Search
  • Follow NativePlanet
Share
» »ఏప్రిల్‌ 9 నుంచి ప్రారంభం కానున్న ఊటీ ఎక్స్ హైదరాబాద్ టూర్‌ ప్యాకేజీ.

ఏప్రిల్‌ 9 నుంచి ప్రారంభం కానున్న ఊటీ ఎక్స్ హైదరాబాద్ టూర్‌ ప్యాకేజీ.

మ‌రికొన్ని రోజుల్లో వేస‌వి సెల‌వులు రాబోతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో చాలామంది చ‌ల్ల‌ని ప్రాంతాల‌కు, హిల్‌స్టేష‌న్‌ల‌కు వెళ్లేందుకు ప్ర‌ణాళిక‌లు వేస్తుంటారు. ప‌చ్చ‌ని ప్ర‌కృతి నడుమ సేదతీరాల‌నుకునేవారు మ‌రికొంద‌రుంటారు. అలాంటివారు చాలామంది ఊటీ వంటి ప్ర‌దేశాల‌ను ఎక్కువ‌గా ఎంపిక చేసుకుంటుంటారు. అయితే, ప్ర‌యాణికుల కోసం ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ఓ స‌రికొత్త ప్యాకేజీని ముందుకు తెచ్చింది. ఈ ప్యాకేజీతో కేవ‌లం 13వేల రూపాయ‌ల‌తో ఊటీ ట్రిప్ ప్లాన్ చేసుకోవ‌చ్చు. ఆ వివ‌రాలేంటో ఓ సారి చూసేద్దాం.

రెండు తెలుగు రాష్ట్రాల వారికి అవ‌కాశం..

ఐఆర్‌సీటీసీ అందిస్తోన్నఈ టూర్‌ ప్యాకేజీ పేరు అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్. ఈ ప్యాకేజీ ఈ నెల 9 నుంచి మే 28 వరకు అందుబాటులో ఉంటుంది. ఇక ఈ ట్రైన్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రయాణిస్తుంది. ప్ర‌యాణికులు గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్‌, తెనాలి రైల్వేస్టేషన్లలో ఈ ట్రైన్ ఎక్కే అవ‌కాశం ఉంటుంది. ఊటీ ప్రయాణం ముగించుకున్నాక మళ్లీ ఆయా రైల్వే స్టేషన్లలో దిగొచ్చు. ఈ టూర్ ప్యాకేజీ మొత్తం ఐదు రాత్రులు ఆరు పగళ్లు ఉంటుంది. ఈనెల 9 వ తేదికి సంబంధించిన టిక్కెట్లు ఇప్ప‌టికే సేల్ అయిపోయాయి. ఇక‌, ఏప్రిల్‌ 16, 23, 30, మే 14, 21, 28 తేదీల్లో ప్రయాణించాలనుకునే వారు టిక్కెట్ల‌ను కొనుగోలు చేయొచ్చు.

irctcootytourpackage

ధ‌ర‌ల వివ‌రాలు...

థర్డ్‌ ఏసీ బెర్త్ కంఫర్ట్‌లో ఒక్కో ప్రయాణికుడికి రూమ్‌ సింగిల్ షేరింగ్‌లో అయితే రూ.33,020 చెల్లించాల్సి ఉంటుంది. ఇద్ద‌రికి రూమ్ షేరింగ్‌కు రూ.18,480, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.14,870 చెల్లించాల్సి ఉంటుంది. 5 - 11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌కు రూ.9,430, విత్ అవుట్ బెడ్ అయితే రూ.9,180 ఉంటుంది. ఇక‌, స్లీపర్‌ బెర్త్‌ స్టాండర్డ్‌లో రూమ్‌ సింగిల్ షేరింగ్ అయితే రూ.30,560 చెల్లించాలి. ట్విన్ షేరింగ్‌కు రూ.16,020 చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్‌కు రూ.12,410. ఇక 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో రూ.6,970, అదే విత్ అవుట్ బెడ్ అయితే రూ.6,730 చెల్లించాలి. గ్రూప్‌ బుకింగ్‌పై కొంత మేర తగ్గుతుంది.

ఆరు రోజుల ప‌ర్య‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి...

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో మధ్యాహ్నం 12.20 గంటలకు ప్ర‌యాణం మొద‌ల‌వుతుంది. ఆ రోజు శబరి ఎక్స్‌ప్రెస్‌ (రైలు నం.17230) బయల్దేరుతుంది. మ‌రుస‌టి రోజు ఉదయం 8 కి కోయంబత్తూరు రైల్వే స్టేషన్‌ చేరుకుంటారు. అక్కడ నుంచి ఊటికి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హోట‌ల్‌లో రిలాక్స్ అయిన త‌ర్వాత సాయంత్రం బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ అందాలను చూడొచ్చు.

ఇక‌, మూడో రోజు ఉదయం హోటల్‌లోనే టిఫిన్ ముగించుకుని దొడబెట్ట పీక్‌, టీ మ్యూజియం, పైకారా జలపాతాల‌ను చూడ‌డంతో ఆ రోజు పర్యటన ముగ్గుస్తుంది. నాలుగో రోజు ఉదయం టిఫిన్ చేసి కూనూర్‌ పర్యటనకు బయ‌లుదేరుతారు. రాత్రి అదే హోట‌ల్‌లో స్టే చేస్తారు. ఐదో రోజు అదే హోటల్‌లో టిఫిన్ చేసి ఊటీ నుంచి కోయంబత్తూర్‌కు బ‌యలుదేరుతారు. సాయంత్రం 4:35 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్‌ నెం:17229) ఎక్కాల్సి ఉంటుంది. ఇక‌, ఆరో రోజు మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ స్టేష‌న్ చేరుకోవడంతో ఊటీ ప్ర‌యాణం ముగుస్తోంది.

క్యాన్సిలేషన్‌ ఛార్జీ ఉంది...

ఒక‌వేళ ప్ర‌యాణానికి 15 రోజుల ముందు టికెట్‌ను క్యాన్సిల్‌ చేసుకుంటే ఒక్కో టికెట్‌కు రూ.250 క్యాన్సిలేషన్‌ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అదే 8 నుంచి 14 రోజుల్లోపు అయితే టికెట్‌ మొత్తం ధరలో 25 శాతం, 4 నుంచి 7 రోజుల్లోపు అయితే 50 శాతం డబ్బును మీ టికెట్‌ ధర నుంచి మినహాయిస్తారు. ప్రయాణానికి నాలుగు రోజుల ముందు టికెట్‌ క్యాన్సిల్‌ చేస్తే ఎలాంటి తిరిగి చెల్లింపులూ ఉండవనే విష‌యాన్ని ప్ర‌యాణికులు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది.

ఇక‌, టూర్ ప్యాకేజీలో భాగంగా ఊటీలో మూడు రాత్రులు స్టే చేసేందుకు ఏసీ గదులు, టిఫిన్ ఫ్రీగా లభిస్తుంది. దీంతోపాటు ట్రావెల్‌ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. టోల్‌, పార్కింగ్‌ ఛార్జీలు వంటివన్ని ప్యాకేజీలో అంతర్భాగమ‌నే చెప్పుకోవాలి. మీల్స్, డిన్న‌ర్ వంటివన్నీ ప్ర‌యాణికులే చూసుకోవాలి. రైలు ప్రయాణంలోనూ భోజన ఏర్పాట్లు ఉండవు. బోటింగ్‌, హార్స్‌ రైడింగ్‌ వంటివి ప్యాకేజీలో ఉండవు.

More News

Read more about: irctc ooty tour package
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+