Search
  • Follow NativePlanet
Share
» »కాసర్గోడ్ - కేరళ 'కోనసీమ' !

కాసర్గోడ్ - కేరళ 'కోనసీమ' !

By Mohammad

కేరళ కోస్తా తీర ప్రాంతం కాసర్గోడ్ కు, మన రాష్ట్రంలోని కోన సీమ ప్రాంతానికి చాలా దగ్గరి పోలికలు ఉంటాయి. అడుగడుగునా కొబ్బరి చెట్లు, తాటి చెట్ల వరుసలు కనిపిస్తుంటాయి. అలాగే కొండ మీద నుండి కిందకు జారే నీటి ప్రవాహలు నేరుగా అక్కడి సముద్రంలోకి వెళ్ళి కలిసే దృశ్యం రమ్యంగా ఉంటుంది.

కాసర్గోడ్ కేరళ రాష్ట్రానికి ఉత్తరకొనన ఉన్న చిట్టచివరి జిల్లా. కాసర్గోడ్ ప్రధానంగా కాసారక చెట్ల చే నిండి ఉంటుంది. కనుక ఈ ప్రదేశానికి ఆ పేరు ఈ చెట్ల పేరుతో వచ్చిందని చెప్పవచ్చు. పట్టణానికి చేరువలో అరేబియా తీరం పర్యాటకులను ఆకర్షిస్తున్నది.

ఇది కూడా చదవండి : ప్రకృతి ప్రేమికుల మనసు దోచే బెకాల్ !

కాసర్గోడ్ భిన్న సంస్కృతి - సంప్రదాయాలకు నెలవు. పండుగల సమయాల్లో పక్కా కోస్తా ఆంధ్రా అంటే గుర్తొచ్చేది కోళ్ల పందేలు, ఎద్దుల పందేలు అవునా ..! సరిగ్గా ఇక్కడ కూడా పండుగలు, ఉత్సవాల సమయాల్లో అదే తంతు జరుగుతుంది. దీనిని చూస్తే మన కోన సీమ గుర్తుకు రావాల్సిందే ..!

ఇక్కడ మీకొక విషయం చెప్పాలి అదేమిటంటే సంక్రాంతప్పుడు ఈ ఊరోళ్ళు మన కోస్తా లో జరిగే కోళ్ల పందాల్లో తప్పక హాజరవుతారు. వీరికి అదో జాడ్యం ..! మనవాళ్ళేం తక్కువనా ..! మన వాళ్ళు కూడా ఇక్కడ జరిగే అదే తంతు లో పాల్గొంటారు. నాలుగు రాళ్లు వెనకాల జమ వేసుకుంటారు.

కాసర్గోడ్ ఎలా చేరుకోవాలి ?

కాసర్గోడ్ ఎలా చేరుకోవాలి ?

కాసర్గోడ్ చేరుకోవటానికి రైలు, రోడ్డు, విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

విమాన మార్గం

కాసర్గోడ్ కు సమీపాన ఉన్న 50 కి. మీ. దూరంలో మంగళూరు విమానాశ్రయం కలదు. క్యాబ్ లేదా ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించి ఇక్కడికి చేరుకోవచ్చు.

చిత్ర కృప : rahulras1993

కాసర్గోడ్ ఎలా చేరుకోవాలి ?

కాసర్గోడ్ ఎలా చేరుకోవాలి ?

రైలు మార్గం

ప్రకృతి దృశ్యాలతో నిండిన కాసర్గోడ్ ను చూడాలంటే రైలు ప్రయాణం ఉత్తమం. దీనికి సమీపాన అదూర్ రైల్వే స్టేషన్(25 కి.మీ దూరంలో) , ఎర్నకులం రైల్వే స్టేషన్ (125 కి. మీ దూరంలో) కలదు. ఈ రెండు రైల్వే స్టేషన్ లు దేశంలోని ప్రధాన నగరాలతో కలుపబడి ఉన్నది.

చిత్ర కృప : ARUNKUMAR P.R

కాసర్గోడ్ ఎలా చేరుకోవాలి ?

కాసర్గోడ్ ఎలా చేరుకోవాలి ?

రోడ్డు మార్గం

కాసర్గోడ్ కు బస్సు ప్రయాణం చవకైనది. దారి పొడవునా ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. మంగళూరు, ఎర్నాకులం, బెకాల్, అదూర్ ప్రాంతాల నుండి తరచూ ప్రవేట్ / ప్రభుత్వ బస్సులు నడుస్తుంటాయి.

చిత్ర కృప : Shareef Taliparamba

కాసర్గోడ్ లో .. !

కాసర్గోడ్ లో .. !

కాసర్గోడ్ లో కొండలు, నదులు, సముద్ర తీరాలు, బ్యాక్ వాటర్, ఆలయాలు, మసీదులు మరియు చర్చి లు చూడవచ్చు. వీటితో పాటు అభయారణ్యాలు సైతం సందర్శించదగినవే ..!

చిత్ర కృప : Christine Grabig

బెకాల్ కోట

బెకాల్ కోట

కాసర్గోడ్ పట్టణానికి స్మారక చిహ్నం ' బెకాల్ కోట'. ఇది కాస ర్గో డ్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

చిత్ర కృప : Renjith Sasidharan

అనంతపుర దేవాలయం

అనంతపుర దేవాలయం

కాసర్గోడ్ నుండి అనంతపుర దేవాలయం 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కేరళలో ఈ గుడి మాత్రమే సరస్సులు కలిగి ఉంటుంది. ఇది విష్ణువు కు అంకితం చేయబడ్డ పురాతన ఆలయం. దీనిని క్రీ.శ. 9 వ శతాబ్ధంలో నిర్మించినట్లు తెలుస్తుంది.

చిత్ర కృప : Mundane and the Potpourri

అనంతపుర దేవాలయం - ప్రత్యేకత

అనంతపుర దేవాలయం - ప్రత్యేకత

అనంతపుర దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ గుడి సరస్సులో ఒక మొసలి ఉంటుందని, ఆ మొసలి ఆలయాన్ని రక్షిస్తుందని చెబుతారు. ఒకవేళ ఆ మొసలి చనిపోతే దాని స్థానంలో మరొక మొసలి రహస్యంగా వచ్చి చేరుతుందని అంటుంటారు.

చిత్ర కృప : shrikant_kabir

త్రిక్కానాడ్ శివాలయం

త్రిక్కానాడ్ శివాలయం

కాసర్గోడ్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో, అరేబియా సముద్ర తీరంలో త్రిక్కానాడ్ శివాలయం ఉన్నది. ఆలయ పరిసరాలు అందంగా ఉండి, భక్తులను రంజింపజేస్తాయి.

చిత్ర కృప : krishnadas kodakkad

మల్లికార్జున ఆలయం

మల్లికార్జున ఆలయం

కాసర్గోడ్ నుండి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో మల్లికార్జున ఆలయం కలదు. ఇందులో శివ భగవానుడు కొలువై ఉంటాడు.

చిత్ర కృప : krishnadas kodakkad

మథుర్ గణపతి ఆలయం

మథుర్ గణపతి ఆలయం

కాసర్గోడ్ పట్టణం నుండి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో మథుర్ గణపతి ఆలయం ఉన్నది. ఆలయ నిర్మాణ వైభోగం అద్భుతంగా ఉంటుంది.

చిత్ర కృప : STV

మాలిక్ దీనార్ మసీద్

మాలిక్ దీనార్ మసీద్

కాసర్గోడ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో మాలిక్ దీనార్ మసీద్ కలదు. ఇండియా లో మొదట స్థాపించబడ్డ మసీద్ లలో ఇదొకటి. మహమ్మద్ ప్రవక్త జీవించి ఉన్నప్పుడే ఈ మసీద్ కు బీజం పడిందని కూడా చెబుతారు. మసీదును కేరళ శైలిలో నిర్మించారు.

చిత్ర కృప : Shareef Taliparamba

బేల్ చర్చి

బేల్ చర్చి

బేల్ చర్చి ఒక క్యాథలిక్ చర్చి. కాస ర్గో డ్ పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న చర్చి 'అవర్ లేడీ ఆఫ్ సరోవర్ చర్చ్' గా గుర్తించబడింది.

చిత్ర కృప : Joao Vicente

స్యాంక్చురీలు

స్యాంక్చురీలు

ఇదివరకే చెప్పుకున్నట్లు, కాసర్గోడ్ ఒక జిల్లా. ఈ జిల్లా మొత్తం మీద 4 అభయారణ్యాలు ఉన్నాయి. అవి రాణిపురం అభయారణ్యం, మాలొమ్ అభయారణ్యం, అడోర్అభయారణ్యం, పరప్ప అభయారణ్యం మరియు కరీం అభయారణ్యం లుగా ఉన్నాయి.

చిత్ర కృప : Yadu Aralam

కులమతాలకు అతీతంగా ...

కులమతాలకు అతీతంగా ...

కాసర్గోడ్ లో ఆట్టహాసంగా జరిగే వేడుక తెయ్యం. ఆ సమయాన జానపద నృత్యాలు, సంప్రదాయ నృత్యాలు నిర్వహిస్తారు. కంబాల అనే ఎద్దు పందేలు మరియు కోళ్ల పందేలు ప్రత్యేకంగా జరుపుతారు. ఆ వేడుకలను చూడటానికి మతాలకతీతంగా ప్రజలు పాల్గొంటారు.

చిత్ర కృప : Prof. Mohamed Shareef

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+