Search
  • Follow NativePlanet
Share
» »మీరు దర్శించదగ్గ క్షేత్రాలలో ముఖ్యమైనది సుప్రసిద్ధ శైవ క్షేత్రం ద్రాక్షారామం

మీరు దర్శించదగ్గ క్షేత్రాలలో ముఖ్యమైనది సుప్రసిద్ధ శైవ క్షేత్రం ద్రాక్షారామం

ద్రాక్షారామం తూర్పు గోదావరి జిల్లాలో రామచంద్రపురం మండలానికి చెందిన గ్రామము. ఇది అతి ప్రాచీన సుప్రసిద్ధ శైవ క్షేత్రం.

By Venkata Karunasri Nalluru

ద్రాక్షారామం తూర్పు గోదావరి జిల్లాలో రామచంద్రపురం మండలానికి చెందిన గ్రామము. ఇది అతి ప్రాచీన సుప్రసిద్ధ శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని క్రీ.శ. 7,8 శతాబ్ధాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తొంది. ఇక్కడి మూలవిరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలసిన 14 అడుగుల శివలింగం, శుద్ధ స్ఫటికాకార లింగం. ఈయన దేవేరి శ్రీ మాణిక్యంబా అమ్మవారు యావత్భారత దేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తి పీఠాలలో 12 వ శక్తిపీఠంగా వెలసియున్నది. తెలుగుకు ఆ పేరు త్రిలింగ అన్న పదం నుంచి ఏర్పడిందని కొందరి భావన. ఆ త్రిలింగమనే పదం ఏర్పడేందుకు కారణమైన క్షేత్ర త్రయంలో ద్రాక్షారామం ఒకటి. మిగిలిన రెండు క్షేత్రాలలో ఒకటి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరము కాగా, మరొకటి శ్రీశైలము. త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, అష్తాదశ శక్తిపీఠాలలో ద్వాదశ పీఠంగా, దక్షిణ కాశీగా, వ్యాస కాశీగా ద్రాక్షారామానికి ప్రశస్తి ఉంది. శిల్ప కళాభిరామమై, శాసనాల భాండాగారమై ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయం ఒప్పారుతోంది.

ఈ ఆలయాన్ని, సామర్లకోట లోని భీమేశ్వరాలయాన్ని కూడా చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని చెబుతారు. అందుకే ఈ రెండు గుడులు ఒకే రీతిగా ఉండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయికూడ ఒకటేరకంగా ఉంటుంది. ఈ క్షేత్రాన్ని గురించిన ప్రశంస శ్రీనాథకవి భీమేశ్వర పురాణంలో వివరించాడు. ఎంతో మంది తెలుగు కవులు శ్రీ భీమేశ్వరస్వామిని తమ పద్యాలలో కీర్తించారు.

పూర్వం దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశమే నేడు ద్రాక్షారామంగా పిలువబడుతుంది. ఒకప్పుడు ఇది దాక్షారామంగా పిలువబడి కాలక్రమేణా అది ద్రాక్షారామంగా మారింది. తన భర్తకి ఆహ్వానం లేకపోయినప్పటికీ పుట్టింటిపై ప్రేమతో ఆ యజ్ఞానికి వచ్చి అవమానంపాలైన పరమశివుని సతి సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశం ఇదే. తన భార్యను అవమాన పరిచినందుకుగాను వీరభద్రుడిని సృష్టించిన శివుడు దక్షుడి తల నరికించాడు. సతీదేవి వియోగ వివశత్వం నుంచి శివుడిని బయటపడేయడం కోసం శ్రీ మహా విష్ణువు ఆమె శరీరాన్ని 18 ఖండాలుగా చేశాడు. ఆమె శరీర అవయవాలు పడిన ప్రదేశాలు అష్టాదశ శక్తిపీఠాలుగా అవతరించాయి.

దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశమే నేడు ద్రాక్షారామం

1. భీమేశ్వరాలయం

1. భీమేశ్వరాలయం

ద్రాక్షారామంలో శివుడు భీమేశ్వరుడిగా స్వయంభువుగా అవతరించాడు. శ్రీ లక్ష్మీనారాయణుడు ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా ఉన్నాడు. ద్రాక్షారామం త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా పంచారామాల్లో ఒకటిగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రాన్ని గురించి శ్రీనాథ కవి సార్వభౌముడు తన కావ్యాల్లో పేర్కొన్నాడు. ఇక్కడి స్వామివారిని అభిషేకించడానికి సప్తఋషులు కలిసి గోదావరిని తీసుకు వచ్చారనీ పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి.అందువలన అంతర్వాహినిగా ప్రవహించే ఈ గోదావరిని సప్త గోదావరి' అని పిలుస్తూ వుంటారు.

PC:Palagiri

2. అష్ట లింగాలు

2. అష్ట లింగాలు

ఈ భీమేశ్వరుడికి ఎనిమిది దిక్కులలోను ఎనిమిది శివలింగాలను చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించాడని విశ్వసించబడుతుంది. ఈ భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో ఇంద్రేశ్వర, యజ్ఞేశ్వర, సిద్దేశ్వర, యోగీశ్వర, యమేశ్వర మరియు కాళేశ్వర వీరభద్రేశ్వర లింగాలు దర్శనమిస్తాయి.

PC:Ramachandra

3. స్థలపురాణం

3. స్థలపురాణం

పూర్వము తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేయగా, శివుడు సాక్షాత్కరించెను. ఆ రాక్షసుడు శివుని యొక్క ఆత్మలింగాన్ని వరంగా కోరగా శివుడు ఆత్మలింగాన్ని ప్రసాదించెను. క్రూర స్వభావం కలిగిన ఆ తారకాసురుడు ఆ లింగ శక్తి వలన దేవతలను, ఋషులను, సత్పురుషులను నానా ఇబ్బందులు పెట్టుచుండగా ఆ బాధలు భరించలేక వీరంతా విష్ణుమూర్తిని ప్రార్థించగా, అపుడు విష్ణువు ఆ లింగం తొలగితేగాని ఆ రాక్షసుని శక్తి నశించదనీ, ఈశ్వరుడి అంశతో జన్మించిన వానితో తప్ప మరెవ్వరి వలనా తనకు మరణం లేకుండ వరం పొంది ఉన్నాడని చెప్పగా, మన్మధ ప్రేరేపణచేత పార్వతీ కళ్యాణం, అనంతరం 'కుమార సంభవం' జరుగగా ఆ కుమారస్వామి రుద్ర గణములకు నాయకత్వం వహించి తారకాసురుడితో యుద్ధం చేయగా, కుమార స్వామి విసిరిన బాణం ఆ ఆత్మలింగానికి తగిలి అయిదు ముక్కలై భూమిమీద అయిదు చోట్ల పడెను. అవే పంచారామ క్షేత్రాలుగా అవతరించెను.

PC: Anudeep43

4. పంచారామ క్షేత్రాలు

4. పంచారామ క్షేత్రాలు

అవి వరుసగా అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట ఇలా భూమి మీద పడిన ఆత్మలింగాలు కైలాసాన్ని చేరుకోవాలని ఎదగడం ప్రారంభించెను. అలా ఎదిగి పోతూ ఉంటే కలియుగం వచ్చేసరికి మానవులకు అభిషేకాలకు గాని, దర్శనానికి గాని అందకుండా పోతాయని ఒక్కోచోట పడిన ఆత్మలింగానికి ఒక్కొక్క దేముడు అవి ఎదిగిపోకుండా ప్రతిష్ఠ చేసి అభిషేకార్చనలు చేసారు. ఆఅ దేవుడు ప్రతిష్ఠ చేసిన లింగం ఆయా దేవుని పేరుతో పిలవబడుతోంది.

PC: Adityamadhav83

5. అమరావతి:-

5. అమరావతి:-

ఇక్కడ ఇంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి 'అమరేశ్వరస్వామి ' గా వెలిసెను.
భీమవరం:- ఇక్కడ చంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి 'సోమేశ్వరస్వామి ' గా వెలిసెను.
పాలకొల్లు:- ఇక్కడ శ్రీ రామచంద్రమూర్తి ప్రతిష్ఠించాడు కాబట్టి క్షీరారామలింగేశ్వరస్వామి ' గా వెలిసెను.
సామర్లకోట:-ఆత్మలింగాన్ని చేధించిన దోషం తనకు రాకూడదని కుమారస్వామే స్వయంగా ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించెను కాబట్టి 'కుమారారామ భీమేశ్వరస్వామి 'గా వెలిసెను.

PC: Adityamadhav83

6. ద్రాక్షారామం ఎలా చేరుకోవాలి ?

6. ద్రాక్షారామం ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం:

ద్రాక్షారామం కి 36 కి. మీ. దూరంలో ఉన్న విమానాశ్రయం రాజమండ్రి విమానాశ్రయం. ఈ విమానాశ్రయం దేశీయ విమానాశ్రయం. ఇక్కడి నుంచి విజయవాడ, హైదరాబాద్, తిరుపతి, వైజాగ్ వంటి నగరాలకు విమాన సర్వీసులు ఉన్నాయి.

రైలు మార్గం:

ద్రాక్షారామం కి 30 కి. మీ. దూరంలో ఉన్నది సామర్లకోట రైల్వే జంక్షన్. ఇక్కడి నుంచి హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ మొదలగు నగరాలకు రైళ్లు అందుబాటులో ఉన్నాయి.

రోడ్డు మార్గం:

రోడ్డు మార్గం గురించి ఎటువంటి ఢోకా చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ద్రాక్షారామంకి అన్ని నగరాలనుంచి బస్సు సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. కనుక బస్సు మార్గం శ్రేయస్కరం.

కాకినాడకి 32 కి.మీ దూరములోను, రాజమండ్రికి 60కి.మీ దూరములోను ఉంది.

PC: Adityamadhav83

7. వసతి

7. వసతి

ప్రతీ నిత్యం భక్తులు ఆంధ్ర రాష్ట్రం నుండే గాక ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చి ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకుని వెళ్తుంటారు. యాత్రీకుల సౌకర్యార్ధము ఇచ్చట పైండా వారిచే నిర్మించబడిన అన్నసత్రం ఉంది. దేవస్థానం వారి యాత్రికుల వసతి గృహము ఆలయానికి 1/2 కి.మీ దూరంలో ఆర్.టి.సి బస్టాండుకు దగ్గరలో కోటిపల్లి రోడ్డులో ఉంది.

PC: Adityamadhav83

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+