Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ఇడుక్కి

ఇడుక్కి - ప్రకృతి ఒడిలో మనోహరమైన అనుభూతి

35

దేవుని స్వంత ప్రదేశమైన కేరళ లో ఉన్న ఇడుక్కి, పర్యాటకులని అమితంగా ఆకట్టుకునే అధ్బుతం. దట్టమైన అడవులు, ఎత్తైన పర్వతాలు ఈ ప్రాంతం ప్రత్యేకత. భారత దేశం లో నే అతి పెద్ద శిఖరమైన 'అనముడి' శిఖరం ఇడుక్కి లో ఉంది. అంతే కాదు, ప్రంపంచంలోనే రెండవ అతి పెద్ద వంపైన ఆనకట్ట  కలిగిన ప్రాంతంగా ఇడుక్కి ప్రసిద్ది చెందింది. చేరా సామ్రాజ్యంలో భాగం కావటం, యూరోపెయన్ నుండి ఇక్కడికి వచ్చిన ఎంతో మందికి నివాస స్థలం కావడం వల్ల ఇడుక్కి చరిత్రలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకుంది. యుగాల నుండి దేశ విదేశాలకు టేకు, ఎర్ర కలప, గంధం చెక్క, ఏనుగు దంతాలు మరియు నెమళ్ళు వంటివి ఎగుమతి చేయడానికి ఈ ప్రాంతం వ్యాపార కేంద్రం గా వ్యవహరిస్తోంది. పూర్వ శిలా యుగపు మానవులు ఇక్కడ నివసించేవారని చరిత్రకారులు నమ్ముతున్నప్పటికీ, రాతి యుగం నాటి నాగరికతకు సాక్ష్యంగా ఇడుక్కి నిలిచిందని భావించవచ్చు. 1947-48 మధ్యకాలంలో ఉడుంబన్చోళ   మరియు పీర్ మేడు ప్రాంతాల్లో జరిగిన త్రవ్వకాలలో సమాధులు మరియు మెన్ హీర్ (పొడవైన రాళ్లు ) యొక్క అవశేషాలు దొరికాయి.

జనవరి 26, 1972 లో జిల్లాగా గుర్తించబడిన ఇడుక్కి కేరళ లో నే రెండవ పెద్ద జిల్లా. దేవుకులం, అడిమలి, ఉడుంబన్చోళ, తేకడి, ముర్రిక్కడి, పీర్ మేడు మరియు తోడపుజ్హ వంటి ముఖ్య నగరాల ని ఈ జిల్లా కలిగి ఉంది. తోడుపుజ్హయర్, పెరియార్ మరియు తలయ వంటి నదులు ఇడుక్కి జిల్లాలో ఉన్నాయి. 200 మీ ల కంటే ఎత్తు ఉన్న ఎన్నో శిఖరాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి.

రాష్ట్ర వినియోగానికి అవసరమయ్యే జల విద్యుత్ శక్తి లో 66% అందించడం వల్ల ఇడుక్కి ని కేరళ యొక్క విద్యుత్తు కేంద్రంగా పరిగణించవచ్చు. ఇడుక్కిలో ని డ్యాం ల లో ఇడుక్కి ఆర్చ్ డ్యాం, కులమావు డ్యాం మరియు చేరుతోని డ్యాం స్ ముఖ్యమైనవి. సుందరమైన ప్రదేశంలో ఉన్నఈ ఆనకట్టలు పర్యాటకులని ఆకట్టుకుంటాయి. అంతే కాకుండా, విండ్ ఎనర్జీ ఫార్మ్ ఉన్న రామక్కల్మేడు , ఇడుక్కి లో ని ముఖ్యమైన కొండప్రాంతం. పర్యాటకులని బోటింగ్ మరియు ఫిషింగ్ ల కి అమితంగా ఆకట్టుకునే మలంకర రిజర్వాయర్ ప్రాజెక్ట్ కేరళ లో అతి ముఖ్యమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్. వీటితోపాటు ఇడుక్కి లోమరెన్నోఆకర్షణలు ఉన్నాయి.

సుందరమైన ప్రకృతి దృశ్యాల తో పాటు, అనేకమైన తేయాకు తోటలు, కాఫీ ప్లాంటేషన్స్, నిర్మలమైన వాతావరణం, మంత్రముగ్ధులని చేసే జలపాతాలు, వివిధ జంతువులు కలిగిన సాంచురీ లు ఎన్నో ఇక్కడ ఉన్నాయి. ఇడుక్కి లో పేరొందిన ప్లాంటేషన్ అయిన ముర్రిక్కడ్డి గాలిలో తేయాకు, కాఫీ ల పరిమళం నిండి ఉంటుంది. మిరియాలు, యాలకులను పండించే ప్రాంతంగా నేడుంకండం హిల్  ప్రసిద్ది. ప్రవహించే సెలయేళ్ళు సందర్సకులకి ఆహ్వానం పలుకుతాయి.

ఇడుక్కి లో ని పర్యాటక ఆకర్షణలు

సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తున్న మంగళ దేవి టెంపుల్ ఇడుక్కి లో ని ప్రధాన పర్యాటక ఆకర్షణ. వాడక్కుమ్కూర్ రాజా   వారిచే ఈ కోవెల నిర్మించబడినదని నమ్మకం. అన్నామల గుడిని చోళుల నిర్మాణ శైలిలో కట్టారు. వాడక్కుమ్కూర్ రాజా వారిచే ముస్లిం సైనికుల కోసం నిర్మించబడిన నిన్నర్ మసీదు, ప్రాచీన కోటల యొక్క అవశేషాలు కరిక్కోడ్  ప్రాంతంలో గమనించవచ్చు. 13 వ శతాబ్దం ముందు నుండి తోడుపుజ్హ లో ఉన్న ఒక పురాతన మైన చర్చ్ ని కూడా ఇక్కడ గమనించవచ్చు. తేకడి లో ప్రఖ్యాతమైన పెరియార్ నేషనల్ పార్క్  ఉంది.

కురింజిమల  సాంచురి , అరుదైన వృక్ష మరియు జంతు జాతులకి స్థావరం. దీని సమీపం లో నే చిన్నార్ వైల్డ్ లైఫ్ సాంచురి, ఇందిరా గాంధీ వైల్డ్ లైఫ్ సాంచురి, అనముడి షోలా నేషనల్ పార్క్, ఎరావికులం నేషనల్ పార్క్ మరియు పంపాడుం షోల నేషనల్ పార్క్ లు ఉన్నాయి. నీలగిరి తహర్, నీలగిరి వుడ్ పిజియన్, గౌర్, పర్పెల్ ఫ్రాగ్ టైగర్, గ్రిజ్జ్లేడ్ జైంట్ స్క్విరెల్, ఏనుగు, సాంబార్ డీర్ మరియు నీలకురింజి లని చూడడానికి ప్రపంచంలో నలు మూలల నుండి పర్యాటకులు వస్తారు.

తట్టేకాడ్ బర్డ్ సాంచురి లేదా సలీం అలీ బర్డ్ సాంచురి ఎన్నో రకాల పక్షులకి అలాగే వివిధ రకాల దేశీయ జంతువులకి నివాసం. పెనిన్సులర్ బే ఓల్, మలబార్ గ్రే హార్న్ బిల్, రోజ్ బిల్డ్ రోలర్, క్రిమ్సన్ త్రోటెడ్ బార్బర్, క్రేస్టేడ్ సేర్పెంట్ ఈగల్, గ్రేట్ ఇండియన్ హార్న్ బిల్ మరియు ఫెయిరీ బ్లూ బర్డ్ వంటి అంతరించిపోతున్న పక్షులు ఎన్నింటినో ఇక్కడ చూడవచ్చు. కల్వరి పర్వతం, పల్కులమేడు మరియు నేడుంకందం కొండలు పర్వతారోహణ, సాహస యాత్రల మీద ఆసక్తి కలిగిన వారు తప్పక సందర్శించవలసిన ప్రాంతాలు. హిల్ వ్యూ పార్క్, తుంపచి కాల్వేరి సముచయం మరియు పైనవు వంటివి మరికొన్ని పర్యాటక ఆకర్షక ప్రదేశాలు.

 

ఇడుక్కి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఇడుక్కి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఇడుక్కి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ఇడుక్కి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం : ఆరు జాతీయ రహదారుల ద్వారా ఇడుక్కి , మిగతా ప్రధాన నగరాలకు అనుసంధానమై ఉంది. ఇడుక్కి NH -49 రహదారిలో ఉంది. ప్రైవేటు లేదా లక్జరీ బస్సు సర్వీసులు ఆహ్లాదకరమైన రోడ్డు ప్రయాణాన్ని అందిస్తాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం : ఇడుక్కి నుండి 14 కి మీ ల దూరంలో ఉన్న కొట్టాయం రైల్వే స్టేషన్ ఇడుక్కి కి అతి సమీపం లో ఉన్న రైల్వే స్టేషన్. కొట్టాయం నుండి ఇడుక్కి చేరుకోవడానికి బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. భారత దేశం లో ని అన్ని ప్రధాన నగరాల నుండి నడిచే రైళ్ళు ఇడుక్కి లో అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం : ఇడుక్కి కి సమీపంలో ఉన్న విమానాశ్రయం నేడుంబస్సేరి లేదా కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం. ఇడుక్కి నుండి ఈ విమానాశ్రయం 160 కి మీ ల దూరం లో ఉంది. టాక్సీ ని అద్దెకి తీసుకుని లేదా బస్సులో ప్రయాణించి ఇడుక్కి కి చేరుకోవచ్చు. ఈ విమానాశ్రయం నుండి ఇడుక్కి కి బస్సు లు తరచూ అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
16 Apr,Tue
Check Out
17 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
16 Apr,Tue
Return On
17 Apr,Wed