Search
  • Follow NativePlanet
Share
» »కేవ‌లం రూ. 5వేల‌తో హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!

కేవ‌లం రూ. 5వేల‌తో హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!

హిమాచల్ ప్రదేశ్ సందర్శించడానికి వేసవి ఉత్తమ సీజన్. ఈ సీజన్‌లో ప‌ర్యాట‌కులు ఇక్కడ అత్యంత అందమైన దృశ్యాలను చూడొచ్చు. ఇక్కడ సందర్శించాల్సిన ప్రదేశాలకు కొరత లేనప్పటికీ, ప‌ర్యాట‌కులు అతి త‌క్కువ బ‌డ్జెట్‌తో హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని మండిలోని ప్ర‌సిద్దిచెందిన ప్రాంతాల‌ను వీక్షించొచ్చు. చాలామందికి ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టం. కానీ, బ‌డ్జెట్ స‌రిప‌డక వెనుక‌డుగు వేస్తుంటారు. రెండు రోజులు సెల‌వులు వ‌చ్చినా స‌రే టూర్ ప్లాన్ చేసేవాళ్లు కూడా ఉంటారు. అలాంటి వారికోసం అతి త‌క్కువ బ‌డ్జెట్‌తోనే మండిలోని ఈ ప్ర‌దేశాల‌ను చుట్టేయొచ్చు. ఇక్క‌డ కేవలం రూ. 5000లో అన్నీ ప్రాంతాల‌ను క‌వ‌ర్ చేసుకోవచ్చు.

ఇది హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నగరం. ఇది చాలా అందమైన హిల్ స్టేషన్. ఈ సీజ‌న్‌లో విహిరించేందుకు ఎంతో ఉత్త‌మ‌మైన ప్ర‌దేశ‌మ‌ని చెప్పుకోవాలి. ఈ నగరాన్ని సందర్శించడానికి రెండు మూడు రోజుల సమయం సరిపోతుంది. ఇక్కడ పర్యాటక ప్రదేశాలకు కొదవలేదు. ప్రకృతి ప్రేమికుల‌కు ఈ ప్ర‌దేశం ఖ‌చ్చితంగా న‌చ్చుతుంది. మండి నగరాన్ని సందర్శించడానికి వేసవికాలం సరైనది, కాబట్టి హిమాచ‌ల్ ప్ర‌దేశ్ సంద‌ర్శించిన‌ప్పుడు త‌ప్పకుండా ఈ ప్ర‌దేశాల‌ను వీక్షించాల్సిందే.

revalsarlake

మండి నగరంలో చూడదగిన ప్రదేశాలు...

రేవల్సర్ సరస్సు

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుండి 23 కిలోమీటర్ల దూరం ప్రయాణించడం ద్వారా ప‌ర్యాట‌కులు రేవల్‌సర్ సరస్సును చేరుకోవచ్చు. ఇది ఎంతో అంద‌మైన స‌ర‌స్సు. ఇక్క‌డి అందం ప‌ర్యాట‌కుల‌ను మంత్ర‌ముగ్గుల‌ను చేస్తోంది. ఈ సరస్సు హిందువులు, బౌద్ధులు మరియు సిక్కుల పుణ్యక్షేత్రంగా కూడా పిలువబడుతుంది. ఒకప్పుడు ఈ సరస్సు తేలియాడే ద్వీపాలకు కూడా ప్రసిద్ధి చెందింది. అయితే వాతావరణ మార్పు, నిర్మాణ పనుల కారణంగా ఇవి కనిపించవు. రేవల్సర్ సరస్సు సమీపంలో ఓ జంతుప్ర‌ద‌ర్శ‌న శాల కూడా ఉంది. ఇది కూడా ఇక్క‌డ సందర్శించదగిన ప్రదేశాల‌లో ఒక‌టి. ఈ జూను వీక్షించేందుకు కుటుంబంతో పాటు క‌లిసి వెళ్లొచ్చు.

kamrunaglake

కమ్రునాగ్ సరస్సు

మండిలో చూడదగిన మరొక సరస్సు కమ్రునాగ్ సరస్సు. ఇది మంచుతో కప్పబడిన ధౌలాధర్ పర్వతాలతో చుట్టుముట్టబడిన సరస్సు. ఇక్కడ ఒక ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ ప‌ర్యాట‌కులు ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో కాసేపు సేద‌తీరొచ్చు. ప్రకృతి ప్రేమికులు త‌ప్ప‌కుండా ఈ ప్రదేశాన్నిఅన్వేషించాల్సిందే. దౌలధర్ పర్వతశ్రేణి మధ్య సముద్ర మట్టానికి 3,334 మీటర్ల ఎత్తులో ఈ స‌రస్సు ఉంటుంది. ఈ సరస్సు చుట్టూ ఉండే అందాలు ప్రకృతి ప్రేమికులకు ఎంత‌గానో కనుల విందు చేస్తాయి.

ఇక్క‌డ ఎన్నో ఏళ్ల నుంచి లెక్కలేనంత సంపద దాగి ఉంద‌ని చరిత్ర చెబుతోంది. ఇక్క‌డ స్థానిక దేవ‌త‌లు కొలువై ఉన్నారు. ఇందులో దాగి ఉన్న సంపదను దోచుకునేందుకు దొంగలు చాలా సార్లు ప్రయత్నించిన సంరక్షక దేవతల కారణంగా అవి ఫలించలేదని ఇక్క‌డివారు నమ్ముతారు. ప్రతి సంవ‌త్స‌రం జూన్ నెలలో భక్తులు ఇక్క‌డికి పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రధాన దేవతకు ప్ర‌త్యేక ప్రార్ధనలు నిర్వహిస్తారు.

kamlafort

కమ్లా కోట

మండికి వచ్చిన తర్వాత కమ్లా కోటను చూడకుండా మాత్రం ఉండకండి. పర్వతాల మధ్య ఉన్న కమ్లా కోట దృశ్యాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఈ కోటను రాజా సూరజ్ 1625 సంవత్సరంలో నిర్మించారు. ఈ కోట ఒకప్పుడు మార్కెట్‌కు గర్వకారణంగా ఉండేదని ఇక్క‌డివారి నమ్మకం.

త్రిలోకీ నాథ్ ఆలయం

త్రిలోకీ నాథ్ ఆలయం మండిలోని చాలా పురాతన దేవాలయం. ఎంతో ప్ర‌సిద్ధిచెందిన ఆల‌యాలలో ఒకటి. ఇక్కడ సందర్శించడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయి. ఈ ఆలయంలో శివుని విగ్రహం పంచనన్. ఇది శివుని ఐదు రూపాలను చూపుతుంది. శివరాత్రి సందర్భంగా ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. గుడి చుట్టూ పచ్చదనంతో ఈ ప్రాంతం మరింత అందంగా ఉంటుంది. ఇక్కడ దర్శనానికి ఎలాంటి రుసుము చెల్లించ‌న‌వ‌స‌రం లేదు.

More News

    Read more about: mandi himachal pradesh
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+