మంత్రాలయం అంటే శ్రీ గురు రాఘవేంద్ర స్వామియే గుర్తుకు వస్తారు. మంత్రాలయము అతి ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం. ఇది కర్నూలు నుండి 100కి.మీ దూరంలో ఉంది. రాఘవేంద్ర స్వామికి మరొక పేరు వేంకటనాథుడు. తిమ్మన్న భట్టు, గోపికాంబల రెండవ సంతానంగా వేంకట నాథుడు జన్మించాడు. మంత్రాలయం అసలు పేరు 'మాంచాలే'. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర తీర్ధుల దేవాలయం. ఆయన శ్రీ హరి భక్తుడు. కలియుగంలో భూమిపై ధర్మాన్ని, నీతిని స్దాపించడానికి దైవసంకల్పాన జన్మించిన కారణజన్ముడు శ్రీ రాఘవేంద్ర స్వామి.రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్ర అసంఖ్యాకంగా ఉన్న స్వామి భక్తులకు ఎంతో ఉత్తేజాన్ని, భక్తి భావాన్ని కలుగజేస్తుంది.
రాఘవేంద్ర స్వామిని ప్రహ్లాదుని మరో అవతారంగా భావిస్తారు. రాఘవేంద్ర స్వామి శ్రీరాముని మరియు పంచముఖ హనుమంతుడు యొక్క పరమ భక్తులు. ఇతను పంచముఖిలో తపస్సు చేసాడు. ఇచ్చట హనుమంతుణ్ణి దర్శించాడు. మంత్రాలయంలో తన మఠాన్ని స్థాపించాడు, మరియు ఇక్కడే సజీవ సమాధి అయ్యాడు. 1671 లో మంత్రాలయంలో స్వామి జీవ సమాధి చెందారు. వేలకొలదీ భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు. మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి మఠంతో పాటు రాఘవేంద్ర స్వామి బృందావనం, సార్వభౌమ విద్యా పీఠం, మాంచాలమ్మ దేవాలయం, శివలింగం మరియు పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉన్నాయి.

ఇక్కడి ప్రత్యేకత ఆంజనేయ స్వామి ఐదు ముఖాలతో ఉండటం
పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం మంత్రాలయం నుండి 5కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో హనుమంతుడు ప్రధాన ఆరాధ్య దైవం. ఇక్కడి ప్రత్యేకత ఆంజనేయ స్వామి ఐదు ముఖాలతో ఉండటం. విగ్రహానికి గరుడ, నరసింహ స్వామి, హయగ్రీవ, హనుమాన్ మరియు వరాహ స్వాములను ప్రాతినిధ్యం వహిస్తూ అయిదు తలలు ఉంటాయి. ఈ దేవాలయంలోని ఆంజనేయ స్వామి చాలా మహిమగలవాడని ప్రతీతి.

పంచముఖి అనగా ఐదు ముఖాలు కలవాడు అని అర్థం
పంచముఖి అనగా ఐదు ముఖాలు కలవాడు అని అర్థం. పంచముఖాలు కలిగిన దేవుళ్ళ ఆలయాలు చాలా అరుదుగా కనబడుతాయి. పూర్వనామం గాణదాల అనే పేరు కలిగిన పంచముఖి గ్రామం కర్నాటక లోని రాయచూరు జిల్లాలో తుంగభద్రా నదికి ఇటువైపు మంత్రాలయం ఆంధ్రప్రదేశ్ కి చెందినది. అటువేపు గాణదాల కర్ణాటక రాష్ట్రానికి చెందినది. చుట్టూ కొండలు, అందమైన ప్రకృతి, సమీపంలో తుంగభద్రా నదితో ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంది. ఈ ప్రదేశంలో హనుమంతుడు శ్రీ రాఘవేంద్ర స్వామికి పంచముఖ రూపంలో దర్శనమిచ్చాడు. అందుకే ఇది పంచముఖిగా ప్రసిద్ది చెందినది.

పంచముఖ ప్రాశస్త్యం:
పంచముఖి ఆంజనేయుని విగ్రహం ఐదు ముఖాలు, పది ఆయుధాలతో భక్తులకు దర్శనమిస్తుంటాడు. పంచముఖ ఆంజనేయస్వామిగా కొలిచే అవతారంలో హనుమంతుడు, నరసింహుడు, గరుడుడు, వరాహుడు, హయగ్రీవుడు ఉన్నారు. హనుమంతుడు రావణుని సంహార సమయంలో పంచముఖి అవతారాన్ని ఎత్తారని ప్రసస్థి.

పంచముఖ ప్రాశస్త్యం:
కంభరామాయణంలో హనుమంతుని గురించి చాలా చక్కగా వివరించారు. పంచభూతాలకి ప్రతి రూపం కూడా ఈ ఆంజనేయ స్వామి. గాలి, నీరు, ఆకాశం, భూమి, నిప్పు వీటిని తనలో ఇముడ్చుకున్నాడు.పవన తనయుడు, ఆకాశ మర్గాన సముద్రాన్ని దాటి ఆవనిజ అయిన సీతాదేవి జాడ తెలుసుకుని అగ్నితో లంకాదహనం చేశాడు.

పంచముఖ ప్రాశస్త్యం:
అలాగే సుందరా కాండలో కూడా హనుమంతుని ధీర లక్షణాలను ఐదవ ఖండంలో చాలా చక్కగా వివరించారు. అలాగే పంచముఖ ఆంజనేయునిలో తూర్పు దిక్కుని చూసే ఆంజనేయుడు మనోభీష్టాలు తీర్చే వానిగాను, దక్షిణ దిక్కు చూసే ఉగ్ర నరసింహుడు అభీష్ట సిద్ధిని, పడమర దిక్కుని చూసే మహావీరుడైన గరుడు సకల సౌభాగ్యాన్ని, ఉత్తర దిక్కుని చూసే వరాహ స్వామీ ధన ప్రాప్తిని, ఊర్థ ముఖుడైన హయగ్రీవుడు సర్వ విద్యాప్రాప్తిని అందిస్తారని ప్రతీతి.

ఐదు రకాలైన భక్తి భావాలున్నాయి
ఐదు రకాలైన భక్తి భావాలున్నాయి. నామం, స్మరణం, కీర్తనం, యాచనం, అర్పణం. శ్రీరాముడిని హనుమంతుడు ఐదు రకాలుగా కొలుస్తాడు. ఎప్పుడూ శ్రీరామ నామం స్మరిస్తూర, కీర్తిస్తూ, రాముని కరుణ ప్రేమకై పరితపిస్తూ(యాచన)తనని తాను అర్పించుకున్నాడు. ఇంతటి శక్తివంతమైన, మహిమాన్వితమైన ఈ శ్రీ పంచముఖి ఆలయాన్ని తప్పక దర్శించవలసిన ప్రదేశం.

శ్రీ రాఘవేంద్ర రాయరు
శ్రీ మధ్వాచార్యుల ద్వైత సిద్దాంతాన్ని అనుసరించిన శ్రీ రాఘవేంద్ర రాయరు తుంగభద్రా నదీ తీరాన ఉన్న మంచాలలో ఉన్నప్పుడు తుంగభద్రా నదికి ఆవల ఉన్న గాణదాల, బిక్షాలయ అనే గ్రామాలను దర్శించే వారు. గాణదాళలో ఒక కొండ గుహలో శ్రీ రాఘవేంద్ర స్వామి తపస్సు చేయగా హనుమంతుడు పంచముఖ ఆంజనేయ స్వామి రూపంలో దర్శనమించాడని ప్రతీతి.

అన్ని చోట్లో విగ్రహ రూపంలో కాకుండా రాతిపై వెలసినట్లుగా
అన్ని చోట్లో విగ్రహ రూపంలో కాకుండా రాతిపై వెలసినట్లుగా కనిపిస్తాడు. స్వయంభవుగా రాతిపై వెలసిన ఆంజనేయ స్వామిని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి కొలిచిన ప్రదేశం ఇది. ఈ కొండ గుహలో శ్రీరాముడిని, ఆంజనేయుని పూజించిన తర్వాత గురు రాఘవేంద్ర స్వామి వారు శ్రీ వేంకటేశ్వరుడు, శ్రీ మహాలక్ష్మీ విగ్రహాలను చెక్కినట్లుగా చెబుతారు.

అన్ని చోట్లో విగ్రహ రూపంలో కాకుండా రాతిపై వెలసినట్లుగా
శ్రీ గురు రాఘవేంద్ర స్వామికి పంచముఖ ఆంజనేయ స్వామి, కొల్హాపుర మహాలక్ష్మీ, తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి కూర్మావతారంలో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైనట్లుగా ఇక్కడ చరిత్ర చెబుతుంది. ఆ తర్వాత రాఘవేంద్ర స్వామి మంత్రాలయం వెళ్లి అక్కడ సజీవ సమాధి అయ్యారు.

సాయంత్రం స్వామివారి ఏనుగు అందరిని దీవిస్తూ సందడి
పంచముఖ ఆలయ ప్రాంగణంలో సహజంగా రాళ్ళతో ఏర్పడిన కొన్నిఆకృతులు నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. మంచత తలగడ, దేవతల విమానం, తాబేలు, పాదుకలు, ఇంకా ఎన్నో ఆకారాలు మనకి దర్శనమిస్తాయి. పంచముఖ ఆలయంలో నిత్య పూజలు నిర్వహిస్తుంటారు. ప్రతిరోజు ఉచిత అన్నదానం జరుగుతుంది. ఇక్కడ గురువారం ప్రత్యేకత. సాయంత్రం స్వామివారి ఏనుగు అందరిని దీవిస్తూ సందడి చేస్తుంది. ఈ ఆలయంలో శ్రీ అనంతాచార్యులు అనే శిష్యులు రుద్రదేవుడు, గణపతి, నాగ దేవుని విగ్రహాలు ప్రతిష్టించారు.
Photo Courtesy: Mohan Krishnan

మంత్రాలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఈ క్షేత్రాన్ని తప్పకుండా సందర్శిస్తుంటారు
మంత్రాలయానికి రాయచూరుకు మధ్య ఈ పుణ్యక్షేత్రం ఉంది. మంత్రాలయం నుంచి కేవలం 30 నిమిషాల ప్రయాణంతో ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. సాధారణంగా మంత్రాలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఈ క్షేత్రాన్ని తప్పకుండా సందర్శిస్తుంటారు.

ఎలా వెళ్లాలి?
రోడ్ మార్గం :
మార్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ బస్సుల ద్వారా మంత్రాలయం చక్కగా అనుసంధానమై ఉంది. మంత్రాలయం నుండి కర్నూల్ మరియు హైదరాబాద్ ల కు బస్సు సర్వీసులు తరచూ అందుబాటులో ఉంటాయి.
రైలు మార్గం
మంత్రాలయం రైల్వే స్టేషన్ కేవలం 15 కిలోమీటర్ల దూరం లో నే ఉంది. చెన్నై మరియు రాయచూర్ రైల్ రూట్ లో ఈ రైల్వే స్టేషన్ ఉంది. ఈ స్టేషన్ లో సమీప నగరాలకు రెగ్యులర్ రైల్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
వాయు మార్గం
సమీపం విమానాశ్రయం: మంత్రాలయం నుండి 232.6 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం నుండి మంత్రాలయానికి టాక్సీలు అందుబాటులో వున్నాయి.



Click it and Unblock the Notifications













