Search
  • Follow NativePlanet
Share
» »సంతానం లేదా ఈ సుబ్రహ్మణ్యస్వామి దేవాలయాన్ని సందర్శించండి

సంతానం లేదా ఈ సుబ్రహ్మణ్యస్వామి దేవాలయాన్ని సందర్శించండి

పూజ్ముడిర్కోలై మురుగన్ హిందూ దేవాలయంలో ప్రధానదైవం సుబ్రహ్మణ్యస్వామి.

తమిళనాడుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మురుగన్‌కు వేల సంఖ్యలో దేవాలయాలు ఉన్నాకూడా ఈ దేవాలయం అత్యంత విశిష్టమైనది. అరుపడైవీడులో ఈ దేవాలయం చివరిది. తమిళ సాహిత్యంలో అనేక చోట్ల ఈ దేవాలయం ప్రస్తావన మీకు కనిపిస్తుంది. ఇక్కడ వెలిసిన సుబ్రహ్మణ్యస్వామి భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్నాడు. ముఖ్యంగా సంతానంలేనివారు ఈ దేవాలయాన్ని సందర్శిస్తే వెంటనే సంతానం కలుగుతుందని స్థానికులు చెబుతూ ఉంటారు. అటువంటి దేవాలయానికి సంబంధించిన వివరాలు మీ కోసం...

పూజ్ముడిర్కోలై మురుగన్ హిందూ దేవాలయం

పూజ్ముడిర్కోలై మురుగన్ హిందూ దేవాలయం

P.C: You Tube

పూజ్ముడిర్కోలై మురుగన్ హిందూ దేవాలయంలో ప్రధానదైవం సుబ్రహ్మణ్యస్వామి. ఈ దేవాలయం మదురైకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దేవాలయం చిన్న గుట్ట పై ఉండగా చుట్టూ దట్టమైన అడవులు ఉన్నాయి.

పూజ్ముడిర్కోలై మురుగన్ హిందూ దేవాలయం

పూజ్ముడిర్కోలై మురుగన్ హిందూ దేవాలయం

P.C: You Tube

మురుగన్ యొక్క ఆరు ముఖ్యమైన దేవాలయాల్లో ఒకటి. దీనినే తమిళంలో అరుపడైవీడు అని అంటారు. ఈ సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం ప్రముఖ విష్ణు దేవాయం అజఘర్ కోవిల్‌కు అత్యంత సమీపంలో ఉంటుంది.

పూజ్ముడిర్కోలై మురుగన్ హిందూ దేవాలయం

పూజ్ముడిర్కోలై మురుగన్ హిందూ దేవాలయం

P.C: You Tube

పూజ్ముడిర్కోలైలోని ప్రధాన విగ్రహం అజఘర్ దేవాలయంలో ఉండేదని అయితే తిరుమలై నాయక్ కాలయంలో ప్రస్తుతం ఉన్న చోటకు మార్చబడిందని చెబుతారు. మధురై నుంచి పూజ్ముడిర్కోలైకు నిత్యం బస్సు సర్వీసులు ఉన్నాయి.

పూజ్ముడిర్కోలై మురుగన్ హిందూ దేవాలయం

పూజ్ముడిర్కోలై మురుగన్ హిందూ దేవాలయం

P.C: You Tube

మధురైలో రూట్ నెంబర్ 44 బస్సులు ఈ దేవాలయం వద్దకు వెలుతాయి. అదే విధంగా గుట్ట పై ఉన్న ఈ దేవాలయం చేరుకోవడానికి గుట్ట కింద నుంచి పైకు ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది.

పూజ్ముడిర్కోలై మురుగన్ హిందూ దేవాలయం

పూజ్ముడిర్కోలై మురుగన్ హిందూ దేవాలయం

P.C: You Tube

ప్రయాణ సమయం 15 నిమిషాలు కాగా దూరం 3.4 కిలోమీటర్లు. ఇక ఈ గుట్ట చాలా ఫలవంతమైనది. ఇక్కడ అనేక రకాల పండ్లు, కూరగాయల చెట్లు ఉంటాయి. అందువల్లే గుట్ట పైకి ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

పూజ్ముడిర్కోలై మురుగన్ హిందూ దేవాలయం

పూజ్ముడిర్కోలై మురుగన్ హిందూ దేవాలయం

P.C: You Tube

ఇక్కడ మురుగన్‌కు వళ్లి, దేవయానికి వేర్వేరుగా విగ్రహాలు ఉన్నాయి. ఈ దేవాలయానికి కొంత పై భాగంలో స్థానిక గిరిజన తెగలు నివశిస్తూ ఉంటాయి. తమిళనాడుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మురుగన్‌కు వేల సంఖ్యలో దేవాలయాలు ఉన్నాకూడా ఈ దేవాలయం అత్యంత విశిష్టమైనది.

పూజ్ముడిర్కోలై మురుగన్ హిందూ దేవాలయం

పూజ్ముడిర్కోలై మురుగన్ హిందూ దేవాలయం

P.C: You Tube

అరుపడైవీడులో ఈ దేవాలయం చివరిది. తమిళ సాహిత్యంలో అనేక చోట్ల ఈ దేవాలయం ప్రస్తావన మీకు కనిపిస్తుంది. ఇక్కడ మురుగన్ తన భక్తురాలైన అవ్వయార్‌కు పరీక్ష్ పెట్టిన చోటు ఇదేనని చెబుతారు.

పూజ్ముడిర్కోలై మురుగన్ హిందూ దేవాలయం

పూజ్ముడిర్కోలై మురుగన్ హిందూ దేవాలయం

P.C: You Tube

ఇందుకు సంబందించిన కథ కూడా ప్రాచూర్యంలో ఉంది. ఒకసారి అవ్వయార్ ఎండలో నడచుకొంటూ ప్రస్తుతం దేవాలయం ఉన్న చోటుకు వస్తుంది. ప్రయాణ బడలిక వల్ల అక్కడ ఉన్న ఓ చెట్టు కింద కూర్చొంటుంది.

పూజ్ముడిర్కోలై మురుగన్ హిందూ దేవాలయం

పూజ్ముడిర్కోలై మురుగన్ హిందూ దేవాలయం

P.C: You Tube

అక్కడే ఉన్న బాలుడు మీకు ఆలకలిగా ఉన్నట్లు ఉంది పండ్లు తింటారా? అని అవ్వయార్‌ను అడిగాడు. ఇందుకు అవ్వయార్ అవునని సమాధానం ఇస్తుంది. దీంతో గోవుల కాపరి వేషంలో ఉన్న ఆ మురుగన్ వేయించిన పండ్లు కావాలా? పచ్చిగా ఉండ్లు పండ్లు కావాలా? అని అడుగుతాడు.

పూజ్ముడిర్కోలై మురుగన్ హిందూ దేవాలయం

పూజ్ముడిర్కోలై మురుగన్ హిందూ దేవాలయం

P.C: You Tube

దీనికి అవ్వయార్ నవ్వుతారు. పండ్లు ఎవరూ వేయించరు కదా? ఈ బాలుడుకి పిచ్చి కావచ్చు అని నవ్వుకొని మామూలు పండ్లు ఇవ్వమని అడుతారు. దీంతో ఆ బాలుడు చెట్ల పై ఉన్న పండ్లకు కిందికి పడేలా చేస్తాడు.

పూజ్ముడిర్కోలై మురుగన్ హిందూ దేవాలయం

పూజ్ముడిర్కోలై మురుగన్ హిందూ దేవాలయం

P.C: You Tube

అప్పుడు ఆ అవ్వయార్ పండ్ల పై ఉన్న మట్టిని తొలగించడానికి ఊదుతుంది. దీంతో బాలుడు అవి మాములు పండ్లే వేడిగా లేవు. చల్లగా చేయడానికి ఎందుకు ఊదుతున్నావు అని అంటాడు. దీంతో ఈ బాలుడు సామాన్య బాలుడు కాదని అవ్వయార్ భావిస్తుంది.

పూజ్ముడిర్కోలై మురుగన్ హిందూ దేవాలయం

పూజ్ముడిర్కోలై మురుగన్ హిందూ దేవాలయం

P.C: You Tube

వెంటనే తనకు నిజరూపంలో దర్శనమివ్వాల్సిందిగా వేడుకొంటుంది. దీంతో బాలుడు సుబ్రహ్మణ్యస్వామి రూపంలో అవ్వయార్‌కు కనిపిస్తాడు. అటు పై ఆమె కోరిక మేరకు ఇక్కడ వెలిసి భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్నాడు. ముఖ్యంగా సంతానంలేనివారు ఈ దేవాలయాన్ని సందర్శిస్తే వెంటనే సంతానం కలుగుతుందని స్థానికులు చెబుతూ ఉంటారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+