Search
  • Follow NativePlanet
Share
» »దేవికులం హిల్ స్టేషన్ లో సందర్శించవలసిన పర్యాటక స్థలాలు !

దేవికులం హిల్ స్టేషన్ లో సందర్శించవలసిన పర్యాటక స్థలాలు !

By Mohammad

దేవికులం కేరళ రాష్ట్రంలోని హిల్ స్టేషన్. బహుశా ....! దీనిగురించి చాలా తక్కువ మంది పర్యాటకులు వినిఉంటారు. పర్యాటకులు చాలా తక్కువగా వస్తుంటారు కాబట్టే ఈ ప్రదేశం ఇప్పటికీ పచ్చని ప్రకృతి అందాలతో, కాఫీ తోటల పరిమళాలతో, సుగంధ ద్రవ్యాల సువాసన లతో అలరారుతుంది. అనేక సుందర దృశ్యాలు, కొండ చరియల నుండి పారే జలపాతాలు మరియు అందమైన పరిసరాలు పర్యాటకులకు ఆహ్లాదం కలిగిస్తాయి.

దేవికులం సమీపంలో ఉన్న హిల్ స్టేషన్ మున్నార్. ఇడుక్కి జిల్లాలో ఉన్న ఈ రెండు హిల్ స్టేషన్ లు ఒకదానికొకటి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ప్రకృతి ప్రియులు ఇక్కడున్న వృక్ష, జంతు సంపదను తనివితీరా చూస్తూ ఆనందించవచ్చు. పరిశోధనలు చేసే వారికి సైతం ఈ హిల్ స్టేషన్ ఆసక్తిని కలిగిస్తుంది. చేపల వేట ఆనందానిచ్చే అంశం ఒకటైతే, ట్రెక్కింగ్ సాహస యాత్రికులకు ఆనందాన్నిచ్చే మరో అంశం.

ఇది కూడా చదవండి : మున్నార్ - ప్రకృతి ప్రియుల స్వర్గం !

దేవికులంలో సందర్శించవలసిన స్థలాలు

దేవికులం హిల్ స్టేషన్ లో సందర్శించవలసిన పర్యాటక స్థలాలు లో ప్రధాన ఆకర్షణ సీతాదేవి సరస్సు. ఇతిహాసాల మేరకు సీతాదేవి ఈ సరస్సులో స్నానం చేశారని చెబుతారు. అలాగే జలపాతాలు, తేయాకు తోటలు, ఎరవికులమ్ నేషనల్ పార్క్, వ్యూ పాయింట్ మొదలైనవి చూడవలసిన పర్యాటక స్థలాలు గా ఉన్నాయి.

ఎరవికులమ్ నేషనల్ పార్క్

ఎరవికులమ్ నేషనల్ పార్క్

ఎరవికులమ్ నేషన్‌ల పార్క్, మున్నర్ కు 15 కిలోమీటర్ల దూరంలో, దేవికులం హిల్ స్టేషన్ కు సమీపాన ఉన్నది. సుమారు 97 చ.కి.మీ. విస్తరించిన ఈ రిజర్వ్ నీలగిరి థార్ ను రక్షించడానికి 1978 వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. రిజర్వ్ లో సాంబార్, డీర్, లంగూర్, పైథాన్ మొదలైన జీవులతో పాటు అందమైన పుష్పాలను, పక్షులను చూడవచ్చు.

చిత్ర కృప : *Lokesh*

సీతాదేవి సరస్సు

సీతాదేవి సరస్సు

సీతాదేవి సరస్సునే 'దేవికులం సరస్సు' అని కూడా అంటారు. సుందరమైన ప్రదేశం కనుకనే చాలా మంది స్థానికులు పిక్నిక్ వేసుకొని వస్తారు. ఇక్కడి నీరు అనేక ఖనిజలవణాలు కలిగి వ్యాధులను నివారించేదిగా ఉంటుంది. ఇక్కడి సరస్సులో వేడి నీటి బుగ్గ కూడా కలదు.

చిత్ర కృప : Anu Kartha

సీతాదేవి సరస్సు

సీతాదేవి సరస్సు

ఇంతటి పవిత్రమైన సీతాదేవి సరస్సుకు చిన్న కథ కూడా ఉంది. ఇతిహాసాల మేరకు, సీతా దేవి ఈ సరస్సులో స్నానం చేసిందని చెపుతారు. పొడవైన చెట్ల నీడ, పచ్చటి నేల ప్రదేశం, చల్లని, స్వచ్ఛమైన నీరు రాళ్ళగుండా ప్రవహించటం, పక్షుల కిలకిలారావాలు, వంటి వాటితో సీతాదేవి సరస్సు ఒక చక్కటి వినోద ప్రాంతంగా చెప్పవచ్చు.

చిత్ర కృప : Surin Ravi

మట్టుపెట్టి సరస్సు

మట్టుపెట్టి సరస్సు

దేవి కులంలోని అందమైన కొండలపై సుమారు 1700 అడుగుల ఎత్తున ప్రశాంత వాతావరణంలో మట్టుపెట్టి సరస్సు ఉన్నది. ఈ ప్రదేశంలోని దట్టమైన అటవీ పర్వత ప్రదేశాలు, సుగంధ ద్రవ్యాల తోటలు పర్యాటకుడి మనస్సుకు ఆహ్లాదం కలిగిస్తాయి. ఈ సరస్సులో బోటింగ్ చేయవచ్చు. స్పీడ్, మోటర్, పెడల్ బోటింగులు అద్దెకు లభిస్తాయి.

చిత్ర కృప : Tahir Hashmi

బ్లోస్సోమ్ అంతర్జాతీయ పార్క్

బ్లోస్సోమ్ అంతర్జాతీయ పార్క్

బ్లోస్సోమ్ అంతర్జాతీయ పార్క్ మున్నార్ పరిధిలో, కొచ్చిన్ కు వెళ్లే మార్గంలో ఉంటుంది. ఈ పార్క్ కాంప్లెక్స్ సైక్లింగ్, బోటింగ్ సైక్లింగ్ మరియు రోలర్ స్కేటింగ్ వంటి సౌకర్యాలను అందిస్తున్నది. వీటితో పాటుగా ట్రీ హౌస్, రోప్ వే, పిల్లల కొరకు రకరకాల క్రీడలను కలిగిఉంది.

చిత్ర కృప : Alok Nanda

హిల్ వ్యూ పార్క్

హిల్ వ్యూ పార్క్

హిల్ వ్యూ పార్క్, దేవికులం లోని కొండపై అధిక భాగం ఆక్రమించింది. అడవి ఏనుగుల మంద ఇక్కడి ప్రధాన ఆకర్షణ. అలాగే, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 8 ఎకరాల పార్కులో వివిధ రకాల పూలను మరియు మొక్కలను చూడవచ్చు. సహజ సిద్ధంగా ఏర్పడ్డ నీటి కొలనులో పెడల్ బోటింగ్ చేస్తూ ఆనందించవచ్చు.

చిత్ర కృప : Rajan Medhekar

కుండల సరస్సు

కుండల సరస్సు

కుండల సరస్సు దట్టమైన అటవీ ప్రాంతం మధ్యలో కలదు. ఈ సరస్సు సముద్రమట్టానికి 1700 మీటర్ల ఎత్తున ఉండి, కుండల ఆర్చ్ డామ్ కి సమీపంలో ఉంటుంది. కాశ్మీరి షికర బోట్ లు, పెడల్ బోట్ లు వంటివి అద్దెకు తీసుకొని సరస్సులో బోటింగ్ చేయవచ్చు. వీటితో పాటు సరస్సు వెనుక ఉన్న టీ తోటలు, గోల్ఫ్ మైదానాలు పర్యాటకులను ఆనందింపజేస్తాయి.

చిత్ర కృప : Arun Roy

తేయాకు మరియు సుగంధ ద్రవ్యాల తోటలు

తేయాకు మరియు సుగంధ ద్రవ్యాల తోటలు

దేవికులం లో ఉన్న టీ మరియు సుగంధ ద్రవ్యాల తోటలు పర్యాటకుల్ని తప్పక చూసేవిలా చేస్తాయి. ఈ ప్రాంతం అంతా కూడా ఈ మొక్కల సువాసనలతోనే మత్తెక్కిస్తాయి. కొన్ని అరుదైన మొక్కలను, కంటికి అందంగా కనిపించే చెట్ల వరుసలను ఇక్కడ చూడవచ్చు. తోటల వద్ద తాజా ఆకులతో తయారు చేసిన ఒక్క కాఫీ లేదా టీ తాగితే, దాని రుచికి వావ్ ..! అనకమానరు.

చిత్ర కృప : Anu Kartha

తూవనం జలపాతాలు

తూవనం జలపాతాలు

తూవనం జలపాతాలు దేవికులం హిల్ స్టేషన్ లోని మరయూర్ కి 18 కి. మీ. దూరంలో ఉన్నాయి. ఈ జలపాతాలు అందంగా ఉండి పర్యాటకులను, ఫోటోగ్రాఫర్లను మంత్ర ముగ్ధులను చేస్తాయి. ట్రెక్కర్ లకు ఈ ప్రాంతం ఆసక్తికరంగా ఉంటుంది. జలపాతాలకు చేరుకొనే మార్గంలో వన్య జంతువులను, మొక్కలను చూడవచ్చు.

చిత్ర కృప : Ajith U

పల్లివాసల్ జలపాతం

పల్లివాసల్ జలపాతం

పల్లివాసల్ జలపాతాలు చిన్నవే అయినప్పటికి ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి దేవి కులంలో సీతా దేవి సరస్సుకు సమీపంలో కలవు. పర్యాటకులు ఈ ప్రదేశంలో మానసికంగాను, శారీరకంగాను ఆహ్లాదాన్ని పొందవచ్చు. మున్నార్ నుండి ఈ జలపాతాలు కేవలం 8 కి.మీ. ల దూరం ఉండి పావుగంటలలో చేరుకొనే విధంగా ఉంటాయి.

చిత్ర కృప : Rajesh T

కీజహర్కుతు జలపాతం

కీజహర్కుతు జలపాతం

తోడుపుజ్హ నుండి కేవలం 25 కి. మీ .దూరంలో ఉన్న కీజహర్కుతు జలపాతాన్ని రెయిన్ బో వాటర్‌ఫాల్ అని కూడా అంటారు. ఈ జలపాతం లోని నీటి ధార 1500 మీటర్ల ఎత్తునుండి కిందకు పడుతుంది. ఔషద గుణాలున్న ఎన్నో మొక్కలు, పచ్చని అడవులతో ఈ జలపాతం పరిసరాలు పర్యాటకులకి కనువిందు చేస్తాయి. క్యాంపు, ట్రెక్కింగ్, రాక్ క్లైమ్బింగ్, పర్వతారోహణ వంటి కార్యక్రమాలకి ఈ ప్రదేశం అనుకూలంగా ఉంటుంది.

చిత్ర కృప : Jibin Puthenpurayil

అనయిరంకాల్ సరస్సు

అనయిరంకాల్ సరస్సు

అనయిరంకాల్, పర్యాటక ప్రదేశం మున్నార్ కు 22 కి.మీ. ల దూరంలో కలదు. ఈ ప్రదేశం తేయాకు తోటలకు, డ్యామ్ మరియు సరస్సుకు ప్రసిద్ధి. అనయిరంకాల్ సరస్సు వద్దకు వచ్చి ఏనుగుల గుంపు తమ దాహార్తిని తీర్చుకుంటాయి. పొడవైన అటవీ మార్గాలు, విశాలమైన టీ తోటలు కల ఈ ప్రాంతంలో ప్రధాన ఆకర్షణ టాటా టీ తోటలు. తేయాకుల ఘుమ ఘుమలతో పర్యాటకులు ఈ ప్రాంతంలో చక్కని నడక చేయవచ్చు.

చిత్ర కృప : Geetesh Bajaj

ఇడుక్కి నేషనల్ పార్క్

ఇడుక్కి నేషనల్ పార్క్

ఇడుక్కి నేషనల్ పార్క్ దేవకులం లో తప్పక చూడవలసిన ప్రదేశం. ఇక్కడున్న సహజ సిద్ధమైన రిజర్వ్ ఏరియాలో అరుదుగా కనిపించే పక్షులను, సరీశృపాలను మరియు జంతువులను చూడవచ్చు. యాత్రికులు పార్క్ అంతా సఫారీ చేస్తూ ప్రకృతి అందాలనూ ఆనందించవచ్చు. మీరు మంచి పోటొగ్రాఫర్ అయితే చక్కటి ఫోటో లు తీయవచ్చు.

చిత్ర కృప : Manar Holidays

దేవికులం ఎలా చేరుకోవాలి ??

దేవికులం ఎలా చేరుకోవాలి ??

వాయు మార్గం

దేవి కులం పట్టణానికి కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం 111 కి.మీ.ల దూరంలో కలదు. కొచ్చి విమానాశ్రయం దేశంలోని బెంగుళూరు, చెన్నై, ముంబై మరియు ఢిల్లీ వంటి ప్రనధాన నగరాలకు అనుసంధానించబడి ఉంది. పర్యాటకులు విమానాశ్రయం నుండి టాక్సీలలో దేవికులం చేరవచ్చు.

రైలు మార్గం

దేవికులంకు నేరు రైలు మార్గం లేదు. అయితే, పర్యాటకులు కొచ్చి నుండి లేదా కొట్టాయం రైల్వే స్టేషన్ ల నుండి దేవికులం చేరవచ్చు. కొచ్చి 150 కి.మీ., కొట్టాయం 136 కి.మీ.ల దూరం కలదు. ఈ రైలు స్టేషన్లనుండి దేవికులంకు అద్దె టాక్సీలు లేదా ప్రయివేటు కార్లలో చేరవచ్చు.

రోడ్డు మార్గం

దేవికులంకు కొచ్చి మరియు కొట్టాయం నుండి రోడ్డు మార్గం సులభంగా ఉంటుంది. రోడ్డు ప్రయాణంలో చుట్టు పక్కల అందమైన పరిసరాలను కూడా ఆనందించవచ్చు. ప్రభుత్వ మరియు ప్రయివేటు బస్సులు తరచుగా నడుస్తూంటాయి.

చిత్ర కృప : MP Chandrasekharan

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more