Search
  • Follow NativePlanet
Share
» »నుబ్రా వాలీ ప్రముఖ సందర్శనీయ స్థలాలు !

నుబ్రా వాలీ ప్రముఖ సందర్శనీయ స్థలాలు !

By Mohammad

నుబ్రా వాలీ ఒక అందమైన పూల లోయ. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్న ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తున కలదు. దీనిని 'లడఖ్ తోట' అని కూడా పిలుస్తుంటారు అక్కడి స్థానికులు. సంవత్సరం పొడవునా మంచుతో కప్పబడి ఉండే నుబ్రా వాలీ ని వేసవిలో సందర్శించటానికి భారతీయులు, విదేశీయులు ఇష్టపడతారు.

నుబ్రా వాలీ ప్రాంతంలో ఎక్కువగా పసుపు, పింక్ వర్ణాలు కలిగిన పూలు పూస్తాయి అవే ఇక్కడ అధికంగా కనిపిస్తాయి కూడా. ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డుమార్గం గుండా వాలీ చేరుకొనే ప్రయాణం ఊపిరి బిగబట్టే విధంగా ఉంటుంది. సంవత్సరం పొడవునా మంచుతో కప్పబడే ఈ ప్రాంతంలో సందర్శన సాహసికులకు ఉత్తేజాన్ని ఇస్తుంది.

కాశ్మీర్ సందర్శనలో అద్భుత ప్రదేశాలు

నుబ్రా వాలీ పర్యటించే స్థలాలు

నుబ్రా వాలీ ప్రముఖ సందర్శనీయ స్థలాలు పనామిక్ గ్రామం, ఆరామాలు. ఈ ప్రాంతంలో ఇస్లాం మతం పుట్టక ముందు బౌద్ధ మతం వ్యాప్తి లో ఉండేదని అక్కడి ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఎన్నో యుద్ధాలను చవిచూసిన ఈ ప్రాంతం ఇప్పటికీ వన్నె తగ్గకుండా పర్యాటకులను ఆకర్షిస్తున్నది అంటే ... అక్కడి ప్రకృతి సౌందర్యాలు ఏ మాత్రం ఉన్నాయో తెలుసుకోవలసిందే !

ఖార్ దుంగ్ లా పాస్

ఖార్ దుంగ్ లా పాస్

నుబ్రా వాలీ చేరుకోవాలంటే, ఖార్ దుంగ్ లా పాస్ ఒక్కటే మార్గం. ఇది రోడ్డు మార్గం. సముద్రమట్టానికి 18380 అడుగుల ఎత్తున ఉండే ఈ రోడ్డు మార్గం ప్రపంచంలోనే అతి ఎత్తైన రోడ్డు మార్గంగా ఖ్యాతి గడించింది.

చిత్ర కృప : Loupiote

ఖార్ దుంగ్ లా పాస్

ఖార్ దుంగ్ లా పాస్

ఖార్ దుంగ్ లా పాస్ రోడ్డు మార్గం సంవత్సరం పొడవునా 365 రోజులూ మంచుచే కప్పబడి ఉంటుంది. దీని నిర్వహణ అంత సులభం కాదు కనుకనే బార్డర్ రోడ్ సంస్థ నిర్వహిస్తున్నది.

చిత్ర కృప : Anthony Maw

ఖార్ దుంగ్ లా పాస్

ఖార్ దుంగ్ లా పాస్

ఖార్ దుంగ్ లా పాస్ రోడ్డు మార్గం వేసవిలో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ పాస్ గుండా ప్రయాణించేటప్పుడు అందమైన కారాకోరం మరియు లడఖ్ పర్వత శ్రేణులను చూడవచ్చు.

చిత్ర కృప : Elroy Serrao

పనామిక్ గ్రామం

పనామిక్ గ్రామం

పనామిక్ గ్రామం, లేహ్ పట్టణానికి 150 కిలోమీటర్ల దూరంలో సుబ్రా వాలీ లోయలో కలదు. ఈ గ్రామం ఇండో - చైనా సరిహద్దు ప్రాంతంలో ఉన్నది. గ్రామ పొలిమేర వరకు మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది ప్రయాణీకులు. ఆది దాటితే చైనా దేశం వస్తుంది. ఇక్కడ ఒక వేడి నీటి బుగ్గ కూడా కలదు.

చిత్ర కృప : KennyOMG

మైత్రేయ బుద్ధ

మైత్రేయ బుద్ధ

నుబ్రా వాలీ లో ఉన్న ప్రధాన ఆకర్షణల్లో మైత్రేయ బుద్ధ ఒకటి. దీనిని భవిష్యత్ బుద్ధ లేదా లాఫింగ్ బుద్ధ అని పిలుస్తారు. ఈ విగ్రహం అక్కడి కొండమీద గల ఓపెన్ ప్రదేశంలో 32 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది.

లడక్ ... భారత్ - చైనా ల మధ్య అద్భుత ఆకర్షణ !

చిత్ర కృప : Atishayphotography

మైత్రేయ బుద్ధ

మైత్రేయ బుద్ధ

కొండ మీద ఉన్న మైత్రేయ బుద్ధ విగ్రహం చూడటానికి వింతగా ఉంటుంది. కొండ మీద ఉన్న విగ్రహం శ్యూక్ నది వైపుగా పాకిస్థాన్ వైపున తిరిగి ఉంటుంది. ఈ విగ్రహాన్ని శాంతికి చిహ్నంగా అక్కడి స్థానికులు భావిస్తారు.

చిత్ర కృప : Mahuasarkar25

ఇన్సా బౌద్ధ ఆరామం

ఇన్సా బౌద్ధ ఆరామం

ఇన్సా ఆరామాన్నే 'ఇన్సా గొంపా' అని కూడా పిలుస్తారు. ఇది పనామిక్ గ్రామానికి సమీపంలో ఉంటుంది కానీ ఇక్కడికి వెళ్ళాలంటే సుమారు 6 గంటలు ట్రెక్కింగ్ చేయాలి. ఈ పురాతన బౌద్ధ ఆరామంలో బౌద్ధ మతానికి సంబంధించిన చిత్రాలు ఉండటం అదనపు ఆకర్షణగా చెప్పుకోవచ్చు.

చిత్ర కృప : Ivana Pantelejevova

డిస్ కిట్ బౌద్ధ ఆరామం

డిస్ కిట్ బౌద్ధ ఆరామం

డిస్ కిట్ బౌద్ధ ఆరామం సముద్ర మట్టానికి 10310 అడుగుల ఎత్తులో ఉన్న డిస్ కిట్ గ్రామంలో కలదు. ఇది నుబ్రా వాలీ లో ఉన్న అతిపెద్ద మరియు పురాతన ఆరామం. ఈ ఆరామంలో టిబెట్ సంస్కృతికి చెందిన అనేక శిల్పాలను, చిత్రాలను, పెయింటింగ్ లను చూడవచ్చు. ఇక్కడ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి లో స్కేప్ గోట్ ఫెస్టివల్ జరుగుతుంది.

చిత్ర కృప : Raffaele

లా చుంగ్ ఆలయం

లా చుంగ్ ఆలయం

లా చుంగ్ ఆలయం సుబ్రా వాలీ లో పురాతమైనది. ఈ టెంపుల్ లో సోంగా ఖాపా నుండి వచ్చిన మనిషి అని పేరుపడ్డ టిబెట్ ఆధ్యాత్మిక వేదాంతి పొడవైన విగ్రహం పసుపు రంగు టోపీ ధరించి వుంటుంది. డిస్ కిట్ ఆరామానికి సమీపంలో ఉన్న ఈ ఆలయాన్ని తప్పక సందర్శించాలి.

చిత్ర కృప : Ivana Pantelejevova

హుందూర్ (హున్దుర్) ఆరామం

హుందూర్ (హున్దుర్) ఆరామం

డిస్ కిట్ ఆరామానికి, లా చుంగ్ ఆలయానికి సమీపంలో ఉన్న మరో ఆకర్షణ హుందూర్ ఆరామం. దీనిని సుబ్రా వాలీకి వెళ్లే మెయిన్ రోడ్ మీద కనిపించే బ్రిడ్జ్ వద్ద చూడవచ్చు. ఇది నుబ్రా వాలీ లో చివరి ప్రదేశం కాబట్టి, ఇక్కడి వరకు మాత్రమే ప్రయాణీకులను అనుమతిస్తారు.

చిత్ర కృప : A_K_M

సంస్తన్లింగ్ ఆరామం

సంస్తన్లింగ్ ఆరామం

సుబ్రా వాలీ లో ఉన్న మరొక బౌద్ధ ఆరామం సంస్తన్లింగ్ ఆరామం. ఇక్కడ గల బుద్ధ విగ్రహాలు, ఇతర వస్తువులు చూడటం కొరకు పర్యాటకులు వస్తుంటారు. క్రీ.శ. 1962 లో దలైలామా ఈ ఆరామాన్ని ఆవిష్కరించాడు.

మంచు కొండల మహత్యం ... గుల్మార్గ్ !

చిత్ర కృప : SagarSinghPhotography

నుబ్రా వాలీ ఎలా చేరుకోవాలి ?

నుబ్రా వాలీ ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం

నుబ్రా వాలీ కి 118 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేహ్ విమానాశ్రయం సమీప విమానాశ్రయం. ఈ ఏర్ పోర్ట్ దేశంలోని అన్ని ప్రధాన నగరాలైన ఢిల్లీ, శ్రీనగర్, సిమ్లా వంటి నగరాల తో అనుసంధానించబడింది. ట్యాక్సీ లు లేదా స్థానిక బస్సుల్లో ప్రయాణించి సుబ్రా వాలీ చేరుకోవచ్చు.

రైలు మార్గం

నుబ్రా వాలీ కి సమీప రైల్వే స్టేషన్ లేహ్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ జమ్మూ కాశ్మీర్ లోని అన్ని ప్రధాన నగరాలతో కనెక్ట్ చేయబడింది. ఈ రైల్వే స్టేషన్ నుండి ఢిల్లీ, ముంబై, జైపూర్, గయ, వారణాసి వంటి పట్టణాలకు సైతం ప్రయాణించవచ్చు.

రోడ్డు మార్గం

సుబ్రా వాలీ కి ఇంతకు ముందే చెప్పుకున్నట్టు ఖార్ దుంగ్ లా పాస్ ఒక్కటే రోడ్డు మార్గం. లేహ్ నుండి ఈ ప్రాంతానికి నిత్యం బస్సులు తిరుగుతుంటాయి. ప్రవేట్ కార్లను అద్దెకు తీసుకొని కూడా సుబ్రా వాలీ చేరుకోవచ్చు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల నుండి, పట్టణాల నుండి లేహ్ చక్కగా రవాణా సాధనాలను కలిగిఉంది.

చిత్ర కృప : Hynek Moravec

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+