Search
  • Follow NativePlanet
Share
» »నేషనల్ హై వే నెం.11 లో ఆకర్షణలు !!

నేషనల్ హై వే నెం.11 లో ఆకర్షణలు !!

ట్రాఫిక్ లేని పొడవైన రోడ్లపై మీ ఇష్టం వచ్చినట్లు స్పీడ్ గా డ్రైవ్ చేయాలని చూస్తున్నారా ? అలా అయితే, నేషనల్ హై వే 11 పై ట్రావెల్ చేయండి. ఈ రోడ్డు పై ప్రయాణం మీకు అద్భుత ఆనందం ఇస్తుంది. ఈ హై వే పొడవు 615 కి. మీ. లు.

ఇది ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా లో మొదలై రాజస్తాన్ లోని బికనీర్ లో అంతం అవుతుంది. మార్గంలో అనేక కోట లు, దేవాలయాలు, చారిత్రక స్మారకాలు వంటివి ఎన్నో చూడవచ్చు. కనుక ప్రయాణ సరంజామా సర్దుకొండి. ప్రయాణం మొదలు పెట్టండి.

హై వే ఆకర్షణలు - అంతులేని ప్రయాణాలు !

హై వే ఆకర్షణలు - అంతులేని ప్రయాణాలు !

అందమైన ఆగ్రా నగరం
ఆగ్రా నగరం అంతటా మొగలుల నాటి శిల్ప వైభవం ఉట్టి పడుతూ వుంటుంది. తెల్లని మార్బుల్ రాయికల తాజ్ మహల్ ను ఆగ్రా కోటను చూడవచ్చు. ఇవే కాక అక్బర్ సమాధి, జామా మసీద్, కీతం సరస్సు ఇంకనూ అనేక ఇతర చారిత్రక మరియు శిల్ప వైభవం కల నిర్మాణాలు చూడవచ్చు.
Photo Courtesy: Christian Haugen

హై వే ఆకర్షణలు - అంతులేని ప్రయాణాలు !

హై వే ఆకర్షణలు - అంతులేని ప్రయాణాలు !

ఫతేపూర్ సిక్రీ
ఫతేపూర్ సిక్రీ ఆగ్రా కు సమీపంలో కలదు. ఇది యునెస్కో సంస్థ గుర్తింపు పొందిన ప్రదేశం. ఇపుడు ఈ నగరం ఎవరూ నివసించక ఖాళీ గా కలదు. ఎన్నో ఖాళీ పాలస్ లు, విశాల ప్రాంగణాలు కలవు. బులంద్ దర్వాజా, పంచ మహల్, అనూప్ తాలాబ్ మరియు అనేక ఇతర ప్రదేశాలు కూడా కలవు.
Photo Courtesy: rohanbabu

హై వే ఆకర్షణలు - అంతులేని ప్రయాణాలు !

హై వే ఆకర్షణలు - అంతులేని ప్రయాణాలు !

భరత్ పూర్
భరత్ పూర్ ను రాజస్థాన్ యొక్క తూర్పు ద్వారం అంటారు. పక్షులపట్ల ఆసక్తి కలవారికి ఇది ఒక స్వర్గం. నేషనల్ పార్క్ లో వివిధ రకాల పక్షులను చూడవచ్చు. ఇది వరల్డ్ హెరిటే జ్ సైట్. ఈ ప్రదేశంలో ఇంకనూ లోహఘర్ కోట, దీగ్ కోట, భరత్పూర్ పాలస్ వంటివి అనేకం చూడవచ్చు.
Photo Courtesy: Nikhilchandra81

హై వే ఆకర్షణలు - అంతులేని ప్రయాణాలు !

హై వే ఆకర్షణలు - అంతులేని ప్రయాణాలు !

దౌసా

దౌసా లో కల చాంద్ బవోరి అనే ఒక మెట్ల బావి, భండా రేజ్, ఖవరవోజి మరియు ఇంతర ఆకర్షణలు చూడవచ్చు. ఈ ప్రదేశపు శిల్ప వైభవం తప్పక ఆకర్షిస్తుంది. ఇక్కడ శివుడు మరియు ఆంజనేయుడి దేవాలయాలు కూడా కొన్ని చూడవచ్చు.

Photo Courtesy: Ramón

హై వే ఆకర్షణలు - అంతులేని ప్రయాణాలు !

హై వే ఆకర్షణలు - అంతులేని ప్రయాణాలు !

జైపూర్
జైపూర్ రాజస్థాన్ రాష్ట్రపు రాజధాని. దీనినే పింక్ సిటీ అని కూడా అంటారు. ఇండియా లో వాస్తు మేరకు ప్రణాళిక చేసి నిర్మించ బడిన నగరాలలో ఇది మొదటి నగరంగా చెపుతారు. జైపూర్ లో హవా మహల్, అంబార ఫోర్ట్, షీష్ మహల్, గణేష్ పోల్, ఇంకనూ ఇతర ఆకర్షణలు చూడవచ్చు.

హై వే ఆకర్షణలు - అంతులేని ప్రయాణాలు !

హై వే ఆకర్షణలు - అంతులేని ప్రయాణాలు !

సికార్
ఈ ప్రదేశం రాజస్థాన్ లోని షెఖావతి ప్రాంతంలో కలదు. ఇక్కడ అనేక హవేలీలు, కోటలు కలవు. వీటిని మొగలుల కాలంలో ధనవంతులకు రక్షణగా వుండే నివాస భవనాలు గా నిర్మించారు. ఇక్కడ సికార్ కోట, సాయి ధాం, మాదో నివాస్ కోటి, రాణి మహల్ వంటి ఎన్నో ఆకర్షణలు చూడవచ్చు.
Photo Courtesy: Mukul pareek

హై వే ఆకర్షణలు - అంతులేని ప్రయాణాలు !

హై వే ఆకర్షణలు - అంతులేని ప్రయాణాలు !

బికనీర్
మీ సుదీర్ఘ ప్రయాణం చివరకు బికనీర్ లో అంతం అవుతుంది. బికనీర్ స్వీట్ లకు, చిరు తిండ్ల కు ప్రసిద్ధి. ఇక్కడ అనేక వారసత్వ భవనాలు కలవు. అందమైన లక్ష్మి నివాస్ పాలస్, జునాఘర్ కోట, అనేక దేవాలయాలు ఇక్కడ కలవు. ప్రతి సంవత్సరం జనవరి లో ఇక్కడ కేమల్ ఫెస్టివల్ అంటే ఒంటె ల పండుగ జరుగుతుంది. ఆసమయంలో ఒంటె ల రేస్ ల వంటివి నిర్వహిస్తారు.
Photo Courtesy: Sachinsonkusare85

ఆగ్రా ఆకర్షణలకు ఇక్కడ క్లిక్ చేయండి

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+