Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడే ఆమె పిరుదులు పడ్డాయి...సందర్శనతోనే

ఇక్కడే ఆమె పిరుదులు పడ్డాయి...సందర్శనతోనే

పిఠాపురం పుణ్యక్షేత్రానికి సంబంధించిన కథనం

By Kishore

భారత దేశం అష్టాదశ శక్తిపీఠాల నిలయం అన్న విషయం తెలిసిందే. ఒక్కక్క క్షేత్రం ఒక్కొక్క చోట ఉంటుంది. అదే విధంగా ఒక్కక్క క్షేత్రానికి ఒక్కక్క ప్రత్యేకత ఉంటుంది. ఈ క్షేత్రంలో అమ్మవారి పిరుదులు పడ్డాయని చెబుతారు. అదే క్షేత్రంలో పరమశివుడు కోడి పుంజ రూపంలో వెలిశాడని చెబుతారు. ఇక్కడ పితృ కర్మలు నిర్వహిస్తే మోక్షం లభిస్తుందని చెబుతారు. ఇందుకు గయాసురుడనే రాక్షసరాజు పాదాలు పడటమే కారణమని తెలుస్తోంది. రాక్షసరాజు అయినా కూడా అంతని అంత శక్తి రావడం వెనుక పురాణ కథనం ఉంది. అదే విధంగా ఈ క్షేత్రంలోనే దత్తాత్రేయుడి జన్మం జరిగిందని కూడా చెబుతారు. ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ క్షేత్రం మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. ఇక్కడికి ప్రయాణ సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి. ఈ వివరాలన్నీ మీ కోసం...

1. గయాసురుడు

1. గయాసురుడు

Image Source:

పూర్వంగ గయాసురడనే రాక్షస రాజు ఉండేవాడు. అయినా అతను విష్ణవు పరమభక్తుడు. వెయ్యేళ్లు ఘోర తపస్సు చేసి విష్ణువును ప్రసన్నం చేసుకొంటాడు. విష్ణువు వరం వల్ల అతని శరీరం ప్రపంచంలోని అన్ని తీర్థాల కన్నా పవిత్రవమై పోతుంది.

2. ఎవరు తాకినా

2. ఎవరు తాకినా

Image Source:

దీంతో ఎవరు ఆయన శరీరాన్ని తాకినా వారు అప్పటి వరకూ చేసిన పాపాలన్నీ తొలిగిపోతూ ఉంటాయి. చివరికి గాలికి కొట్టుకు వచ్చే సీతాకోక చిలుకలు, ఈగలు వంటివి కూడా గయాసురుడి శరీరాన్ని తాకి మోక్షం పొందుతుంటాయి.

3. అందరూ స్వర్గానికే

3. అందరూ స్వర్గానికే

Image Source:

దీంతో ప్రతి ఒక్కరూ చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్లేవారే కాని నరకానికి వెళ్లేవారు ఒక్కరు కూడా కనిపించరు. దీంతో స`ష్టికార్యం అదుపు తప్పుతుంది. ఇదిలా ఉండగా గయాసురుడికి దక్కిన వరంతో అతను ఇంద్రపదవిని కూడా అలంకరిస్తాడు.

4. ఇంద్రుడు కూడా

4. ఇంద్రుడు కూడా

Image Source:

దీంతో ఇంద్రుడు బ్రహ్మగురించి తపస్సు చేసి తనను తిరిగి ఇంద్రలోకానికి రాజును చేయమని అర్థిస్తాడు. ఒక వైపు స`ష్టి కార్యానికి విఘాతం ఏర్పడటం, మరోవైపు ఇంద్రుడికి ఇచ్చిన వరం వల్ల ఎలాగైనా గయాసురుడిని సంహరించాలని దేవతలందరూ నిర్ణయించుకుంటారు.

5. బ్రహ్మ గయాసురుడి దగ్గరకు

5. బ్రహ్మ గయాసురుడి దగ్గరకు

Image Source:

ఇందుకు ఒక ఉపాయం ఆలోచిస్తారు. దీని ప్రకారం బ్రహ్మ గయాసురుడి వద్దకు వెళ్లి తాను గొప్ప యాగం చేయదలిచానని దానికి అత్యంత పరమ పవిత్రమైన స్థలం కావాలని చెబుతాడు.

6. యాగ స్థలం ఇవ్వాల్సిందిగా

6. యాగ స్థలం ఇవ్వాల్సిందిగా

Image Source:

ఈ విశ్వంలో నీ శరీరం అంత పవిత్రమైన స్థలం మరొకటి లేదని అందువల్ల నీ శరీరం యాగం చేయడానికి ఇవ్వాల్సిందిగా కోరుతాడు.

7. వెనుకా ముందు ఆలోచించకుండా

7. వెనుకా ముందు ఆలోచించకుండా

Image Source:

బ్రహ్మ అంతటి వాడే వచ్చి తనను యాచించేసరికి గయాసురుడు పొంగిపోయి ముందు వెనక ఆలోచించకుండా తన శరీరాన్ని యాగ స్థలంగా చేసుకోవడానికి అంగీకరిస్తాడు.

8. గయాసురిడిని హెచ్చరించినా

8. గయాసురిడిని హెచ్చరించినా

Image Source:

అయితే ఈ యాగం ఏడు రోజుల పాటు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగాలని దీనికి విరుద్ధంగా జరిగితే నీవు చనిపోతావని గయాసురుని బ్రహ్మ హెచ్చరిస్తాడు.

9. ఛాతి పై

9. ఛాతి పై

Image Source:

అయినా కూడా గయాసురుడు భయపడకుండా యాగానికి అనుమతిస్తాడు. దీంతో అతని ఛాతి పై యాగం చేయడం ప్రారంభిస్తారు. ఆరు రోజులు పాటు యాగం ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగుతుంది.

10. శివుడు కోడి పుంజు రూపంలో

10. శివుడు కోడి పుంజు రూపంలో

Image Source:

చివరిరోజైన ఏడో రోజు పరమశివుడు కోడి పుంజు రూపంలో వచ్చి సూర్యోదయం కాకుండానే కూత కూస్తాడు. దీంతో ఏడో రోజు పూర్తయిందని గయాసురుడు భావించి శరీరాన్ని కదలిస్తాడు.

11. యాగం భగ్నమవుతుంది

11. యాగం భగ్నమవుతుంది

Image Source:

దీంతో యాగం భగ్నమవుతుంది. ముందే కుదుర్చుకొన్న ఒప్పందం ప్రకారం విష్ణువు తన కాలుతో గయాసురుడి తల పై మోదీ అతన్ని సంహరిస్తాడు. దీంతో అతని శరీరం ముక్కలు ముక్కలుగా అయిపోతుంది.

12. తల గయలో

12. తల గయలో

Image Source:

తల భాగం బీహార్ లోని గయలో పడుతుంది. అదే శిరో గయ. రెండోది ఒడిషాలోని జాజిపూర్. ఇక్కడ గయాసురుడి నాభి పడిందని చెబుతారు. అందువల్లే ఇది మధ్య గయ లేదా నాభి గయగా ప్రసిద్ధి చెందింది.

13. పాదాలు పిఠాపురంలో

13. పాదాలు పిఠాపురంలో

Image Source:

ఇక పాదాలు ఇదే పిఠాపురంలో పడిపోతాయి. దీంతో ఈ క్షేత్రం పాదగయగా ప్రాచుర్యం పొందింది. బ్రహ్మ వరం వల్ల పరమ పవిత్రుడైన గయాసురుడి శరీర భాగాలు పడిన ఈ ప్రాంతాల్లోని తీర్థాలు కూడా పరమ పవిత్రంగా మారిపోతాయి.

14. కుక్కుటేశ్వరుడిగా

14. కుక్కుటేశ్వరుడిగా

Image Source:

అందువల్లే ఈ మూడు క్షేత్రాల్లో పిత`కర్మలు నిర్వహిస్తే చనిపోయిన వారికి మోక్షం లభిస్తుందని చెబుతారు. ఇదిలా ఉండగా కోడి రూపంలో వచ్చిన పరమశివుడు ఇక్కడ కుక్కుటేశ్వరుడిగా భక్తుల పూజలు అందుకొంటూ ఉన్నాడు.

16.పురుహుతికా దేవాలయం

16.పురుహుతికా దేవాలయం

Image Source:

ఈ ఆలయ ప్రాంగణంలోనే మనకు ఇదే క్షేత్రంలో పురుహుతికా దేవాలయం ఉంది. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. అత్యంత పవిత్రమైన ఈ శక్తి పీఠం పదవది.

17.అవమానం

17.అవమానం

Image Source:

తన తండ్రి తలపెట్టిన యాగానికి దక్షాయణి ఆహ్వానం లేకపోయిన వెళ్లి అవమానం పొందుతుంది. దీంతో తీవ్ర వేదనకు లోనయ్యి ఆత్మహుతికి పాల్పడుతుంది. విషయం తెలిసిన పరమశివుడు రుద్రుడై యాగాన్ని ధ్వంసం చేస్తాడు.

18.ముక్కలుగా

18.ముక్కలుగా

Image Source:

అటు పై లయకారకుడైన శివుడు దాక్షాయని శరీరాన్ని భుజం పై వేసుకొని తిరుగుతూ తన కార్యాన్ని నెరవేర్చక పోవడంతో భూ భారం పెరిగి పోతూ ఉంటుంది. దీంతో పరాశక్తి ఆదేశం మేరకు విష్ణువు దాక్షాయణి శరీరాన్ని ముక్కలుగా ఖండిస్తాడు.

19. పిరుదులు పడిన ప్రాంతమే

19. పిరుదులు పడిన ప్రాంతమే

Image Source:

అందలో పిరుదులు పడిన ప్రాంతమే పిఠాపురంమని హిందూ పురాణాలు చెబుతాయి. ఇది అత్యంత పవిత్ర క్షేత్రమని ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నవారు జీవితంలో త్వరగా తాము ఎంచుకొన్న రంగంలో స్థిరపడుతారని చెబుతారు.

20. శతచండి యాగం

20. శతచండి యాగం

Image Source:

ఈ క్షేత్రంలో ప్రతి శుక్రవారం కుంకుమార్చన విశిష్టంగా జరుపుతారు. దసరా ఉత్సవాల్లో అమ్మవారికి రోజుకో రూపంలో అలంకరిస్తారు. నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ప్రతి రోజూ శత చండీయాగాన్ని నిర్వహిస్తారు.

21. ఎలా వెళ్లాలి

21. ఎలా వెళ్లాలి

Image Source:

అన్నవరానికి 30 కిలోమీటర్ల దూరంలో పిఠాపురం ఉంది. సామర్ల కోటకు 11 కిలోమీటర్లు, రామహేంద్రవరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుణ్యక్షేత్రానికి రైలు, రోడ్డు మార్గాలు చాలా బాగున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యమైన నగరాల నుంచి సామర్ల కోటకు నేరుగా రైలు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి బస్సులు, ఆటోల ద్వారా సులభంగా పిఠాపురానికి చేరుకోవచ్చు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+