ఇడుక్కి లో నున్న పర్యాటక ఆకర్షణలలో రామక్కల్మేడు ఒకటి. చారిత్రక ప్రాముఖ్యం కలిగిన ఈ హిల్ స్టేషన్ నుండి పనోరమిక్ (విశాల దృశ్యం) వీక్షణ సాధ్యం. కురతి విగ్రహం మరియు కురవార్ స్మారక చిహ్నం ఇందులో కలవు. ఈ రెండు అంశాలు సంగం పీరియడ్ కి చిహ్నాలు. రామక్కలమేడు అనే పదానికి రాముడు పాదం మోపిన ప్రాంతం అని అర్ధం.
సీతమ్మ వారిని వెతుకుతూ వచ్చిన రాముడు ఈ రామక్కల్మేడు కొండ అంచులో పాదం మోపాడని నమ్మకం. వెస్ట్రన్ ఘాట్స్ లో ఉన్న ఈ రామక్కల్మేడు సముద్ర మట్టానికి 3500 అడుగుల ఎత్తులో ఉంది. ఈ హిల్ స్టేషన్ నుండి తమిళనాడు మరియు కేరళ యొక్క అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించవచ్చు. పచ్చటి పర్వతాలు, చల్లటి గాలులు, ఆకుపచ్చటి లోయలు ఈ చిన్న కొండ ప్రాంతాన్ని పర్యాటకులకి అభిమాన ప్రదేశంగా మారుస్తున్నాయి.
కాలాలతో సంబంధం లేకుడా ఇక్కడ వీచే చల్లటి గాలి సందర్సకులని ఆహ్లాదపరుస్తుంది. అందుకే, ఇక్కడ విండ్ ఎనర్జీ ఫార్మ్ ని ఏర్పాటు చేసారు.