• Follow NativePlanet
Share
» »ఆ కొత్త దంపతులు ఇక్కడ చేసిన ‘ఆ పని’ మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి

ఆ కొత్త దంపతులు ఇక్కడ చేసిన ‘ఆ పని’ మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి

Written By: Kishore

ఈ నగరాలకు వెలితే అటువైపు అసలు వెళ్లకండి ఎందుకంటే 'సుఖాల ఊబి'ఉంది

పుణ్యాత్ముల పై మాత్రమే నీళ్లు చిలకరించే జలపాతం

కొత్తగా పెళ్లైన జంట వారణాసి వెళ్లారు.  వారణాసిలోని అన్ని గుళ్లు చూసిన తర్వాత అక్కడ ఉన్న వారాహి అమ్మవారి గుడిని కూడా చూడటానికి వెళ్లారు. అయితే వారు వచ్చిన సమయంలో దేవిని చూడటానికి వీలు కాదని చెప్పినా వినకుండా చూసి అదృష్టం బాగుడి చావు తప్పి కన్నులొట్టపోయిన చందగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే అక్కడ ఉన్న పూజారులు వారిని దేవాలయం నుంచి బయటికి తీసుకువచ్చేశారు. ఇదంతా జరిగింది ఏ పురాణ కాలంలోనో కాదు మన కలియుగంలో కొన్ని నెలల ముందే. ఇది నిజంగా జరిగిందా అన్న ప్రశ్నకు 'సూర్యుడు ఒక్కడే కాని సూర్యోదయం సమయంలో, సూర్యాస్తమయం సమయంలో మాత్రమే చూడగలం. అదే సూర్యుడిని ఎందుకు మధ్యాహ్నం చూడలేము.' అన్నది సమాధనంగా వారణాసి పురోహితులు ఇస్తున్న సమాధానం. ఇందుకు సంబంధించిన మొత్తం వివరాలు ఈ కథనంలో మీ కోసం

1. జల ప్రళయం కూడా ఏమి చేయదు

1. జల ప్రళయం కూడా ఏమి చేయదు

Image Source:

వారణాసి హిందువులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం అన్న విషయం తెలిసిందే. ఈ క్షేత్రం అత్యంత శక్తికలిగిన పట్టణం. అందువల్లే జల ప్రళయం కూడ ఈ పట్టణాన్ని ఏమి చేయలేదని తెలుస్తుంది. ప్రపంచంలోనే లక్షల కోట్ల సంత్సరాల నుంచి మానవ మనుగడ ఉన్న ప్రాంతంగా వారణాసికి పేరుండటం ఇక్కడ గమనార్హం.

2. ఇక్కడ దేవతలే

2. ఇక్కడ దేవతలే

Image Source:

ఇందుకు ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటు వంటి దేవతలే అని హిందూ పురాణాలు చెబుతున్నాయి.అటు వంటి దేవతల్లో వరాహి దేవత కూడా ఒకటి. ఈమె పుట్టుక, ఆకారం, ఆయుధం, సంబంధించి వివిధ పురాణాల్లో వివిధ రకాలుగా వర్ణించబడింది.

3. ప్రధాన దేవత వరాహి అమ్మవారు

3. ప్రధాన దేవత వరాహి అమ్మవారు

Image Source:

అందులో ప్రధానమైనది వరాహి అమ్మవారు సప్త మాత`కల్లో ఒకరు. ఈమె వరాహ ముఖం కలిగి ఉంటుంది.మార్కండేయ పురాణం ప్రకారం దేవుళ్ల శరీరాల నుంచి స్త్రీ రూప శక్తులు ఉద్భవించాయి. శివుడి నుంచి శివాని, విష్ణువు నుంచి వైష్ణవి ఎలా ఉద్భవించారు.

4. సప్త మాతృకలో ఒకరు

4. సప్త మాతృకలో ఒకరు

Image Source:

అదే విధంగా వరాహ స్వామి నుంచి వారాహి ఉద్భవించిందని చెబుతారు. ఈమె వరాహ రూపంలో ఉండి చేతిలో చక్రం, ఖడ్గంతో ఉంటుంది. ఇక వామన పురాణం ప్రకారం సప్త మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుంచి ఉద్భవించింది.

5. చండిక వీపు నుంచి

5. చండిక వీపు నుంచి

Image Source:

చండిక వీపు నుంచి వారాహి జన్మించడమేకాక ఆమె ఉత్తర దిక్కుకు అధిపతి. ఈమె వాహనం గేదే. అయితే వరాహ పురాణం ప్రకారం ఈమె పులి పై కుర్చొని భక్తులను కాస్తుందని చెప్పబడింది. దేవీ పురాణం ప్రకారం వరాహ దేవిని విచిత్రంగా వరాహ స్వామికి తల్లిగా వర్ణించబడింది.

6. అఘెరాలు కూడా

6. అఘెరాలు కూడా

Image Source:

బహుష ఈ పురాణాల్లోని భాషను అర్థం చేసుకునే క్రమంలో ఇటువంటి భిన్నాభిప్రాయాలు వచ్చాయనే వాదన ఉంది. వారాహి దేవిని అటు శైవులతో పాటు వైష్ణవులు, శాక్తేయులు కూడా పూజిస్తారు. ఈమెను అఘోరాలు రాత్రి సమయాల్లో పూజించి తాత్రిక శక్తులను పొందడానికి సహకరించాల్సిందిగా వేడుకుంటారు.

7. బౌద్ధమతం వారు కూడా

7. బౌద్ధమతం వారు కూడా

Image Source:

ఇక బౌద్ధమతం వారు కొలిచే వజ్రవారాహి, మరీచి కూడా ఈమె. నేపాల్లో ఈమెను బారాహీ పేరుతో కొలుస్తారు. మరికొన్ని పురణాల ప్రకారం ఈమె అసూయ అనే సప్త వ్యసనాల్లో ఒకటైన అసూయకు అధిపతిగా పేర్కొనబడింది. ఎక్కడ ఎన్ని రకాలుగా చెప్పబడినా ఈమె ఆ జగన్మాత ప్రతిరూపంగా కొలుస్తారు.

8. వారణాసికి గ్రామ దేవత

8. వారణాసికి గ్రామ దేవత

Image Source:

ఇటువంటి వారాహి అమ్మవారు వారణాసికి గ్రామ దేవత. అంటే వారణాసిని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండే దేవత అని అర్థం. ఈమెకు వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది. ఆ దేవాలయంలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లడానికి వీలు పడదు.

9. ఒక భూ గృహంలో

9. ఒక భూ గృహంలో

Image Source:

ఈ ఆలయం ఓ భూ గృహంలో ఉంటుంది. ఉదయం తెల్లవారుజాము 4.30 నుంచి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. మిగిలిన సమయం మూసివేయబడి ఉంటుంది. ఇక ఆలయం తెరిచిన సమయంలో వెళ్లిన తర్వాత నేల పై రెండు కన్నాలు కనిపిస్తాయి. వాటి నుంచి మాత్రమే అమ్మవారిని దర్శించుకోవడానికి వీలవుతుంది

10. రంధ్రాల నుంచి మాత్రమే

10. రంధ్రాల నుంచి మాత్రమే

Image Source:

ఒక రధ్రంలో నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది. మరో రధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి పాద ముద్రలు కనిపిస్తాయి. అమ్మవారు ఉగ్రస్వరూపం వారు కాబట్టే ఇలా కన్నాల నుంచి భక్తులు ఇలా చూసే ఏర్పాటును పురాణ కాలం నుంచి ఏర్పాటు చేశారు.

11. కొత్త దంపతులు

11. కొత్త దంపతులు

Image Source:

అయితే ఇటీవల కొత్తగా పెళ్లైన దంపతులు ఈ ఆలయం వద్దకు వచ్చారు. వీరు అక్కడ ఉన్న పూజారి ఎంత చెప్పినా వినకుండా మేము చూడాల్సిందేనని పట్టు బట్టారు. లేదంటే సుప్రీం కోర్టుకు వెలుతామని హెచ్చరించారు. దీంతో పూజారి వారిని విగ్రహం చూడటానికి అనుమతించాడు.

12. ఒక్క క్షణం కూడా

12. ఒక్క క్షణం కూడా

Image Source:

వారు భూ గృహంలో కి వెళ్లి అమ్మవారి విగ్రహం ముందు ఒక్క క్షణం నిలబడిన వెంటనే మూర్చబోయారు. అటు పై పూజారి తన శిష్యులతో కలిసి వారిని హుటాహుటిన ఆ భూ గ`హంలోనుంచి బయటకు తీసుకువ చ్చేశాడు. అటు పై దాదాపు గంట సేపు శాంతి ప్రవచనాలు వినిపించిన తర్వాతనే వారు మామూలు స్థితికి వచ్చారు.

13. ఉగ్రకళ

13. ఉగ్రకళ

Image Source:

ఇందుకు గల కారణాలను ఆ పూజారి వివరించారు. ‘ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతి శిల్పాన్ని ఉగ్ర కళ, లేదా శాంతి కళతో మలచబడి ఉంటుంది. ఉగ్రకళతో ఉన్న విగ్రహాల్లో సాధారణంగా శక్తి ఉంటుంది. ఈ శక్తి దుష్ట శక్తులను అనచడానికి వీలుగా రూపొందించబడింది.

 14. అందువల్లే చూడలేము

14. అందువల్లే చూడలేము

Image Source:

ఆ ఉగ్రకళతో ఉన్న అమ్మవారి ఎదురుగా సాధారణ మానవులు ఎక్కువ సేపు ఉండలేరు. అందువల్లే వారు మూర్చబోయారు. ఆ ఉగ్ర కళ ఒక్కొక్క విగ్రహానికి ఒక్కో సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఆ విగ్రహం దరిదాపుల్లోకి కూడా పోవడానికి వీలు కాదు.

15. ఆ సమయంలో అందుకే

15. ఆ సమయంలో అందుకే

Image Source:

మిగిలిన సమయంలో కొంత తక్కువగా ఉంటుంది. అందువల్లే తెల్లవారుజాము 4.30 గంటల నుంచి 8 గంటల మధ్య మాత్రం వరాహి అమ్మవారి దేవాలయంలోని అమ్మవారిని చూడటానికి అదీ కన్నాల నుంచి చూడటానికి వీలు కల్పిస్తారు.

16. గ్రామ సంచారానికి

16. గ్రామ సంచారానికి

Image Source:

ఆ సమయంలో అంటే తెల్లవారుజాము 4.30 నుంచి 8 గంటల మధ్య గ్రామ దేవత అయిన అమ్మవారు గ్రామ చూడటానికి అంటే వారణాసిని చూసి రావడానికి వెలుతుందంట. అందువల్లే ఆ సమయంలో చూడటానికి అనుమతిస్తారు. మిగిలిన సమయం మొత్తం ఈ దేవాలయాన్ని మూసి వేసి ఉంటారు.

17. దివ్య తేజస్సు

17. దివ్య తేజస్సు

Image Source:

సాధారణంగా ఉగ్ర రూపం అనగానే భయంకర రూపం అని భావిస్తాము. అయితే అది తప్పు ఒక దివ్యమైన శక్తి , తేజస్సు అని అర్థం. అది కంటికి కనిపించదు. ఉదాహరణకు సూర్యుడిని ఉదయం, సాయంత్రం పూట మనం కొంత వరకూ చూడగలం. అదే మధ్యాహ్న సమయంలో మనం చూడలేము కదా? అన్నది ఇక్కడి పండితుల వాదన.

18. కేవలం ఉపాసన బలం ఉన్నవారు మాత్రమే

18. కేవలం ఉపాసన బలం ఉన్నవారు మాత్రమే

Image Source:

కేవలం ఉపాసన బలం ఉన్నవారు మాత్రమే అమ్మవారి విగ్రహం ఎదురుగా నిలబడి చూడటానికి వీలవుతుందని అది కూడా అమ్మవారు గ్రామ సంచారం బయలు దేరి వెళ్లినప్పుడు మాత్రమే కుదురుతుందని చెబుతారు. అందువల్లే పూజారి కూడా తెల్లవారుజాము 4.30 గంటలకు భూగ`హంలోకి వెళ్లి పది నిమిషాల్లో హారతి ఇచ్చి వెనక్కి వచ్చేస్తారు.

19. ఇక్కడ ఉంది దేవాలయం

19. ఇక్కడ ఉంది దేవాలయం

Image Source:

ఈ దేవాలయం వారణాసిలోని దశాశ్వమేథ ఘాట్ కు వెళ్లడానికి ముందు ఎడమ వైపున ఈ వారాహి అమ్మవారి దేవాలయం ఉంది. అక్కడ ఎవరిని అడిగినా ఈ దేవాలయం గురించి చెబుతారు. పడవలో వెళ్లేవారు మన్ మందిర్ ఘాట్ వద్ద దిగిపోయి మెట్ల మార్గం ద్వారి పైకి వెళ్లితే కుడి వైపునకు అమ్మవారి దేవాలయం ఉంటుంది.

20. కేసుల భయం

20. కేసుల భయం

Image Source:

ఇక ఈ అమ్మవారిని దర్శించడం వల్ల శత్రు భయం పోతుందని ముఖ్యంగా కోర్టు కేసులతో సతమతమయ్యేవారికి వెంటనే ఉపశమనం కలుగుతుందని చాలా కాలంగా భక్తులు నమ్మకం. అందువల్లే పెద్ద పెద్ద కేసుల్లో చిక్కుకొన్న వారు ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి