తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఎన్నో ప్రముఖ ప్రదేశాలున్నాయి. ఇక్కడి ప్రసిద్ధిచెందిన ప్రాంతాలను చూసేందుకు తెలంగాణ టూరిజం పర్యాటకులకు ఓ సరికొత్త టూర్ ప్యాకేజీనీ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీ అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ ప్రతి రోజు పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది. ఇది వన్‌డే టూర్ ప్యాకేజీ మాత్రమే..రండి భాగ్యనగరంలోని ఈ అందాలను చూసొద్దాం..
ఈ వన్‌డే ట్రిప్ హైదరాబాద్ నుంచే ప్రారంభమవుతుంది. ఈ టూర్‌లో భాగంగా బిర్లా మందిర్, చౌమహల్లా ప్యాలెస్, చార్మినార్, మక్కా మసీదు, లాడ్ బజార్‌లో షాపింగ్, సాలార్ జంగ్ మ్యూజియం, నిజాం కుపురానీ పెవిలియోన్, గుపురానీ పెవిలియన్, షాహీ టూంబ్స్, లుంబినీ పార్క్ వంటి ప్రాంతాలను సందర్శించొయొచ్చు. హైదరాబాద్ లోని హియామయత్‌నగర్ వద్ద టెర్మినేటింగ్ పాయింట్ ప్రవేశానికి కూడా అనుమతి ఉంటుంది. ఇక, హైదరాబాద్‌లోని అన్ని మ్యూజియంలు శుక్రవారం సందర్శనకు వీలుగా ఉండవు.
కాబట్టి ఆరోజు మ్యూజియమ్‌లకు బదులుగా జూపార్క్‌లను కవర్ చేస్తే సరిపోతుంది. ఈ టూర్ లో భాగంగా ప్రతి శుక్రవారం నెహ్రూ జూ పార్క్ సందర్శన ఉంటుంది. ప్రతి శుక్రవారం 7 స్థలాలు, మిగిలిన అన్ని రోజులు 9 స్థలాలు తెలంగాణ టూరిజం అందిస్తోన్న ఈ టూర్ ప్యాకేజీ లో కవర్ అవుతాయి. ఇక జూపార్క్ కేవలం శుక్రవారం మాత్రమే విజిటింగ్ ఉంటుంది.

ఇక టూర్ ప్రతీ రోజూ ఉదయం 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఉదయం 7.30 గంటలకు సికింద్రాబాద్ ఎస్‌పీ రోడ్డులోని యాత్రి నివాస్ నుంచి బస్సు ప్రారంభమవుతుంది. ఇక 7.45 గంటలకు బేగంపేటలోని టూరిజం ప్లాజా నుంచి బయలు దేరుతుంది. అలాగే బహీష్‌బాగ్ నుంచి ఉదయం 8.15 గంటలకు బస్సు బయలుదేరుతుంది. చివరిగా రాత్రి 7.30 గంటలకు ఐమాక్స్ వద్ద దించుతారు.
టూర్ ప్యాకేజీ వివరాలివే..
ఈ టూర్ లో భాగంగా ప్యాకేజీ ధరలు ఇలా ఉన్నాయి... నాన్ A/Cలో పెద్ద వారికి రూ.380గా నిర్ణయించారు. చిన్నారులకు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. అదే, ఏసీ జర్నీలో అయితే పెద్దలకు రూ.500, చిన్నారులకు రూ.400గా ప్యాకేజీ ఉంటుంది. ఈ ప్యాకేజీ బుకింగ్ కోసం 07:30 AM - రిజర్వేషన్ కార్యాలయం, TSTDC, యాత్రి నివాస్, S.P.రోడ్, సికింద్రాబాద్ ను సంప్రదించొచ్చు.

దీంతో పాటు 07:45 AM- రిజర్వేషన్ కార్యాలయం, TSTDC, టూరిజం ప్లాజా, బేగంపేట్, హైదరాబాద్ ఆఫీసు నెంబర్‌కు ఫోన్ చేసి వివరాలను తెలుసుకోవచ్చు.08:15 AM - CRO బషీర్‌బాగ్, గ్రౌండ్ ఫ్లోర్ శకర్ భవన్, ఎదురుగా. సీసీఎస్ పోలీస్ కంట్రోల్ రూమ్, టాటా మోటార్స్ పక్కన, బషీర్‌బాగ్, హైదరాబాద్ సంప్రదించవచ్చు. ఈ ప్రాంతాలను సందర్శించాలనుకునేవారు ఎంట్రీ టికెట్ తో పాటు భోజన ఖర్చులను భరించాలి. ప్రయాణికులు ఇతరపూర్తి సమాచారం కోసం తెలంగాణ టూరిజం అధికారికి వెబ్‌సైట్‌పై https://tourism.telangana.gov.in/package/hyderabadcitytour క్లిక్ చేయాల్సి ఉంటుంది.
సందర్శించాల్సిన ప్రదేశాలివే..
బిర్లా మందిర్,
చౌమహల్లా ప్యాలెస్,
చార్మినార్,
మక్కా మసీదు,
లాడ్ బజార్‌లో షాపింగ్,

సాలార్ జంగ్ మ్యూజియం,
నిజాం కుపురానీ పెవిలియోన్,
గుపురానీ పెవిలియన్,
షాహీ టూంబ్స్,
లుంబినీ పార్క్



Click it and Unblock the Notifications













