Search
  • Follow NativePlanet
Share
» »స్వామివారు అమ్మవారిని పెనవేసుకున్న స్థితిలో కనిపించే క్షేత్రం ఇదే....

స్వామివారు అమ్మవారిని పెనవేసుకున్న స్థితిలో కనిపించే క్షేత్రం ఇదే....

పెంచల కోన నరసింహస్వామి గురించిన కథనం.

By Beldaru Sajjendrakishore

శ్రీ మహావిష్ణువు కృతయుగాన ప్రహ్లాదుని రక్షించేందుకు హిరణ్యకసిపుని సంహరించిన అనంతరం వెలిగోండల కీకారణ్యంలో గర్జిస్తూ ఆవేశంగా సంచరిస్తుంటారు. ఆ సమయంలో చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మీ తన చెలికత్తెలతో అడవిలో విహరిస్తుండగా స్వామి వారి భీకర రూపాన్ని చూసిన చెలికత్తెలు భయంతో పారిపోగా చెంచులక్ష్మీ మాత్రం స్వామి వారిని చూసి భయపడకుండా నిలబడి పోయినట్లు చరిత్ర చెపుతుంది.

దీంతో ఆమే ధైర్య సాహసాలు, అందచందాలకు ముగ్ధుడైన స్వామి వారు చెంచురాజుకు కప్పం చెల్లించి ఆమెను వివాహం చేసుకొని ఆ సుందరవనితను పెనవెసుకోని శిలారూపంలో ఇక్కడ స్వయంభువుగా వెలసినట్లు పురాణ కథనం. దీంతోనే స్వామి వారిని పెనుశిల లక్ష్మీనసింహస్వామిగా పిలుస్తారు. ఈ క్షేత్రాన్ని కులమతాలకు అతీతంగా ముస్లీం సోదరులు కూడా సందర్శిస్తుండటం ఇక్కడ గమనార్హం.

1. వైష్ణవ క్షేత్రాల్లో ఇది ఒకటి

1. వైష్ణవ క్షేత్రాల్లో ఇది ఒకటి

Image source:


పెంచలకోన , నెల్లూరు జిల్లా, రాపూరు మండలానికి చెందిన గ్రామము. చెంచురాజు కుమార్తె చెంచు లక్ష్మీ సంచరించిన నాటి చెంచులకోనే నేటి పెంచల కోన గా మారింది.దక్షిణాదిన ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పెంచలకోన పేరుగాంచింది. ఈ ప్రాంతం చుట్టూ సుందరమైన సర్పాకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలు ఉన్నాయి.వాటి నడుమనే దివ్యమైన దేవస్ధానం వెలసింది.

2. చెంచులక్ష్మీ ని చూసి

2. చెంచులక్ష్మీ ని చూసి

Image source:


శ్రీ మహావిష్ణువు కృతయుగాన ప్రహ్లాదుని రక్షించేందుకు హిరణ్యకసిపుని సంహరించిన అనంతరం వెలిగోండల కీకారణ్యంలో గర్జిస్తూ ఆవేశంగా సంచరిస్తూ ఉంటారు. ఆ సమయంలో చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మీ తన చెలికత్తెలతో అడవిలో విహరిస్తూ ఉంటుంది. స్వామి వారి భీకర రూపాన్ని చూసిన చెలికత్తెలు భయంతో పారిపోగా చెంచులక్ష్మీ మాత్రం స్వామి వారిని చూసి భయపడకుండా నిలబడి పోతుంది.

3. ముగ్దుడవుతాడు...

3. ముగ్దుడవుతాడు...

Image source:


దీంతో ఆమే ధైర్య సాహసాలు, అందచందాలకు ముగ్ధుడైపోతాడు. అటు పై స్వామి వారు చెంచురాజుకు కప్పం చెల్లించి చెంచు లక్ష్మీని వివాహం చేసుకుంటాడు. అటు పై ఆ సుందరవనితను పెనవెసుకోని శిలారూపంలో ఇక్కడ స్వయంభువుగా వెలసినట్లు పురాణ కథనం. దీంతోనే స్వామి వారిని పెనుశిల లక్ష్మీనసింహస్వామిగా పిలుస్తారు. ఈ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ఎంతో దూరం నుంచి వస్తుంటారు.

4.ఆదిలక్ష్మీ ఆగ్రహిస్తుంది...

4.ఆదిలక్ష్మీ ఆగ్రహిస్తుంది...

Image source:


అయితే చెంచులక్ష్మీని స్వామి వివాహమాడారని తెలుసుకున్న ఆయన సతి ఆదిలక్ష్మీ అమ్మవారు ఆగ్రహిస్తారు. ఈ విషయమై స్వామివారితో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుటుంది. అటు పై ఇదే ప్రదేశంలో స్వామికి అల్లంత దూరంలో ఏటి అవతల గట్టుకు వెళ్ళిపోయినట్లు కథనం. దీంతో అమ్మవారికి ఇక్కడ దేవస్ధానం నిర్మించారు. ఈ దేవాలయాన్ని కూడా భక్తులు సందర్శించుకుంటుంటారు.

5.3వేల అడుగుల ఎత్తులో

5.3వేల అడుగుల ఎత్తులో

Image source:


తూర్పుకనుమల మధ్య పర్వత ప్రాంతాలల్లో నెల్లూరు-కడప జిల్లాల మద్య ఈ క్షేత్రం ఉంది. నెల్లూరు జిల్లా కేంద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో సముద్రమట్టానికి 3వేల అడుగుల ఎత్తున వున్న కోన క్షేత్రం నిత్య శోభాయమానంగా వెలుగోందుతుంది. ఈ క్షేత్రం దట్టమైన కీకారణ్యంలో వున్నప్పటికి ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఆపదలు క్రిమి కీటకాలనుండి తలెత్తవు అంటారు. అందువల్ల ఈ స్వామిని కొండి కాసులవాడని కూడా పిలుస్తారు.

6. 700 ఏళ్ల క్రితం నాటిది

6. 700 ఏళ్ల క్రితం నాటిది

Image source:


పెంచల కోనలోని గర్భగుడి సుమారు 700 సంవత్సరాలకు పూర్వం నిర్మించినట్లు ఇక్కడ లభించిన ఆధారాల వల్ల తెలుస్తుంది.భారతదేశానికి ఈ పేరు రావడానికి కారణమైన భరతుడు ఈ ప్రాంతంలోనే పెరిగారని ఆయనను పెంచిన కణ్వమహర్షి ఈ ప్రాంతంలో తపస్సు ఆచరించారని కథనం. ఆశ్రమం పక్కనే వున్న ఏరును కణ్వలేరుగా పిలిచేవారని కాలక్రమేణా అది కండలేరుగా మారినట్లు చరిత్రకథనం.

7. గొర్రెల కాపరికి చెప్పి

7. గొర్రెల కాపరికి చెప్పి

Image source:


పెంచలకోనకు ఆరు కిలో మీటర్ల దూరంలో గోనుపల్లికి చెందిన ఒక గోర్రెల కాపరి గొర్రెలను మేపుకునేందుకు పెంచలకోన అడవి లోకి వెళ్లగా స్వామి వృద్ధుని రూపంలో కాపరికి కనిపించి నరసింహస్వామి శిలా రూపంలో ఇక్కడ వెలసి వున్నారని గ్రామస్దులకు తెలిపి ఇక్కడ ఆలయం నిర్మించాలని చెప్పారట. ఈ విషయాన్ని గ్రామంలోకి వచ్చి తాను కూడా చెబుతానని వృద్ధుని రూపంలో ఉన్న స్వామి వారు ఆ గొర్రెల కాపరికి చెబుతాడు. అయితే ఇందుకు ఒక షరత్తు విధిస్తాడు.

8. వెనుతిరిగి చూడకుండా

8. వెనుతిరిగి చూడకుండా

Image source:


వెనుతిరిగి చూడకుండా వెళ్లాలని స్వామి అతనిని ఆదేశించగా కాపరి సరేనని కోద్ది దూరం వెలుతాడు. అంతలో ఉత్సాహాన్ని ఆపుకోలేక సదరు గొర్రెల కాపరి వెనుతిరిగి చూడడంతో స్వామి శిలగా మారినట్లు ఈప్రాంత వాసులు చెబుతుంటారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్దులు స్వామి వారికి దేవస్ధానం నిర్మించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 1959లో ఈ దేవస్ధానం దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుండి కోన దినదినాభివృద్ధి చేందుతూ ఉంది.

9. ఉత్సవాలు జరుపుతారు.

9. ఉత్సవాలు జరుపుతారు.

Image source:


చుట్టూ పెద్ద కొండలు, పచ్చని చెట్ల మధ్య పెనుశిల నరసింహస్వామి దేవాలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ పెంచలస్వామిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల పల్లెటూర్ల నుండి చాలా మంది వస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం మే, ఏప్రిల్ మధ్యలో బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి ఇక్కడ. తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు పెంచలకోనకు కుడా స్పెషల్ బస్సులు వేస్తూ ఉంటారు.

10 కన్వమహర్షి...

10 కన్వమహర్షి...

Image source:


కన్వ మహర్షి ఇక్కడ తపస్సు చేసారని ప్రతీతి. మాములు రోజుల్లో చీమ చిటుక్కన్నా వినిపిస్తుందేమో అన్నంత ప్రశాంతంగా ఉంటుంది, వేసవిలో మాత్రం కిటకిట లాడుతుంది. చుట్టుపక్క గ్రామాలవాళ్ళు కొత్తగా కొన్న ట్రాక్టరుకు, లేకపొతే కొత్త వాహనానికి ఇక్కడ పూజ చేయడం రివాజు. ఇక్కడకి రావడానికి రాపూరు, పొదలకూరు, గూడూరు మరియు నెల్లూరు నుండి బస్సులు తిరుగుతాయి.

11. అక్కడ వసతి...

11. అక్కడ వసతి...

Image source:


ఉండడానికి కొన్ని సత్రాలు ఉంటాయి. కాని అంత అనువుగా ఉండవు. అందువల్ల ఇక్కడికి వచ్చేవారు దైవ దర్శనం తర్వాత తిరిగి నెల్లూరుకు వెళ్లిపోతుంటారు. అక్కడ రాత్రి బసకు అనువుగా అనేక లాడ్జీలు, హోటల్స్ ఉంటాయి. అందుకే గుడికి వచ్చే వాళ్ళంతా ఉదయం వచ్చి సాయంత్రం తిరుగుముఖం పడుతారు. నెల్లూరులో అచ్చ తెలుగు వంటకాలు యాత్రికులను రారమ్మని ఆహ్వానిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహారానికి నెల్లూరు చాలా ప్రఖ్యాతి గాంచింది.

12. ఇలా చేరుకోవచ్చు...

12. ఇలా చేరుకోవచ్చు...

Image source:


పెంచలకోనకు చేరుకునేందుకు అనేక ప్రాంతానుండి బస్సులు ఉన్నాయి. జిల్లా కేంద్రమైన నెల్లూరు నుండి 80 కిలోమిటర్లు దూరం ఉంది. నెల్లూరు నుండి ఆర్టీసి వారు ఇక్కడకు బస్సులు నడుపుతున్నారు.నెల్లూరు నుండి పొదలకురు, ఆదురుపల్లి మీదుగ (సుమారు 40కి.మీ) రోడ్డు మార్గంలో ప్రయాణం చేయవచ్చును. ప్రతి 2:30 గంటలకు ఈ మార్గంలో బస్సు వసతి ఉంది.

13. రైల్వే సౌకర్యం ఇలా...

13. రైల్వే సౌకర్యం ఇలా...

Image source:


రైల్వే జంక్షన్‌ అయిన గూడూరు పెంచలకోనకు 70 కిలోమిటర్ల దూరం. గూడురు నుండి రోడ్దు మార్గాన రాపూరుకు చెరుకోని పెంచల కోనకు వెళ్లవచ్చు. కడపజిల్లా నుండి వచ్చే భక్తులు రాపూరుకు చెరుకోని ఇక్కడకి రావచ్చు. వెంకటగిరి నుండి ఈ క్షేత్రం 60 కిలోమిటర్ల దూరం ఉంది. మొత్తంగా పెంచల కోన ఒక చారిత్రాత్మక, పురాణ కథనాలతో ముడిపడిన క్షేత్రంగా చెప్పవచ్చును. అంతే కాకుండా ఇక స్వామి వారు అమ్మవారిని పెనవేసుకున్న స్థితిలో కనిపిస్తారు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+