బెంగుళూరు నుండి ఒక్కరోజులో వెళ్ళి చూసి రాగలిగిన పర్యాటక ప్రదేశాలలో నందిహిల్స్, మాగడి అనే ప్రదేశాలు రెండు. వీటిలో నందిహిల్స్ బెంగుళూరుకు 62 కి.మీ. దూరంలో, చిక్కబలాపూర్ పట్టణం నుంచి కేవలం 10 కి.మీ వుంటుంది. బెంగళూరు చుట్టుప్రక్కల చాలా ప్రసిధ్ధి చెందిన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. టిప్పు సుల్తానుకు ఇది వేసవి కాలపు విడిదిగా వుండేదట! నంది దుర్గమని కూడా దీనికి పేరుందని తెలిసింది. కొండ పైనుంచి చుట్టూ సీనరీ చూడడానికి చాలా బాగుంటుంది. పైన గార్డెన్ చాలా బాగుంటుంది. ఈ కొండల నుండి అర్కావతి అనే నది పుట్టింది. ఈ రోజులకు తగినట్లుగా అన్ని రకాల సదుపాయాలు పైన వున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా, ఒక రోజు, మధ్యలో ఏమీ బోర్ ఫీల్ అవకుండా, చాలా కాలక్షేపంగా గడిచి పోతుంది ఇక్కడ!
ఇది సముద్ర మట్టం నుంచి 4,551 అడుగుల ఎత్తు లో వుంది. ఇది జాతీయ రహదారి -7 వద్ద దేవనహళ్లి నుంచి 20 కి.మీ వుంది. బెంగుళూరు విమానాశ్రయం కి అతి దగ్గరగా వున్నప్రదేశం. ఇక్కడి వాతావరణం ఊటి వలె చాలా చల్లగా వుండి హిల్ల్ స్టేషన్ ని తలపిస్తుంది. టూరిస్ట్ లకు చాలా ఆకట్టుకుంటుంది.
నంది హిల్స్ గురించి ఉన్న ప్రచారం
ఈ నంది కొండలు అనే పేరు ఎలా వచ్చింది గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. చోళుల కాలం లో దీన్ని ఆనంద గిరి అని పిలిచే వాళ్ళు. యోగి నందీశ్వరుడు ఇక్కడ తన ప్రాణాన్ని బలి ఇచ్చాడని అందువలననే ఈ కొండలకి ఆ పేరు వచ్చిందని ఇక్కడి ప్రజల నమ్మకం. నంది ని సాదారణం గా నంది దుర్గం (కోట) అని కూడా పిలుస్తారు. దీన్ని టిప్పూ సుల్తాన్ కట్టించాడు. కొందరు ఈ కొండలు నిద్రిస్తున్న నంది ఆకారంలో వుండడం వల్ల ఆ పేరు వచ్చిందని చెపుతారు.

నంది టెంపుల్
నంది హిల్స్ లో నంది దేవాలయం తప్పక దర్శించదగినది. దీనిని విజయనగర సామ్రాజ్య కాలంనాడు కెంపే గౌడ పాలనలో నిర్మించారు. ఈ యాత్రా స్ధలం నంది హిల్స్ దిగువ భాగంలో ఉండి యాత్రికులచే ఎంతో పవిత్ర స్ధలంగా పేర్కొనబడుతుంది. యోగనందీశ్వర మరియు భోగ నందీశ్వర విగ్రహాలు ఈ దేవాలయంలో ప్రధాన దేవతలు. ఈ నిర్మాణం హోయసలుల పాలనలో, చోళుల పాలనలో మరియు విజయనగర రాజుల పాలనలో విశిష్టమైన శిల్ప సంపదగా మలచబడింది. ఈ ప్రదేశం చేరిన భక్తులు ఒక దీపపు స్తంభం నంది టెంపుల్ ముందు భాగంలో నిర్మించటం గమనిస్తారు. ఈ దీపపు స్తంభ దీపాలను ప్రతిరోజూ వెలిగిస్తారు.
Photo Courtesy: ram reddy

టిప్పూ డ్రాప్
నంది హిల్స్ దర్శించే పర్యాటకులు 600 మీటర్ల ఎత్తున్న టిప్పూస్ డ్రాప్ అనే చిన్న కొండ భాగాన్ని చూస్తారు. చారిత్ర వాస్తవాల మేరకు ఈ కొండ అంచు ఖైదీలను శిక్షించేదిగా చెపుతారు. మరణ శిక్ష పడ్డ ఖైదీలు ఈ కొండపైనుండి క్రిందకు నెట్టివేయబడేవారు. ఈ ప్రదేశం నంది హిల్స్ పై భాగాన ఉంది. ఇక్కడినుండి పర్యాటకులు అందమైన పర్వత శ్రేణులు చూడవచ్చు. పర్యాటకులు టిప్పు డ్రాప్ నుండి కొన్ని ఏడ్పుల శబ్దాలు వింటారు. ఈ శబ్దాలు గతంలో అక్కడ మరణించిన ఖైదీలవని చెపుతారు.
Photo Courtesy: MrEccentric

టిప్పూ వేసవి విడిది
ఇది టిప్పూ సుల్తాన్ గెస్ట్ హౌస్. వేసవిలో ఇక్కడే వుండేవాడు. దీనిని చిక్కబల్లాపూర్ సామంత రాజులు కట్టించారు. టిప్పూ సుల్తాన్ దీన్ని శత్రు దుర్భేద్యమైన కోటగా తయారు చేశాడు. ఈ నిర్మాణం లో అధికంగా కలప ఉపయోగించారు. టవర్లు, ద్వారాలు అప్పటి శిల్ప శైలితో చక్కగా చెక్కబడ్డాయి. కోట సీలింగు, గోడలు పెయింటింగ్ లతో అలంకరించబడ్డాయి. కోటలో దాని అయిదు ఆర్చిలు, మినరెట్లు ఆకర్షణ. సందర్శకులకు దీనిలో ప్రవేశం లేదు కనుక సందర్శకులు కేవలం బయటినుండి మాత్రమే చూడవచ్చు.
Photo Courtesy: nandi hills

యోగ నందీశ్వర దేవాలయం
భక్త జన బాంధవుడు వెలసిన పరమ పవిత్రమైన క్షేత్రమే 'శ్రీ యోగ నందీశ్వర స్వామి' క్షేత్రం. బెంగుళూరు - బళ్లారి రోడ్డు మార్గంలో తారసపడే 'నంది హిల్స్' పై స్వామివారు 'యోగ నందీశ్వరుడు' పేరుతో కొలువుదీరి కన్పిస్తాడు. ఇక్కడ అమ్మవారు 'ముక్తాంబ' పేరుతో పూజలు అందుకుంటూ వుంటుంది. కొండపైకి చేరుకునే మార్గంలో భారీ బసవేశ్వరుడు దర్శనమిస్తాడు. భక్తితో ఆయనకి నమస్కరించుకుని కొండపైకి చేరుకోవాలి.
Photo Courtesy: Adhokshaja Achar

రహస్య మార్గం
ఈ దుర్గంలో శత్రువుల దాడినుండి రాజులు తప్పించుకోడానికి ఒక రహస్యమార్గాన్ని ఏర్పరిచారు. దీనిని చూస్తుంటే నాటి ఇంజినీరింగ్ టెక్నాలజీ ఎంత అద్భుతంగా ఉండేదో అర్ధమవుతుంది.
Photo Courtesy: Meena K

విశాలమైన కోనేరు
ఆనాటి రాజుల విశాలమైన మనసుకు అద్దం పడుతుంటుంది. ప్రకృతి ఒడిలో ఊయలలూగుతోన్న ఇక్కడి స్వామివారికి 'మహాశివరాత్రి' పర్వదినాన ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు.
Photo Courtesy: Anand

అమృత సరోవర్
ఎల్లపుడూ పారే సరస్సు అమృత సరోవర్ ను పర్యాటకులు తప్పక చూడాలి. ఈ నీటి సరస్సు ఎంతో అందంగా ఉంటుంది. ఈ ప్రదేశానికి నీటి సరఫరా దీని నుండే జరుగుతుంది. ఈ సరస్సులో నీరు సంవత్సరం పొడవునా ఉంటుంది. వెన్నెల రాత్రిలో సరస్సు లోని నీటి అలలు మెరుస్తూంటాయి. ఆ సమయంలో చూసి బాగా ఆనందించవచ్చు.
Photo Courtesy: psubhashish

బ్రహ్మాశ్రమం
ఈ ప్రాంతంలో బ్రహ్మాశ్రమం కూడా యాత్రికులు చూడవలసిన ప్రధాన క్షేత్రాలలో ఒకటి. వాస్తవానికి ఇది ఒక గుహ. సహజ రాళ్ళతో ఏర్పడినది. ఒకప్పుడు మత గురువులు రామక్రిష్ణ పరమహంస ఇక్కడ కూర్చొని కాళీ మాతను పూజించేవారని చెపుతారు. మతపర ప్రాధాన్యత కారణంగా, దాని సహజ నిర్మాణం కారణంగా ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందింది.
Photo Courtesy: Rameshng

గాంధీ హౌస్
నంది హిల్స్ కు వచ్చే పర్యాటకులు గాంధీ హౌస్ తప్పక చూడాలి. ఇది ఒకప్పుడు మహాత్మ గాంధీ నివాసంగా ఉండేది. కర్నాటక ప్రభుత్వం ప్రస్తుతం దీని నిర్వహణా భాధ్యత వహిస్తోంది. ప్రముఖ వ్యక్తులకు మాత్రమే దీనిలో వసతి కల్పిస్తారు.
Photo Courtesy: Paul Bolding

గుర్రాల మార్గం
దీనిని హార్‌స వే అంటారు. కోటకి ఈశాన్య భాగంలో నాటి సైనికులు గుర్రాల మీద నుంచి ఎగబాకడానికి సహాయకారిగా ఉండటం కోసం నిర్మించినట్టు ఇక్కడివారి విశ్వాసం.
Photo Courtesy: Renny Abraham

నరసింహ దేవాలయాలు
ఇక ఇక్కడ దేవాలయాలు భక్తికి, ఆధ్మాత్మికతకి నిలువుటద్దాలు. అందులో భోగనరసింహస్వామి ఆలయం, ఉగ్రనరసింహ దేవాలయం, యోగనరసింహ దేవాలయం లాంటివి మరెన్నో పురాతన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి.
Photo Courtesy: Madhurjya Baruah

గవి వీరభద్ర స్వామి గుడి
కొండ పైభాగాన గవి వీర భద్ర స్వామి టెంపుల్ వుంది. శిఖరాగ్రాన సుల్తాన్ పేట వెళ్ళే మార్గంలో టిప్పూ సుల్తాన్ ప్యాలెస్ వద్ద ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అతి పెద్ద బండరాళ్ళతో నిర్మించిన దేవాలయం గవి వీరభద్ర ఆలయం. ఇది అనేక కళా నైపుణ్యాలతో అలరారుతూవుంది.
Photo Courtesy: Gopinathp

పిల్లల ఆట స్థలం
ఇది హార్టీ కల్చర్ శాఖవారు పిల్లలకోసం ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న గార్డెన్. ఇందులో అనేక ఆట సదుపాయాలు సమకూర్చారు. ఇక్కడ ఎంతో వినోదంగా ఉంటుంది. ఇలాంటి పర్యాటక ప్రదేశాలు నందికొండల చుట్టు పక్కల చూడదగ్గవి ఎన్నో వున్నాయి. ఇటువంటి ప్రదేశాలు తిలకించడం వల్ల విజ్ఞానం, వినోదంతో పాటు చారిత్రక కాలం నాటి స్థితిగతులు, జీవన విధానం మనకి తెలుస్తాయి.
Photo Courtesy:Kanishka samrat

గర్భాలయం
గర్భాలయం లోని శివలింగం పరిమాణ రీత్యా చిన్నదే అయినప్పటికీ, అటు చారిత్రక వైభవాన్ని ... ఇటు ఆధ్యాత్మిక సంపదను కలిగివుంది. 11 వ శతాబ్దం నుంచి ఇక్కడి స్వామివారిని వివిధ రాజ వంశాలకు చెందిన రాజులు సేవించి తరించారు. ఆలయ అభివృద్ధిలో తమ వంతు పాత్రను పోషించారు. అప్పట్లో వారు చేపట్టిన రాతి నిర్మాణాలు ఈనాటికీ చెక్కుచెదరకుండా కనిపిస్తుంటాయి.
Photo Courtesy: Meena K

నెహ్రూ నిలయం
నందిహిల్స్ పర్యాటకులు బ్రిటీష్ శిల్ఫశైలి కల నెహ్రూ నిలయాన్ని తప్పక చూడాలి. ఈ బంగళా పేరు భారతదేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట పెట్టారు. ఆయన ఈ ప్రదేశంలో కొంత సమయం గడిపారు. అప్పటి మైసూర్ కమీషనర్ సర్ మార్క్ కబ్బన్ కెసిబి కూడా వేసవిలో ఈ బంగళాలో గడిపేవాడు. అంతేకాక, నెహ్రూ నిలయంలో 1986లో సార్క్ సమావేశాలు కూడా జరిగాయి.హోర్టి కల్చర్ శాఖ దీనిని ఒక గెస్ట్ హౌస్ గా మార్చింది. లోపలికి ఎవరికి ప్రవేశం లేదు. కాని యాత్రికులను మాత్రం లోపల కల అందమైన ఫొటోలను చూసేందుకు అనుమతిస్తారు.
Photo Courtesy: Vipul ji

ప్రశాంత వాతావరణం
నందిహిల్స్ బెంగళూరుకి 45 కి. మీ. దూరంలో ఉంది. అక్కడి టిప్పూ కోట లోకి వెళ్ళగానే ఒక చిన్న కొలను ఉంటుంది.. ఆ కొలను ఒంటరిగా బిక్కు బిక్కు మంతున్నట్టుగా ఉంటుంది. ఎవరు లేని ప్రదేశం అది.. ఏదో సినిమా షూటింగ్ కోసం లొకేషన్ లాగా ప్రశాంతంగా ఉంటుంది.. అక్కడ ఉన్న వాతావరణం చూసి మనం ఎక్కడో సుదూర ప్రాంతం లోకి వెళ్ళినట్టుగా అనుకుంటాం.. ఆ ప్రదేశం ఎంత ప్రశాంతంగా ఉంది అంటే అక్కడే ఎప్పటి నుంచి గూడు చేసుకున్న కోతులు కూడా నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుంటూ హాయిగా ఆ ప్రకృతిని ఆరాధిస్తున్నట్లు గా ఉంటాయి.
Photo Courtesy:Swapnil Sonawane

జాగ్రత్త
నంది హిల్స్ లో కోతులు చాలా ఎక్కువ చాలా చాలా జాగ్రత్త గా ఉండాలి.....ఇక ఫుడ్ కూడా పెద్దగా ఏం బాగోదు ...ఏమైనా వెంట తీసుకెళ్లటం ఉత్తమం..
Photo Courtesy: Brock Whittaker Photography

మాగడి
మాగడి అనే ఊరు బెంగుళూరుకు 40-45 కి.మీ. దూరంలో ఉంటుంది. ఈ ఊరు బెంగుళూరు వ్యవస్థాపకుడూ, నిర్మాత అయిన ‘కెంపె గౌడ' కి కొంత కాలం హెడ్‌క్వార్టర్స్ లాగా వుండినదని చెబుతారు. ఈ ఊరి చుట్టూ ‘కెంపె గౌడ' చేత నిర్మించబదిన కోటగోడ శిథిలాలు వూరులోకి ప్రవేశిస్తూండంగానే కనిపిస్తాయి. మాగడి లో శ్రీ రంగనాథ స్వామివారి దేవాలయం ప్రసిధ్ధి చెందినది. లోపల పూజలందుకుంటున్న దేవుడు - శ్రీనివాసుడు. ప్రతి సంవత్సరం ఏప్రెల్ నెలలో స్వామి వారి తిరునాళ్ళ, ఉత్సవాలు జరుగుతాయట! శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయ గోపురం చూడడానికి చాలా బాగుంటుంది. గుడి వెలుపల పెద్ద కోనేరు కూడా చాలా బాగుంటుంది. గుడి గోపురం, ఆలయం గోడల మీద, కోనేరు మెట్ల మీద వేసిన రంగులతో... ఈ మొత్తం సెట్టింగ్ చూడడానికి చాలా ఆకర్షణీయంగా కనబడుతుంది.
Photo Courtesy: Dineshkannambadi

ఎలా చేరుకోవాలి??
విమాన ప్రయాణం
నంది హిల్స్ కు చేరాలంటే, బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం సేవలనందిస్తుంది. ఇది నంది హిల్స్ కు 60 కి.మీ. ల దూరంలో ఉంది. ఐరోపా, ఆసియా, అమెరికా, మధ్య ప్రాచ్య దేశాల పర్యాటకులు దీని సేవలను వినియోగించవచ్చు.
రైలు ప్రయాణం
నంది హిల్స్ కు రైలు స్టేషన్ లేదు. చిక్కబల్లాపూర్ సమీప రైలు జంక్షన్. ఇది 9 కి.మీ. ల దూరంలో ఉంది. ఇక్కడనుండి టాక్సీలలో నంది హిల్స్ చేరవచ్చు. బెంగుళూరు రైలు స్టేషన్ ప్రధానంగా దేశంలోని అన్ని నగరాలకు కలుపబడి ఉంది. బెంగుళూరు స్టేషన్ నుండి చిక్కబల్లాపూర్ కు రైలు నడుస్తుంది.
రోడ్డు ప్రయాణం
ప్రభుత్వ బస్సులు బెంగుళూరు, నందిగ్రామ మరియు చిక్కబల్లాపూర్ ల నుండి నంది హిల్స్ కు చేరుస్తాయి. బెంగుళూరు నుండి రెండు గంటలు, లేదా చిక్కబల్లాపూర్ నుండి ఒక గంట సమయంలో బస్ లపై లేదా ఇతర వాహనాలపై నంది హిల్స్ చేరవచ్చు.
Photo Courtesy:Easa Shamih



Click it and Unblock the Notifications













