ఓపెన్ లూప్ టికెటింగ్ సిస్టమ్ (ఓటీఎస్).. అంటే, మెట్రోలో అడ్వాన్స్‌డ్ టికెటింగ్ అన్నమాట. విదేశాలలో అమలులో ఉన్న ఈ విధానాన్ని ఇప్పుడు తాజాగా హైదరాబాద్ మెట్రోలో అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇదే ప్రక్రియను ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ కంపెనీ అనుసరించబోతున్నట్లు సమాచారం. ఇది నిజంగా మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. విదేశాల్లో మాదిరిగానే భాగ్యనగరంలోనూ ఓపెన్ లూప్ టికెటింగ్ సిస్టమ్ (ఓటీఎస్)ను పరిచయం చేయబోతున్నారట. ఈ విధానమే అమలులోకి వస్తే ఇక మెట్రో ప్రయాణికులు క్యూ లైన్‌లో నిలబడి టికెట్‌లు తీసుకునే బాధలు తప్పుతాయనే చెప్పాలి.
జర్నీ పూర్తయి తర్వాత..
హైదరాబాద్ నగరంలో ఒకచోట నుంచి మరోచోటకు ప్రయాణం చేయాలంటే మెట్రోనే ఆశ్రయిస్తున్నారు భాగ్యనగరవాసులు. సిటీలోని ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ, తక్కువ ధరలోనే ఏసీలో ప్రయణించేందుకే ఇదో మంచి సాధనం. ఈ అవకాశాన్ని హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు సద్వినియోగం చేసుకుంటున్నారనే చెప్పాలి. మరీ ముఖ్యంగా రాత్రుళ్లు ఆలస్యంగా ప్రయణించే వారికి ఈ సదుపాయం ఎంతగానో ఉపయోగపడనుంది. ప్రస్తుతం మెట్రోలో రోజుకు సగటున 4.5 లక్షల మంది ప్రయాణికులు వరకూ ప్రయాణిస్తున్నారు. అయితే, మెట్రో ప్రయాణం ద్వారా సమయం ఆదా అవుతున్నప్పటికీ, టికెట్ తీసుకునే సమయంలో క్యూ లైన్‌లో నిలబడి సమయం వృధా అవుతుందని చాలామంది భావిస్తున్నారు.

అలాంటి వారి కోసమే ఈ ఓపెన్ టూప్ టికెంటింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ విధానంతో ప్రయాణికులు మెట్రో రైలు ఎక్కే ముందు టికెట్ కొనాల్సిన అవసరం ఉండదు. జర్నీ పూర్తయి తర్వాత ప్రయాణించిన దూరాన్ని బట్టి ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. ఈ విధానం అందుబాటులోకి వస్తే మెట్రో ప్రయాణికులకు మెట్రో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని మెట్రో నిర్వాహకులు భావిస్తున్నారు. అంతేకాదు, ఓటీఎస్‌ను ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రవేశపెట్టాలని మెట్రో రైల్ యోచిస్తోందని సమాచారం.
వారి సంఖ్య గణనీయంగా..
ఇప్పటికే ప్రజా రవాణాలో ప్రయాణపు ఛార్జీల చెల్లింపు పద్ధతుల్లో చాలామార్పలు వచ్చాయి. భాగ్యనగరంలోని మెట్రో విషయానికి వస్తే.. మెట్రోలో కౌంటర్లలో సిబ్బంది విక్రయించే చోట, టికెట్ వెండింగ్ మెషీన్ల ద్వారా, స్మార్ట్ కార్డ్‌లు, మొబైల్‌ల నుంచి వాట్సాప్‌లో టిక్కెట్లు పొందడంతోపాటు ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్‌ల ద్వారా అనుమతించడం వంటి విధానాలతో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటూ ఉన్నారు.
ఇప్పుడు తాజాగా ఓటీఎస్ విధానం అమలులోకి వస్తే ప్రయాణికులకు మరింత సౌలభ్యం దొరుకుందని మెట్రో రైల్ భావిస్తోంది. అనుకున్న సమయంలో మెట్రో ఎక్కడంతోపాటు సులభ పద్ధతిలో చెల్లింపులు జరిగేలా ఇది సహాయపడుతుందని చెబుతున్నారు. ఈ విధానం అమలులోకి వస్తే మెట్రో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలు లేకపోలేదు. అందుకు తగ్గట్టుగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తునారు.



Click it and Unblock the Notifications













