Search
  • Follow NativePlanet
Share
» »భోజ్ పూర్ - అసంపూర్ణ పట్టణం !!

భోజ్ పూర్ - అసంపూర్ణ పట్టణం !!

భోజ్ పూర్ పట్టణం గురించి తెలుసా? చాలా మంది విని ఉండరు. భోజ్ పూర్ - అసంపూర్ణ పట్టణం. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రదేశం.

భోజ్ పూర్ పట్టణం గురించి తెలుసా? చాలా మంది విని ఉండరు. ఇది చాలా పురాతనమైన పట్టణం. ఇది మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రముఖ పర్యాటక ప్రదేశం. మధ్యప్రదేశ్‌ లోని భోపాల్‌ కి 28 కిలోమీటర్ల దూరంలో 'బేత్వా' నదీ తీరంలో వెలసిన అందమైన నగరం భోజ్‌ పూర్.

పేటియం కూపన్లు : రూ. 200 టికెట్ మీద 15 % క్యాష్ బ్యాక్ ఆఫర్ మరియు ఐ ఫోన్ 6 గెలుచుకునే అద్భుత అవకాశం

పురాతన నగరాలు నాశనమవటం మనం గమనించి ఉంటాం కానీ, భోజ్ పూర్ పట్టణం అలా కాదు ఇక్కడున్న కట్టడాలు అన్ని పూర్తి అవ్వడం అనేదే జరగదు అదే ఈ పట్టణం ప్రత్యేకత. ఇక్కడున్న ప్రదేశాలలో ముఖ్యంగా చెప్పుకోవలసినది ఆలయాలు, ఆనకట్టలు. ఇవి చూస్తే గాని తెలీదు మిమ్మల్ని ఎంతగా ఆశ్చర్యపరుస్తాయో!

భోజేశ్వర్ దేవాలయం

భోజేశ్వర్ దేవాలయం

చుట్టూ అందమైన రాతి ప్రకృతిలో శిథిలావస్థకు చేరుకొన్న ఈ భోజ్‌పూర్‌ లో చెప్పుకోదగ్గ మరో అంశం - భోజేశ్వర ఆలయం. ఇక్కడ ఏక శిలతో నిర్మితమైన 18 అడుగుల ఎతె్తైన శివలింగం దర్శనమిస్తుంది. ఎత్తైన స్తంభాలతో.. అందమైన శిల్పాలతో పురాతత్వ చారిత్రక శాస్తవ్రేత్తలను సైతం అబ్బుర పరిచే విధంగా ఉందీ ఆలయం. మాల్వా వంశీకుల ఏలుబడిలో విశ్వఖ్యాతి పొందిన ఈ ఆలయం ఆనాటి శిల్పకళా వైభవానికీ.. చారిత్రక సత్యానికీ ప్రతీక.

అతిపెద్ద శివలింగం గురించి మరిన్ని విశేషాలు !

Photo Courtesy: Asher Fergusson

రాక్ డ్రాయింగ్స్ మరియు క్వారీలు

రాక్ డ్రాయింగ్స్ మరియు క్వారీలు

ఇక్కడ ఉన్న రాక్ డ్రాయింగ్స్ మరియు క్వారీలు, భోజుపూర్ దేవాలయ నిర్మాణ ప్రక్రియలో ఉపయోగించిన అవశేషాలు. ఇక్కడి రాళ్ళు ముక్కలుగా చేసి, చెక్కించి మరియు ఈ ఆలయంలో అలంకరించాలిసినవి. ఇక్కడి ఆలయ ప్రణాళికలో ఉపయోగించవలసిన నమూనాలు, చెక్కినరాళ్ళు, స్తంభాలు పెద్ద సంఖ్యలో చూడవొచ్చు. ఇక్కడ ఉన్న పెద్ద మట్టి రాంప్ మధ్యయుగ క్రాఫ్ట్ చతురతకు ఆదర్శప్రాయమైనదిగా ఉన్నది.

Photo Courtesy: Vinod Sohanlal

జైన్ దేవాలయాలు

జైన్ దేవాలయాలు

భోజేశ్వర్ దేవాలయానికి సమీపంలోనే నిర్మాణం పూర్తికాని జైన దేవాలయం కనిపిస్తుంది. ఆరు మీటర్ల ఎత్తైన శాంతినాథ్ విగ్రహానికి ఇరుపక్కల పార్శ్వనాథ్ - సూపర్స్‌నాథ్ విగ్రహాలుంటాయి. ఈ దేవాలయం త్రికోణాకృతిలో ఉన్నది. ఈ ఆలయం చుట్టూ చిన్నచిన్న విగ్రహాలు దర్శనమిస్తాయి. ప్రాచీన శిలా శాసనాలు కూడా ఉన్నాయి.

Photo Courtesy: Atishay Jain

పార్వతి గుహ

పార్వతి గుహ

కఠిన శిలలను కరిగించి - పోతపోసినట్టుగా అణువణువున అందం తొణికిసలాడుతూన్న భోజేశ్వర్ దేవాలయానికి ఎదురుగా పార్వతీదేవి గుహ ఉంటుంది. ఈ గుహ లోపల 11వ శతాబ్దంలో ఉన్నటువంటి చాలా పురాతన శిల్పాలు మరియు నిర్మాణ భాగాలు ఉండటంవలన, మీరు ఆ కాలంలోకి అడుగుపెడతారనటంలో అతిశయోక్తి లేదు.

Photo Courtesy: Telugu Nativeplanet

భోజాస్ రాయల్ పాలస్

భోజాస్ రాయల్ పాలస్

పార్వతి గుహను సందర్శించిన తరువాత, మీరు చూడవలసిన మరొక ఆకర్షణీయ ప్రదేశం ప్యాలెస్. క్రీ.శ.11వ శతాబ్దంలో నిర్మితమైనదిగా భావిస్తున్న ‘భోజ్ పూర్' రాజ భవంతి నిర్మాణం అబ్బుర పరుస్తుంది. ఈ రాజప్రాసాదంలోని రాక్ నేలపై చెక్కిన బ్లాక్స్ మరియు చెక్కిన గ్రాఫిటీ అద్భుతంగా ఉన్నది. పదకొండవ శతాబ్దంలో రాజ వినోదం స్ఫూర్తిని ఇచ్చే గేమ్స్ కోసం ఏర్పాటు చేసిన చిత్రాలు చూడవచ్చు.

Photo Courtesy: telugu Nativepalnet

భిమేత్క గుహలు

భిమేత్క గుహలు

నగరం నుండి కొద్దిగా వెళితే, 20కి.మీ. అవతల భిమేత్క ఉన్నది. ఇక్కడి రాక్ చిత్రాలు యొక్క గొప్ప సమూహం మిమ్మలిని ఆకర్షిస్తుంది. ప్రపంచంలో ఉత్తమమైన వాటిలో ఒకటిగా భిమేత్క ను వరల్డ్ హెరిటేజ్ సెంటర్ యునెస్‌కో గుర్తించింది.

Photo Courtesy:Nagarjun Kandukuru

షాపింగ్ - ఆహారాలు

షాపింగ్ - ఆహారాలు

మీరు భోజుపూర్ వద్ద ఉన్నప్పుడు, కేబాబ్స్, భుట్టే కి కీస్, మావా-బతి, ఖోప్రపాక్, మరియు మాల్పువా వంటి మధ్యప్రదేశ్ రుచికరమైన వంటలను రుచి చూడకుండా తప్పించుకోవద్దు. అంతే కాక షాపింగ్ చేసేటప్పుడు ఇక్కడి వారు చేతితో చేసిన కళాత్మక వస్తువులను కొనడం మరిచిపోకండి.

Photo Courtesy: urmish sheth

ఆహ్లాదకరమైన వాతావరణం

ఆహ్లాదకరమైన వాతావరణం

కేవలం సిమెంట్, సున్నం వంటివి వాడకుండా రాళ్లను మాత్రమే పేర్చుకుంటూ కట్టిన అతి పురాతనమైన ఆనకట్టలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఇంకేముంది.. భోజ్‌పూర్ గ్రామంలో పచ్చపచ్చని చెట్లు, కొండల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో వెలసివున్న సోమనాథ ఆలయాన్ని దర్శించుకునే భక్తులకు ఎప్పటికీ ఓ మరపురాని అనుభూతిగా మిగిలిపోతుందనడంలో ఎలాంటి సంశయము లేదు.

Photo Courtesy: shivanjan choudhury

భోజ్ పూర్ ఎలా చేరుకోవాలి?

భోజ్ పూర్ ఎలా చేరుకోవాలి?

భోజ్ పూర్ కు ప్రయాసపడకుండానే అన్ని రవాణా మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు.

విమాన మార్గం

మధ్య ప్రదేశ్ కు 44 కి. మీ దూరంలో ఉన్న రాజధాని నగరం భోపాల్ లో విమానాశ్రయం ఉన్నది. ఈ రాజ భోజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, ముంబై, ఢిల్లీ, జబల్పూర్ ,ఇండోర్ మరియు గ్వాలియర్ వంటి నగరాలతో అనుసంధించబడి ఉన్నది.

రైలు మార్గం

భోజ్ పూర్ కు అతి దగ్గరలో భూపాల్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఉన్నది. దేశం యొక్క దాదాపు అన్ని ప్రదేశాలకు ఈ రైల్వే స్టేషన్ కనెక్ట్ అయి ఉన్నది.

రోడ్డు మార్గం

భోజ్ పూర్ నుండి బస్సు మార్గం ద్వారా భూపాల్ కు మంచి కనెక్టివిటీ ఉన్నది. భూపాల్ కు హైవే చేరువలో ఉండటం వలన, ఇది సమర్థవంతమైన అంతర రాష్ట్ర రోడ్డు రవాణా సౌకర్యాలను కలిగి ఉన్నది. భోపాల్ చేరుకున్న ప్రయాణికులకు మెట్రో మరియు రేడియో టాక్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి కనుక, సులభంగా చేరుకోవచ్చు.

Photo Courtesy:Suresh Dixit

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+