Search
  • Follow NativePlanet
Share
» »ప్ర‌శాంత‌త‌కు మారుపేరు.. ఉత్తరాఖండ్‌లోని ఈ గమ్యస్థానాలు...

ప్ర‌శాంత‌త‌కు మారుపేరు.. ఉత్తరాఖండ్‌లోని ఈ గమ్యస్థానాలు...

ఉత్తరాఖండ్‌లో అనేక అందమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఇవి నగరపు సంద‌డి నుండి దూరంగా ఉండే ప్ర‌దేశాలు. ఇక్క‌డ ఎన్నో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలతో పాటు, అనేక ప్రత్యామ్నాయ గమ్యస్థానాలను కూడా ఉత్తరాఖండ్ కలిగి ఉంది. అయితే ఈ ప్రాంతాల గురించి చాలామందికి తెలియ‌క‌పోయినా, ఇక్క‌డి అద్భుత‌మైన దృశ్యాల‌ను ప‌ర్యాట‌కుల‌కు క‌నుల‌విందు చేస్తాయి. ఇక్క‌డ నిశ్శబ్ద సరస్సులు, మంచుతో కప్పబడిన పర్వతాలు, లోయలు, జలపాతాలు మరియు పచ్చని అడవులను కలిగి ఉన్న ప్ర‌దేశాలు ఎన్నో ఉన్నాయి.

ఈ ప్రాంతాలు ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంతో పాటు ప‌ర్యాట‌కులకు మనశ్శాంతిని కూడా అందిస్తాయి. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, చండీగఢ్ సమీపంలో నివ‌సించేవారు త‌ప్ప‌కుండా ఉత్తరాఖండ్‌లోని ఈ ప్రాంతాల‌ను సంద‌ర్శించాల్సిందే.. అపారమైన అందంతో పాటు ప్రశాంతత మారుపేరుగా నిలుస్తున్న ఈ ప్రాంతాల‌ను ఎవ్వ‌రైనా సంద‌ర్శించొచ్చు. దీపావళి సమయంలో ఇక్కడికి వెళ్లేలా ప్ర‌ణాళిక‌లు చేసుకోవ‌చ్చు.

పెయోరా

పెయోరా

పెయోరా అల్మోరా, నైనిటాల్ మధ్య ఉన్న ఎంతో అంద‌మైన ప్ర‌దేశం. ఇది సముద్ర మట్టానికి 6600 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఉత్తరాఖండ్‌లోని ప్ర‌శాంత‌మైన ప్ర‌దేశాల‌లో ఇది ఒక‌టి. ఈ ప్రదేశం అందమైన కుమావోన్ హిమాలయ శ్రేణి అడవులు, ఆపిల్ తోట‌ల‌కు ఎంత‌గానో ప్ర‌సిద్ధి చెందింది. ఈ ప్రాంతాన్ని సంద‌ర్శంచడం అంటే ప్ర‌కృతికి ద‌గ్గ‌ర‌యిన‌ట్లే. పెయోరాను స్నేహితుల‌తో క‌లిసి సంద‌ర్శించొచ్చు. లేదా ఒంట‌రిగానైనా విహ‌రించొచ్చు. ఈ ప్రాంతం ఎన్నో మ‌ధుర‌మైన అనుభూతుల‌ను ప‌ర్యాట‌కులు అందిస్తుంది. పెయోరాలోని అందమైన లోయలను, ప్ర‌కృతి అందాల‌ను మీ కెమెరాల్లో బంధించొచ్చు. ఫోటోగ్ర‌ఫీకి ఈ ప్రాంతం ఎంతో అనువైన‌ది. ఇక్కడ ఎన్నో ర‌కాల ప‌క్షులు ప‌ర్యాట‌కులను క‌నువిందు చేస్తాయి. విభిన్న ర‌కాల ప‌క్షుల‌ను ఇక్క‌డ చూడొచ్చు.

ascot1

అస్కాట్

ఆస్కాట్ ఉత్తరాఖండ్‌లోని ప్ర‌సిద్ధ ప్రాంతాల‌లో ఒక‌టిగా పేరుగాంచింది. పితోర్‌ఘర్ జిల్లాలోని దీదీహత్ తహసీల్‌లో ఉంది ఈ ప్రాంతం. దీని గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అప్ప‌ట్లో ఇక్కడ సుమారు 80 కోటలు ఉండేవని ఇక్క‌డివారు చెబుతున్నారు. కొన్ని కోటల అవశేషాలను మ‌నం ఇప్పటికీ ఇక్కడ చూడొచ్చు. అస్కాట్ ప్రసిద్ధ కైలాష్ మానస సరోవర్ యాత్ర ప్రారంభ స్థానం. ఈ ప్రాంతపు స‌హ‌జ‌మైన దృశ్యాలు, జ‌ల‌పాతాలు దీని అందాన్ని రెట్టింపు చేస్తాయి. ఈ ప్ర‌దేశం ఎంతో ప్ర‌శాంత వాతావ‌ర‌ణంతో ఉంటుంది. ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో కాసేపు సేద‌తీరాల‌నుకునేవారు త‌ప్ప‌కుండా ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించాల్సిందే.

dharchula1

ధార్చుల

ధార్చుల ప్రాంతం ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్ జిల్లాలో ఉన్న ఒక ప్రశాంతమైన, అందమైన గ్రామం. ఈ గ్రామం నలువైపులా కొండలతో చుట్టబ‌డి ఉంటుంది. నైనిటాల్, ముస్సోరీ ప్రాంతాల వంటి సంద‌డిని బ‌హుశ ఇక్క‌డ చూడలేరు. కానీ అందమైన ప్రాంతాల ప‌రంగా చూస్తే మాత్రం ధార్చులా ఎప్పుడూ మొదటి స్థానంలోనే ఉంటుంది. ఇక్క‌డ సంద‌ర్శించ‌ద‌గ్గ ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. అందులో మానస సరోవర్. దీన్నే మానస సరస్సు అని పిలుస్తారు. ఇంకా ఓం పర్వతం, చిక్రిలా ఆనకట్ట వంటివి.

ఈ ప్రాంతం సుందరమైన లోయలు, మంచుతో కప్పబడిన పర్వతాలు, అడవులతో చుట్టుముట్టడి ఉంటుంది. ఈ ప్రాంతం ట్రెక్కింగ్ ప్రియుల‌కు ఎంతో అనువైన‌ది. ఇది షౌనా, కుమావోని గిరిజన ప్రజలకు నిలయం. ఈ ప్రాంతం మానస సరోవర్, కైలాష్, ఛోటా కైలాష్ మార్గంలో ఉంటుంది. కాళీ నది ఒడ్డున ఉన్న ప్రదేశం ఎంతో ప్ర‌శాంతంగా ఉంటుంది. ఇక్క‌డి ప్ర‌శాంత‌త ప‌ర్యాట‌కుల‌ను ఎంతో మంత్రముగ్ధులను చేస్తుంది. ధార్చుల నుండి పంచచులి శిఖరపు దృశ్యాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+