సరస్సు : పాంగోంగ్
జిల్లా : లడఖ్
రాష్ట్రం : జమ్మూ కాశ్మీర్
పాంగోంగ్ లేక్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కలదు. ఇది ఉత్తర సరిహద్దు ప్రాంతంలో ఉన్న లడఖ్ జిల్లాలో చైనా సరిహద్దు లో ఉన్నది. పాంగోంగ్ లేక్ ఒక అంతర్జాతీయ సరస్సు ఎందుకంటే ఇది ఇండియా, చైనా దేశాలలో విస్తరించి ఉన్నది.
ఇది కూడా చదవండి : అందాల జమ్మూ & కాశ్మీర్ పర్యటన !!
పాన్గోంగ్ - త్సో ని పాంగోంగ్ సరస్సు అని కూడా పిలుస్తారు. ఇది సముద్ర మట్టానికి 4350 మీ. ఎత్తున ఉన్నది. ఇది చైనా క్రింద ఉన్న టిబెట్ సరిహద్దుగా ఉన్న చాంగ్ తాంగ్' పీఠభూమి మీద ఉన్నది. ఈ సరస్సు యొక్క పొడవు 134 కి.మీ. పైన ఉండి, దీనిలో సగానికి పైగా టిబెట్ మీద ఉన్నది. దీని గుండా లైన్ అఫ్ యాక్చువల్ కంట్రోల్ వెళుతున్నది.

పాంగోంగ్ సరస్సు
ఇది ఉప్పునీటి సరస్సు ఐనప్పటికీ, పాన్గోంగ్ పూర్తిగా శీతాకాలంలో ఘనీభవిస్తుంది. ఈ సరస్సులోని నీరు ఎక్కువ చవుడు కలిగి ఉండటం వలన ఈ నీరు వ్యవసాయానికి ఎక్కువ ఉపయోగపడదు.
చిత్రకృప : Alin Dev

పాంగోంగ్ సరస్సు
ఇందులో జలచరాలు కూడా ఎక్కువకాలం జీవించలేవు. కేవలం కొన్ని రకాల చెట్లు, పొదలు ఈ సరస్సు చుట్టూ ఉన్నాయి. అనేక రకాల వలస పక్షులు, వివిధ రకాల పక్షులు సంతాన ఉత్పత్తి కోసం ఈ సరస్సుకు వొస్తుంటాయి.
చిత్రకృప : Priyambada Nath

ఇంటర్నేషనల్ ప్రాధాన్యత
వేసవికాలంలో పొడుగు తల ఉన్న బాతులు, బ్రహ్మిని బాతులు ఈ ప్రాంతంలో చూడవొచ్చు. ఇంకా, అడవి పందికొక్కులు, కియాంగ్ లను చూడవొచ్చు.. ప్రత్యేకంగా దూరతీరాలనుండి వొచ్చే వలస పక్షుల కోసం ఏర్పాటు చేయబడింది. దీనికి ఇంటర్నేషనల్ ప్రాధాన్యత ఉన్నది.
చిత్రకృప : Silver Blue

3 ఇడియట్స్
ఇక్కడి ప్రకృతి దృశ్యాలను '3 ఇడియట్స్' మరియు 'ది ఫాల్' అనే సినిమాలలో తీసుకున్నారు. ఈ సినిమాల విజయం తరువాత ఈ ప్రదేశానికి ఇంకా ఎక్కువ ప్రాచుర్యం ప్రపంచమంతటా వొచ్చింది.
చిత్రకృప : _paVan_

విజిటింగ్ సమయం
ఈ ప్రాంతం వేసవిలో సమతలఉష్ణం మరియు శీతాకాలంలో అతి శీతలంగా ఉంటుంది. యాత్రికులు దీనిని వేసవికాలంలో సందర్శించవొచ్చు. మే నుండి సెప్టెంబర్ వరకు ఈ ప్రాంతంలో అత్యధిక మరియు అత్యల్ప ఉష్ణోగ్రతలు వరుసగా 40 డిగ్రీల సెంటిగ్రేడ్, 5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటాయి.
చిత్రకృప : Ashwin Kumar

గ్రీన్ వాలీ
పాన్గోంగ్ సరస్సు సముద్ర మట్టానికి 4350 మీ. ఎత్తున ఉన్నది. దీనినే పాన్గోంగ్ త్సో అని కూడా అంటారు. దీని పొడవు 134 కి.మీ. మరియు వెడల్పు 5 కి. మీ. యాత్రికులు దీనిని దర్శించటానికి వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న గ్రీన్ వాలీ మరియు తిక్సీ విలేజ్ ను కూడా చూడవొచ్చు.
చిత్రకృప : varun suresh

జలపక్షులు
తిక్సీ విలేజ్ వెళ్ళే దారిలో పురాతన కాలం నాటి స్తూపాలను చాల చూడవొచ్చు. పక్షులను ప్రేమించేవారు ఈ సరస్సు దగ్గర వేచి వుంటే, పొడుగు తల కల పెద్ద బాతులు, సైబీరియన్ కొంగలు మరియు జలపక్షులు ఇలా అనేక రకాల విహంగ పక్షులను చూడవొచ్చు.
చిత్రకృప : Akankshasood1209

ఇన్నర్ లైన్ పర్మిట్
శీతాకాలంలో ఈ సరస్సు ఉప్పగా గడ్డ కడుతుంది. లెహ్ నుండి 5 గంటలు సమయం పడుతుంది, ఈ స్థలం చూడటానికి ఒక ఇన్నర్ లైన్ పర్మిట్ పొందుతేనే సాధ్యపడుతుంది ఎందుకంటే ఇది సైనో-ఇండియన్ లైన్ ఆఫ్ అక్యుచువల్ కంట్రోల్ క్రింద ఉన్నది.
చిత్రకృప : solarisgirl

పర్మిట్ ఎక్కడ తీసుకోవాలి ?
ఇండియన్ నేషనల్ అయితే, ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా పర్మిట్ తీసుకోవాలి, వేరేవాళ్ళు అయితే, గ్రూప్ పర్మిట్ తీసుకోవాలి. ఒక్కో గ్రూప్ లో కనీసం ముగ్గురు ఉండాలి. వీరు తప్పనిసరిగా ఒక అధికార గైడ్ తో కలిసి ఉండాలి. ఈ పెర్మిట్ల కోసం లెహ్ టూరిస్ట్ ఆఫీసు కనీస చార్జ్ వసూల్ చేస్తున్నది. ఇక్కడ భద్రతా కారణాల వాళ్ళ ఈ సరస్సులో బోటింగ్ కు అనుమతి లేదు.
చిత్రకృప : solarisgirl

పాంగోంగ్ ఎలా వెళ్ళాలి ?
రోడ్డు మార్గం : పాంగోంగ్ సరస్సు చేరుకోవటానికి లడఖ్, లేహ్ నుండి బస్సు సౌకర్యాలు ఉన్నాయి.
రైల్ ద్వారా: జమ్మూ తావి రైల్వే స్టేషన్ పాన్గోంగ్ కు దగ్గరలో ఉన్నది. ఈ రైల్వే జంక్షన్ ఇండియాలోని , త్రివేండ్రం, న్యూ డిల్లి, చండీఘర్, శ్రీనగర్, గోవా,ముంబై వంటి అతి పెద్ద నగరాలకి జత చేయబడి ఉన్నది.
విమానం ద్వారా: పాన్గోంగ్ కు దగ్గరగా 218 కి. మీ. దూరంలో లెహ్ విమానాశ్రయం ఉన్నది. పర్యాటకులు లెహ్ ద్వారా న్యూ డిల్లీకి జత చేసిన విమానాలలో వెళ్లవొచ్చు. పాన్గోంగ్ నుండి టాక్సీస్, బస్సులు లెహ్ విమానాశ్రయానికి ఉన్నాయి.
చిత్రకృప : Satish Krishnamurthy



Click it and Unblock the Notifications














