• Follow NativePlanet
Share
» »భూత, ప్రేత, పిశాచాల బాధల నుంచి విముక్తి ఇక్కడే.. ఆ దేవదేవుడి చమట బిందువులే ఇక్కడ...

భూత, ప్రేత, పిశాచాల బాధల నుంచి విముక్తి ఇక్కడే.. ఆ దేవదేవుడి చమట బిందువులే ఇక్కడ...

Written By: Kishore

భారత దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో భీమశంకర్ దేవాలయం కూడా ఒకటి. ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఆరవది. ఈ జ్యోతిర్లింగాన్ని ఇప్పటికీ శాకిని, డాకిిని వంటి రాక్షసగణాలు ప్రతి రోజూ పూజిస్తుంటాయని చెబుతారు. ఇక్కడ ఆ పరమశివుడి చమట బిందువులు నదిగా మారాయని స్థలపురాణం. సహ్యద్రి పర్వత సానువుల్లో ఉన్న ఈ జ్యోతిర్లింగాన్ని చూడటానికి దేశం నలుమూలల నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా హిందువులు ఇక్కడికి ప్రతి రోజూ వస్తుంటారు. ఈ పుణ్యక్షేత్రం ప్రకృతి సహజ అందాలకు కూడా నిలయం. అందువల్లే ఇక్కడకు ట్రెక్కర్స్ కూడా ఎక్కువగా వస్తుంటారు. పురాణాల్లో పేర్కొనే కామరూప దేశం ఇక్కడే ఉండేదని చెబుతారు. అందుకు సంబంధించిన ఆధారాలు కూడా మనం ఇప్పటికీ ఇక్కడ చూడవచ్చు. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం

'మెట్రో'లో తినొచ్చు, తాగొచ్చు, తందనాలాడొచ్చు

1. కర్కటితో కలిసి

1. కర్కటితో కలిసి

Image Source:

పూర్వం భీముడనే రాక్షసుడు తన తల్లి అయిన కర్కటితో ఈ పర్వత శిఖరం పై నివసిస్తూ ఉండేవాడు. ఇతనికి భీమాసురుడు అని కూడా పేరు. ఇక కర్కటి రాక్షస సంతతి అయినా ఆమె పరమ శివభక్తురాలు.

2. తన తండ్రి, తాతల గురించి

2. తన తండ్రి, తాతల గురించి

Image Source:

ఇదిలా ఉండగా భీమాసురుడికి తన తండ్రి గురించి ఏ వివరాలు తెలియవు. ఎన్ని సార్లు అడిగిన కర్కటి ఈ విషయం పై జవాబు దాటవేసిది. ఒక రోజు మాత్రం భీముడు తన తల్లి కర్కటిని తండ్రితో పాటు తన తాతల గురించి కూడా చెప్పమని పట్టుబట్టాడు.

 3. రోదించసాగాడు

3. రోదించసాగాడు

Image Source:

లేదంటే తాను ఆత్మాహుతి చేసుకొంటానని రోదించసాగడు. దీంతో కర్కటి తన వంశం చరిత్రమొత్తాన్ని తెలిపింది. ‘నా తల్లిదండ్రలు కర్కటుడు, పుష్కసి. ఒక రోజు నా తల్లిదండ్రులు అగస్తమహర్షి శిష్యుడైన సుతీక్షుడిని తినబోయారు.

4. కర్కటి చెబుతుంది

4. కర్కటి చెబుతుంది

Image Source:

అయితే తపస్సంపన్నుడైన అగస్త్యమహర్షి వారిద్దరిని భస్మం చేశాడు. అంతే కాకుండా నన్ను కూడా చంపాలని ప్రయత్నిస్తే నేను పారిపోయి సహ్యద్రి పర్వత సానువుల్లో దాక్కొన్నాను. ఇది నా తల్లిదండ్రులు, మీ తాతగారి చరిత్ర.

5. కుంభకర్ణుడు

5. కుంభకర్ణుడు

Image Source:

ఇక లంకాధిపతి అయితన రావణాసుడి సోదరుడైన కుంభకర్ణుడు ఒక రోజు ఇక్కడి వచ్చి నన్ను మోహించాడు. దీంతో నీవు జన్మించావు. అయితే రాముడు మీ నాన్నతో పాటు పెదనాన్నను సంహరించారు. దీంతో మనం దిక్కులేని వాళ్లమైపోయామని రోదించింది.

6. కోపంతో రగలి పోతాడు

6. కోపంతో రగలి పోతాడు

Image Source:

ఇదంతా విన్న భీముడు కోపంతో రగలిపోయాడు. ఈ భూలోకంలో విష్ణు భక్తులతో పాటు బుుషులన్నది లేకుండా చేస్తానని తల్లితో పేర్కొంటాడు. అందుకు అవసరమైన బల పరాక్రమాల కోసం బ్రహ్మదేవుని గురించి వేయి సంత్సరాలు తపస్సు చేస్తాడు.

7. బ్రహ్మ గురించి తపస్సు చేస్తాడు

7. బ్రహ్మ గురించి తపస్సు చేస్తాడు

Image Source:

అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయై అతని కోరిక మేరకు అంతులేని పరాక్రమాన్ని, అనంతమైన సైన్యాన్ని వరంగా ప్రసాదిస్తాడు. వర గర్వంతో బీమాసురుడు దేవలోకం పై దండెత్తి ఇంద్రుడిని ఓడించి తన సేవకుడిగా మార్చుకున్నాడు. అటు పై భూ లోకమంతా తిరిగి సాధువులైన భక్తులను మహర్షులను బాధించాడు.

8. కామరూప దేశం

8. కామరూప దేశం

Image Source:

ఈ నేపథ్యంలోనే భూ లోకం పై ప్రస్తుతం సహ్యాద్రి పర్వతాలు ఉన్న ప్రాంతం కామరూప దేశం ఉండేది. దీనిని పరమశివభక్తుడైన సుదక్షణుడనే రాజు పాలించేవాడు. అంతేకాకుండా అతడు గొప్ప తపస్సంపన్నుడు. భీమాసురుడు అతని పై కూడా దండెత్తి అతన్ని యుద్ధంలో ఓడించేస్తాడు.

9. కారాగారంలో బంధించి

9. కారాగారంలో బంధించి

Image Source:

అంతేకాకుండా సుదక్షణుడిని కారాగారంలో బంధించి తీవ్రంగా హింసించేవాడు. అయితే గొప్ప శివభక్తుడైన సుదక్షణుడు కారాగారంలోని మట్టితో ఒక శివలింగాన్ని చేసి దానిని నిత్యం పూజించేవాడు. ప్రతిక్షణం శివపంచాక్షరి మంత్రాన్ని పటించేవాడు.

10. కత్తితో ఖండించబోతాడు

10. కత్తితో ఖండించబోతాడు

Image Source:

ఈ విషయం తెలుసుకున్న భీమాసురుడు ఈ లోకానికి తానే దేవుడినని తన పేరునే జపించాలని పట్టుబట్టాడు. అయితే సుదక్షణుడు ఇందుకు అంగీకరించలేదు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భీమాసురుడు ఆ శివలింగాన్ని తన కత్తితో ఖండించబోయాడు.

11. యుద్ధం జరుగుతుంది.

11. యుద్ధం జరుగుతుంది.

Image Source:

సదరు కత్తి శివలింగం పై తగలగానే శివుడు ప్రత్యక్షమయ్యి తన భక్తుడికి అండగా నిలుస్తాడు. వర గర్వంతో ఉన్న భీమాసుడు తన ఎదుట ఉన్నది లయకారకుడైన శివుడన్న విషయం మరిచి యుద్ధానికి దిగుతాడు. ఇద్దరి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది.

12. భీమాసురుడు ప్రణాలు కోల్పోతాడు

12. భీమాసురుడు ప్రణాలు కోల్పోతాడు

Image Source:

చివరికి భీమాసురుడు ప్రాణాలు కోల్పోతాడు. విషయం తెలుసుకొన్న కర్కటి తన కుమారుడి తప్పును మన్నించి అతనికి మోక్షం ప్రసాదించాల్సిందిగా వేడుకొంటుంది. ఎంత రాక్షసుడైన బ్రహ్మ వరం పొందిన వాడు కావడం, తన పరమ భక్తురాలి కుమారు కావడంతో భీమాసురుడికి శివుడు మోక్షం ప్రసాదిస్తాడు.

13. కత్తిగాటును మనం చూడవచ్చు

13. కత్తిగాటును మనం చూడవచ్చు

Image Source:

అంతే కాకుండా అతని పేరు పై ఇక్కడ భీమశంకర జ్యోతిర్లింగంగా వెలిసాడని స్థల పురాణం చెబుతోంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న శివలింగం పై ఒక కత్తి గాటును మనం ఇప్పటికీ చూడవచ్చు.

14. చమట బిందువులే

14. చమట బిందువులే

Image Source:

అదే విధంగా యుద్ధంలో శివుడి శరీరం నుంచి రాలిన చమట బిందువులే ఇక్కడ నదిగా మారాయని దానిని ప్రస్తుతం భీమా నదిగా పేర్కొంటున్నారు. ఈ నది శివలింగానికి అనుకునే ప్రవహిస్తూ ఉంటుంది.

15.రాక్షసగణాలు

15.రాక్షసగణాలు

Image Source:

సాక్షాత్తు పరమశివుడి చమట ద్వారా ఏర్పడిన నది కాబట్టే ఇందులో స్నానం చేస్తే పాపాలన్నీ తొలిగి పోతాయని చెబుతారు. ఇదిలా ఉండగా ఈ భీమ శకంర లింగాన్ని శాకిని, డాకినిమైదలైన రాక్షస గణాలు ఇప్పటికీ సేవించడబుతున్నాయని చెబుతారు.

16.ఆ బాధల నుంచి విముక్తి

16.ఆ బాధల నుంచి విముక్తి

Image Source:

అందువల్లే ఈ జ్యోతిర్లింగాన్ని సందర్శిస్తే భూత, ప్రేత, పిశాచాల బాధల నుంచి విముక్తి కలుగుతుందని ఎన్నో ఏళ్లుగా హిందూ భక్తుల నమ్మకం. దీంతో ఈ సమస్యలతో బాధపడుతున్న వారు ఎక్కువ మంది ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు.

17.13వ శతాబ్దంలో

17.13వ శతాబ్దంలో

Image Source:

భీమశంకర దేవాలయాలన్ని 13వ శతాబ్దంలో పీష్వాల దివాన్ అయిన నానా ఫడ్నవీస్ నిర్మించినట్లు చారిత్రాత్మక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఈ జ్యోతిర్లింగం భూమి కంటే చాలా దిగువగా ఉంటుంది. మెట్ల మార్గం ద్వారా మనం వెళ్లి జ్యోతిర్లింగాన్ని సందర్శించుకోవచ్చు.

18.వినాయక విగ్రహం కూడా

18.వినాయక విగ్రహం కూడా

Image Source:

అదే విధంగా క్రీస్తు శకం 1437లో చిమన్జీ అంతజీ నాయక్ ఇక్కడ ఓ కోనేరును తవ్వించారు. ఆ కోనేరు లోపల ఉన్న వినాయక విగ్రహం కూడా చూడముచ్చటగా ఉంటుంది.

19.ఎక్కడ ఉంది

19.ఎక్కడ ఉంది

Image Source:

భీమ శంకర క్షేత్రం సహ్యాద్రి పర్వత సానువుల్లో మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని ఖేడ్ తాలూకాలో భావగిరి గ్రామంలో ఉంది. ఈ పుణ్యక్షేత్రం పూణేకు 127 కిలోమీటర్ల దూరం, ముంబైకు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది.

20.ఎలా వెళ్లాలి

20.ఎలా వెళ్లాలి

Image Source:

ముంబై, పూణె, ఔరంగాబాద్, అహ్మదాబాద్ నుంచి నిత్యం ఈ క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది. అదే విధంగా భీమాశంకర్ కు దగ్గరగా అంటే 40 కిలోమీటర్ల దూరంలో కజ్రత్ అనే రైల్వే స్టేషన్ ఉంది.

21. ప్రక`తి సంపదకు కూడా నిలయం

21. ప్రక`తి సంపదకు కూడా నిలయం

Image Source:

సహ్యద్రి పర్వత సానువుల్లో వెలిసిన ఈ పుణ్యక్షేత్రం ప్రక`తి సంపదకు నిలయం. ముఖ్యంగా సహ్యాద్రి వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో అత్యంత అరుదైన ఉడతలను చూడవచ్చు.
భీమ శంకర క్షేత్రం ట్రెక్కింగ్ కు కూడా అనుకూలం. ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకూ ట్రెక్కింగ్ ప్రియులు ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ ఇప్పటికీ కామరూప దేశ రక్షణ గోడలను మనం చూడవచ్చు.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి