Search
  • Follow NativePlanet
Share
» »ఈ ‘వృద్ధ’కాశీలో చనిపోతే స్వయంగా అమ్మవారే తన ఒడిలోకి తీసుకొని...

ఈ ‘వృద్ధ’కాశీలో చనిపోతే స్వయంగా అమ్మవారే తన ఒడిలోకి తీసుకొని...

వృద్ధకాశీ గా పిలిచే విరుదాచల పుణ్యక్షేత్రం గురించి.

By Kishore

ఈ క్షేత్రంలో వ్యక్తుల చివరి ఘడియల్లో వారి తలను వృద్ధాంబిక అమ్మవారు తన ఒడిలో ఉంచుకొని చీర కొంగుతో విసురుతుండగా, వారి చెవిలో పరమేశ్వరుడు స్వయంగా మంత్రాన్ని ఉపదేశిస్తాడని చెబుతారు. అందువల్లే ఇక్కడ చనిపోయిన వారికి మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.

ఇది కాశీ కన్నా పురాతన క్షేత్రమని నమ్ముతారు. ప్రళయ కాలంలో కూడా విరుదాలచం చెక్కుచెదరకుండా నిలిచిందని పురాణ కథనం. అందుకే దీనిని వృద్ధకాశీ అని కూడా అంటారు.

అంతే కాకుండా ఈ క్షేత్రం కాశీ కంటే పురాతనమైనది, పవిత్రమైనది కాబట్టి ఇక్కడ స్వామి వారిని సేవిస్తే కాశీలో విశ్వనాధుడిని సేవించిన దానికన్నా ఎక్కువ పుణ్యం వస్తుందని చెబుతారు. చెన్నై నుంచి 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవడానికి నిత్యం బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి.

2. ప్రళయ కాలంలో కూడా

2. ప్రళయ కాలంలో కూడా

P.C: You Tube

ప్రళయ కాలంలో కూడా విరుదాలచం చెక్కుచెదరకుండా నిలిచిందని పురాణ కథనం. అంతే కాకుండా ఈ క్షేత్రం కాశీ కంటే పురాతనమైనది, పవిత్రమైనది కాబట్టి ఇక్కడ స్వామి వారిని సేవిస్తే కాశీలో విశ్వనాధుడిని సేవించిన దానికన్నా ఎక్కువ పుణ్యం వస్తుందని చెబుతారు

3. అనంద తాండవం

3. అనంద తాండవం

P.C: You Tube

చిదంబరంలో పరమశివుడు కాళీ మాతతో పోటీ పడి న`త్యం చేస్తే ఇక్కడ ఆనంద తాండవం చేశాడని చెబుతారు. అందువల్ల ఈ క్షేత్రంలో పుట్టినా, గిట్టినా, నివసించినా భగవంతుడిని ప్రార్థించినా మోక్షం లభిస్తుందని చెబుతారు.

4. అందుకే పఝుమలై

4. అందుకే పఝుమలై

P.C: You Tube

శివుడు మొదట ఇక్కడ కొండరూపంలో వెలిశాడని చెబుతారు. అందువల్లే ఈ క్షేత్రాన్ని మొదట పఝుమలై అని పిలచేవారు. అటు పై వరదాచలంగా ఖ్యాతి పొందింది.

5. స్వామివారిని సేవిస్తే

5. స్వామివారిని సేవిస్తే

P.C: You Tube

పూర్వం ఇక్కడ ప్రజలు కరువు కాటకాల వల్ల నిత్యం అష్టకష్టాలు పడేవారు. దీంతో స్థానికంగా ఉండే విభాసిత మహర్షి స్వామివారికి సేవ చేస్తే ఫలితం ఉంటుందని చెప్పాడు.

6. ఆ అనుమానం మొదలయ్యింది

6. ఆ అనుమానం మొదలయ్యింది

P.C: You Tube

దీంతో ఆ ఊరిపెద్దలంతా కలిసి స్వామి వారికి దేవాలయం నిర్మించాలని తీర్మానించారు. అయితే ఆ సమయంలో వారి జీవనం ఎలా అన్న అనుమానం మొదలయ్యింది.

7. స్వామివారి పై నమ్మకంతో

7. స్వామివారి పై నమ్మకంతో

P.C: You Tube

దీనికి విభాసిత మహర్షి స్వామి వారి పై నమ్మకంతో పనిచేయండి చేసుకొన్నవారికి చేసుకొన్నంతంగా లాభం చేకూరుతుందని చెప్పారు. దీంతో ప్రజలు అయిష్టంగానే ఆ పనికి పూనుకొన్నారు.

8. చెట్టు ఆకులు

8. చెట్టు ఆకులు

P.C: You Tube

ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకూ పనిచేసిన వారికి విభాసిత మహర్షి స్థానికంగా ఉంటున్న చెట్టు నుంచి కొన్ని ఆకులు తీసుకొని పనిచేసిన వారికి ఇచ్చేవాడు.

9. ఆకులు నాణ్యాలుగా

9. ఆకులు నాణ్యాలుగా

P.C: You Tube

ఎవరు ఎంత పరిచేసారో అంతకు సమానంగా ఆ ఆకులు నాణ్యాలుగా మారేవి. అప్పటి నుంచే చేసిన వారికి చేసినంత, చేసుకున్నవారికి చేసుకొన్నంత అనే నానుడి మొదలయ్యిందని చెబుతారు.

10.12వేల బంగారు నాణ్యాలు

10.12వేల బంగారు నాణ్యాలు

P.C: You Tube

ఒకసారి ఈ క్షేత్రం గుండా సుందరార్ అనే గాయకుడైన శివభక్తుడు ఈ దారి గుండా వెలుతూ ఇక్కడి స్వామివారిని స్తుతించాడు. దీంతో స్వామి వారు స్వయంగా 12 వేల బంగారు నాణ్యాలను అందజేస్తాడు.

11. దొంగల భయం

11. దొంగల భయం

P.C: You Tube

తాను తిరువారూర్ వెళ్లాల్సి ఉందని అయితే తోవలో దొంగల భయం ఉందని సుందరార్ భయపడుతాడు. ఇదే విషయాన్ని శివుడికి చెబుతాడు. దీంతో శివుడు తాను ఈ నాణ్యాలను ఇక్కడే ఉన్న మణిముత్తా నదిలో వేస్తానని నీవు తిరువారూర్ వెళ్లిన తర్వాత అక్కడి కొలనులో తీసుకోవచ్చని చెబుతాడు.

12.నాణ్యతను పరీక్షించిన వినాయకుడు

12.నాణ్యతను పరీక్షించిన వినాయకుడు

P.C: You Tube

ఇందుకు అంగీకరించిన సుందరార్ తిరువారూర్ వెళ్లి అక్కడ కొలనులో నుంచి 12వేల బంగారు నాణ్యాలను తీసుకొన్నాడని కథనం. అదే విధంగా ఆ నాణ్యాల నాణ్యతను సాక్షాత్తు వినాయకుడు పరీక్షించి అటు పై ఆ భక్తాగ్రేసరుడికి ఇచ్చారని చెబుతారు.

13.ఇక్కడ కూడా భూ గర్భం నుంచి కిందికి

13.ఇక్కడ కూడా భూ గర్భం నుంచి కిందికి

P.C: You Tube

ఇక్కడ వినాయకుడు భూ గర్భంలో నుంచి కొంత కిందికి ఉంటాడు. అందువల్ల 18 మెట్లు దిగి ఇక్కడి వినాయకుడిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని వ`ద్ధాంబిక అనే పేరుతో పిలుస్తారు.

14. ఈ విరదాచలాన్ని వృద్ధకాశీ అని కూడా

14. ఈ విరదాచలాన్ని వృద్ధకాశీ అని కూడా

P.C: You Tube

ఈ విరదాచలాన్ని వృద్ధకాశీ అని కూడా అంటారు. ఇక్కడ వ్యక్తుల చివరి ఘడియల్లో వారి తలను వృద్ధాంబిక అమ్మవారు తన ఒడిలో ఉంచుకొని చీర కొంగుతో విసురుతుండగా, వారి చెవిలో పరమేశ్వరుడు స్వయంగా మంత్రాన్ని ఉపదేశిస్తాడని చెబుతారు. అందువల్లే ఇక్కడ చనిపోయిన వారికి మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.

15. ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ

15. ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ

P.C: You Tube

అరుణాచలం అంటే తిరువణ్ణామలైలో చేసినట్లుగానే ప్రతి పౌర్ణమికీ ఇక్కడ భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తాడు. దీని వల్ల వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ సాయంత్రం తిరిగి 3.30 గంటల నుంచి 9 గంటల వరకూ తెరిచి ఉంచుతారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+