Search
  • Follow NativePlanet
Share
» »బెంగళూరు నుండి హోగెనక్కల్ జలపాతానికి వన్ డే రోడ్ ట్రిప్ !!

బెంగళూరు నుండి హోగెనక్కల్ జలపాతానికి వన్ డే రోడ్ ట్రిప్ !!

బెంగుళూరు నుండి ఉదయం బయలుదేరి రాత్రికి తిరిగి బెంగుళూరు చేరితే ట్రిప్ థ్రిల్‌గా ఉంటుంది. సిటీ దాటి గ్రామీణ ప్రాంతంలోకి దారి తీసినప్పటి నుండి ప్రకృతిసిద్ధమైన సహజ అందాలు ఒక్కొక్కటిగా కనువిందు చేస్తాయి.

హొగెనక్కల్ జలపాతం కావేరీ నది మీద ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతం. ఇది తమిళనాడు రాష్ట్రంలో ధర్మపురి జిల్లా లో ఉన్నది. ఇది బెంగుళూరు నుండి 180 కిలోమీటర్లు మరియు ధర్మపురి నుండి 46 కిలోమీటర్లు దూరంలో ఉన్నది. దీనినే "భారతీయ నయాగరా జలపాతం" అని పిలుస్తారు. కార్బొనటైట్ రాళ్ళు దక్షిణాసియాలొను మరియు ప్రపంచంలోనే పురాతనమైనవిగా భావిస్తారు. ఆకాశం నుండి దూకుతున్నట్లుండే జలపాతం...చూపరులకు కళ్ళు చేదిరనట్లనిపించడం దీని ప్రత్యేకత. ఆధునిక ప్రపంచానికి సుదూరంగా ఉండే హోగెనక్కల్‌ సహజత్వానికి చేరువగా ఉంటుంది. పర్యాటకులకు అమితానందాన్నిచ్చే అనుభూతుల నిలయం.

క్లియర్ ట్రిప్ కూపన్లు : హోటళ్లు మరియు ఫ్లైట్ బుకింగ్ ల మీద రూ. 5000 క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందండి*

బెంగుళూరు నుండి ఉదయం బయలు దేరి రాత్రికి తిరిగి బెంగుళూరు చేరితే ట్రిప్ థ్రిల్‌గా ఉంటుంది. బెంగుళూరులో బయలు దేరినప్పటి నుండి ఎంజాయ్‌మెంట్ మొదలైనట్లే. సిటీ దాటి గ్రామీణ ప్రాంతంలోకి దారి తీసినప్పటి నుండి ప్రకృతి సిద్ధమైన సహజ అందాలు ఒక్కొక్కటిగా కనువిందు చేస్తాయి. రోడ్డుకు రెండు వైపులా పచ్చటి మల్బరీ తోటలుంటాయి. ఇక్కడ పట్టుపురుగుల పెంపకం కేంద్రాలు ఎక్కువ. వెడల్పాటి ఆకులను సన్నగా కత్తిరించి పురుగులకు ఆహారంగా వేస్తుంటారు. హోగెనక్కల్‌కు హైవే నుండి నాలుగు కిలోమీటర్లు లోపలకు వెళ్లాలి. దాదాపుగా దగ్గరకు వెళ్లే వరకు ఆనవాలు కూడా కనిపించదు. జలపాతానికి కిలోమీటర్‌ దూరంనుండే ఝుమ్మనే శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం ఎత్తు నుండి జాలువారుతున్న నీటి సందడిదే. ముందుకెళ్ళే కొద్దీ శబ్దం మరీ ఎక్కువవుతుంది. సినిమాలు తీసేవాళ్ళు 'హోగేనక్కల్' ను రొమాంటిక్ పాటలు తీయటానికి ఎన్నుకుంటారు. ఇక్కడున్న జలపాతాల అందాలను ఒకసారి వీక్షించినట్లయితే ..

ఊహకందని జలపాతాలు

ఊహకందని జలపాతాలు

ఎందుకంటే అక్కడ ఒకటి, రెండు కాదు, లెక్కపెట్టలేనన్ని జలపాతాలు ఉన్నాయి. 250 మీటర్ల ఎత్తు నుండి భూమి మీదకు దూకుతున్నాయి. వర్షపు నీరు కొండ వాలులో ప్రయాణించి హోగెనక్కల్ దగ్గర నదిలో కలుస్తుంది. ఈ వాటర్ ఫాల్స్ నీరు కావేరి డ్యాం బ్యాక్ వాటర్స్. అంతెత్తు నుండి కిందకు దూకే క్రమంలో నీటి తుంపరలు 20 మీటర్ల ఎత్తు లేస్తాయి. ఈ తుంపరలన్నీ కలిసి పొగ కప్పేసినట్టు ఉంటుంది. హోగెనక్కల్ అంటే అర్థం కూడా ఇదే. మంచు తుంపరల నుండి వచ్చే శబ్ధం అని. ఇక్కడ ఉన్న రెండు కొండలను చూస్తే ఒక కొండ మధ్యకు నిలువునా చీలినట్లు ఉంటుంది. ఆ చీలికలోనే ప్రవాహం. ఆ ప్రవాహంలో పడవ ప్రయాణం గొప్ప థ్రిల్లింగ్‌ ఇచ్చే సాహసమే.

Photo Courtesy: Sankara Subramanian

చర్మ వ్యాధులకు ఉపశమనం

చర్మ వ్యాధులకు ఉపశమనం

హోగేనక్కల్ ఆరోగ్యపరంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నీటిలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు పోతాయంటారు. ఈ ప్రదేశం మసాజ్ కు ప్రసిద్ధి. ఆయుర్వేద తైలాలతో మర్దన చేస్తారు. ఇక్కడి వాళ్లకు ఇది కుటీర పరిశ్రమ. అరుదైన ప్రకృతి సోయగాలను సొంతం చేసుకున్న ఈ ప్రదేశంలో ఎంత సేపున్నా ఇంకా ఉండాలనే అనిపిస్తూ ఉంటుంది.

Photo Courtesy: Pappadi

తెప్ప విహారం ప్రత్యేకం

తెప్ప విహారం ప్రత్యేకం

ఇది ఒక విహారమే కాక, ఒక రవాణా సాధనంగా కూడా వుంటుంది. ఈ తెప్ప విహారం కావేరి మరియు తుంగభద్ర నదులలో అధికంగా కనపడుతుంది. తెప్ప అంటే, వెదురు బద్దలతో తయారు చేయబడిన ఒక చిన్న బోటుగా అంచులు కొంత వరకు మూయబడి వుంటుంది. నీరు లోనికి రాకుండా, జంతువుల చర్మం లేదా ప్లాస్టిక్‌ షీట్‌ వంటివి కింద వేస్తారు. తెప్పను నదులలో చేపలు పట్టేందుకు కూడా వాడతారు. హోగెనక్కల్‌ జలపాతాలు ఎంతో ఆనందకరమైన ఈ తెప్ప విహారం తమిళనాడు లోని హోగెనక్కల్‌ లో బాగా కనపడుతుంది. పురాతనమైన ఈ బోట్లు జలపాతాల నీటిలో వేగంగా ప్రయాణిస్తాయి. ఈ ప్రయాణం కొద్దిపాటి భయం కలిగించి నప్పటికీ, సాహస వంతులకు ఆనందాన్ని ఇస్తుంది. ప్రతి ఒక తెప్పలో గరిష్టంగా నలుగురు మాత్రమే కూర్చోనవచ్చు. ఈ ప్రాంతంలో మీరు తెప్పను స్వయంగా నడపటం ఎలా అనేది కూడా నేర్చుకొనవచ్చు. అది మీకు ఒక కొత్త అనుభవం కూడా కాగలదు.

Photo Courtesy: Saneem Perinkadakkat

వర్షాకాలంలో మరింత ఉత్సాహంగా...

వర్షాకాలంలో మరింత ఉత్సాహంగా...

హోగెనక్కల్‌ లోని ఆనందకరమైన ఈ తెప్ప సాహస క్రీడ వర్షాకాలంలో మరింత ఆనందాన్ని ఇస్తుంది. తుంగభద్ర నది దక్షిణాదిన మీరు కర్నాటకలోని హంపి పట్టణం సందర్శించినపుడు, అక్కడ కల తుంగభద్ర నదిలో కూడా ఈ తెప్ప ప్రయాణం చేయవచ్చు. తెప్ప నదిలో ప్రయాణిస్తుంటే, హంపి శిధిలాలను చూడవచ్చు. అలల తాకిడి ఎక్కువగా వున్న చోట ఈ తెప్ప ప్రయాణం మరింత ఆనందం కలిగిస్తుంది.

Photo Courtesy: jeet_sen

వంటలు

వంటలు

హోగెనక్కల్ ట్రిప్ లో మర్చిపోకుండా రుచి చూడాల్సింది ఒకటుంది.నదిలో చేపలు పట్టి అక్కడే కాల్చి ఇస్తారు. ఆ రుచి మరెక్కడి చేపకూ రాదు. ఇక్కడ త్రాగే నీటి పాకెట్లను మరియు స్నాక్‌‌స ను, ఇంకా అనేక రకాల వస్తువులను అమ్ముతుంటారు. అప్పుడే పట్టుకున్న తాజా చేపలను కొరాకిల్‌‌స లో కొనుక్కోవొచ్చు.

Photo Courtesy: Praveen

మొసళ్లు

మొసళ్లు

ఈ ప్రయాణంలో ఎన్నో అడవులను, పరిసరాలను చూస్తూ ఆనందించవచ్చు. ఈ ప్రాంతంలోని ప్రజలు, ప్రయాణీకులకు చవక ధరలకు అన్నీ సమకూరుస్తుంటారు. ఈ తెప్ప ప్రయాణాలతోనే వారి జీవనం సాగిస్తారు. భీమేశ్వరి ప్రదేశం చేపలు పట్టేందుకు స్వర్గంగా ప్రసిద్ధి అయినప్పటికీ, తెప్ప విహారాలకు కూడా అనుకూలమే. అయితే ఈ ప్రాంతంలో మొసళ్ళు కూడా వుంటాయి. జాగ్రత్త పడాలి.

Photo Courtesy: Kmanoj

పెన్నగ్రం

పెన్నగ్రం

పెన్నగ్రం గ్రామం దట్టమైన అడవి మధ్యలో ఉన్నది. ఇది హోగేనక్కల్ కు 15 కి.మీ. అవతల ఉన్నది. ఇక్కడ పట్టు పురుగుల కోసం పెంచే మల్బారి పొలాలు మరియు టెర్రాకొట్టతో తయారుచేసిన విగ్రహాలు (ఇక్కడి స్థానికులు 'ఐయనార్స్' అని పిలుస్తారు) మొదలైన వాటిని చూడవొచ్చు. ఈ విగ్రహాలను గ్రామదేవతలు గా భావిస్తారు. ఇక్కడ వారానికి ఒకసారి జరిగే జాతర పర్యాటకులు కన్నుల పండుగ గా ఆనందిస్తారు.

Photo Courtesy: Thamizhpparithi Maari

సుబ్రహ్మణ్య శివ స్మారక చిహ్నం

సుబ్రహ్మణ్య శివ స్మారక చిహ్నం

సుబ్రహ్మణ్య శివ, ధైర్యవంతుడైన యువ దేశభక్తుడు, ఇది అతని జ్ఞాపకార్ధం నిర్మించిన స్మారక చిహ్నం. ఇతను మదురై దగ్గర ఉన్న వాతాలగుండు అనే చిన్న పట్టణంలో 1884 లో జన్మించాడు మరియు తమిళనాడు యొక్క ప్రఖ్యాత విప్లవకారులలో ఒకరు మరియు స్వాతంత్ర్య సమరంలో చేరిన అనేక యువకులకు ఒక ప్రేరణ మరియు ప్రభావాన్ని చూపారు. అతను ఒక కవి మరియు పండితుడు. అతని పద్యాలు 'ఘన భాను' పేరున ప్రచురితమయ్యాయి. అతను మరణించిన తరువాత, పెన్నగ్రం తాలుకా లో అతని సమాధిలా గా ఈ స్మారక చిహ్నాన్ని కట్టారు.

 హోగేనక్కల్ ఎలా చేరుకోవాలి ??

హోగేనక్కల్ ఎలా చేరుకోవాలి ??

విమాన మార్గం ద్వారా

హోగేనక్కల్ దగ్గరలో 180 కి. మీ. దూరంలో బెంగళూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఉన్నది. ఇక్కడి నుంచి ఈ ప్రదేశానికి చేరుకోవటానికి ప్రైవేటు టాక్సీ ని అద్దెకు తీసుకొని వెళ్ళవొచ్చు.

రైల్ మార్గం ద్వారా

హోగేనక్కల్ చుట్టుపక్కల ఉన్న పెద్ద నగరాలకి రైల్ లైన్స్ జతచేయబడి ఉన్నా, ఈ గ్రామానికి రైలు ద్వారా చేరుకోలేము. ఈ గ్రామానికి 114 కి. మీ. అవతల సేలం రైల్వే స్టేషన్ ఉన్నది.

రోడ్ మార్గం ద్వారా

బస్సుల ద్వారా హోగేనక్కల్ సులభంగా చేరుకోవొచ్చు. 180 కి. మీ. అవతల ఉన్న బెంగళూరు నుండి రావాలనుకుంటే, 3 - 4 గంటలలో చేరుకోవొచ్చు మరియు చెన్నై నుండి అయితే 5-6 గంటలలో చేరుకోవొచ్చు. ఈ ప్రదేశం బస్సు మార్గానికి బాగా అనుసంధించబడింది. ఇది ధర్మపురి నుండి 50 కి. మీ, దూరంలో కలదు. ఇది భౌగోళికంగా తమిళనాడులో ఉంది కానీ, బెంగుళూరు నుండి వెళ్లడం సులభం.

Photo Courtesy: Naga k

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+