్నంగా రెండు మోకాళ్లను దవడలకు తగులునట్లు కుర్చొన్న ఒక స్త్రీ విగ్రహాన్ని మనం చూడొచ్చు. దీనిని భూదేవి విగ్రహంగా చెబుతారు.

నవబ్రహ్మ ఆలయాలు

నవబ్రహ్మ ఆలయాలు

P.C: You Tube

ఈ ఆలంపూర్ ఒక శక్తిపీఠం కూడా. ఇక్కడ సతీదేవి ఊర్థ్వ దవడ పడినట్లు చెబుతారు. ఇక్కడ ఉన్న అమ్మవారిని జోగులాంబగా పిలుస్తారు. ఈ జోగులంబ దేవత కూర్చొని భంగిమలో కనిపిస్తుంది. ఆమెను గురు చండి అని కూడా పిలుస్తారు.

నవబ్రహ్మ ఆలయాలు

నవబ్రహ్మ ఆలయాలు

P.C: You Tube

ఇక ఈమె శిరస్సు పై ఒక గబ్బిలం, తేలు, పుర్రె కూడా కలిగి ఉంటుంది. అందువల్లే ఈ అమ్మవారిని పూజిస్తే దుష్టశక్తుల భయం ఉండదని చెబుతారు. అలంపురం సమీపంలో కృష్ణ, తుంగభద్ర నదులు సంగమించడం వల్ల ఈ ప్రాంతాన్ని దక్షిణకాశీగా అభివర్ణిస్తూ ఉంటారు.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more