Search
  • Follow NativePlanet
Share
» »సోండా - అనేక మఠాలకు పుట్టినిల్లు !!

సోండా - అనేక మఠాలకు పుట్టినిల్లు !!

పర్యాటకులు సోండా పట్టణాన్ని ఎందుకు దర్శిస్తారు? ఇక్కడి దేవాలయం శ్రీ మహా విష్ణువు అవతారంగా చెప్పే త్రివిక్రమ భగవానుడిది. త్రివిక్రమ దేవుడి విగ్రహం ఎంతో బాగుంటుంది.

By Mohammad

సోండా లేదా సోడి అనేది ఒక దేవాలయాల పట్టణం మరియు వాదిరాజ మఠం కలిగి ఉంటుంది. ఈ ప్రదేశం కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది. సిర్సి పట్టణానికి దగ్గరగా ఉంది. సోండా సముద్ర మట్టానికి సుమారు 2000 మీటర్ల ఎత్తున ఉంది. 16వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు పాలించిన స్వాది రాజుల పాలనలో ఒక ప్రధాన పట్టణంగా విలసిల్లేది. శ్రీ వాదిరాజ ఇక్కడ ఒక మఠాన్ని స్ధాపించారు. శ్రీ మధ్వాచార్యుల ద్వైత సిద్ధాంతానికి నాంది పలికారు.

పర్యాటకులు సోండా పట్టణాన్ని ఎందుకు దర్శిస్తారు? ఇక్కడి దేవాలయం శ్రీ మహా విష్ణువు అవతారంగా చెప్పే త్రివిక్రమ భగవానుడిది. త్రివిక్రమ దేవుడి విగ్రహం ఎంతో బాగుంటుంది. బయటి ప్రాంగణంలో రాతి రధం పండుగల సమయంలో రధోత్సవానికి ఉపయోగిస్తారు. ఈ రాతి రధం లోపల శ్రీ మహాలక్ష్మీ మరియు త్రివిక్రముడు ఉంటారు. దేవాలయానికి ఉత్తర దిక్కుగా మఠ ప్రవేశంలో రాజంగన ఉంటుంది. దీనిని చేరాలంటే 24 మెట్లు దిగాలి. ఈ ప్రదేశంలో వంటగది, స్టోర్స్, పూజా మందిరం ఉంటాయి.

సోండా గ్రామంలో ఒక పురాతన కోట ఉంటుంది. అనేక పురాతన, చిన్న చిన్న ఫిరంగులుంటాయి. ఇక్కడ వాదిరాజ మఠమే కాక, రెండు ఇతర మఠాలు కూడా ఉంటాయి. ఇవి అకలంగ మఠం మరియు స్వర్ణవల్లి మఠంగా చెపుతారు. ఇక్కడే ఒక జైన మందిరం కూడా ఉంది. దేవాలయంలో వెంకటరమణ స్వామి ఉంటారు. చారిత్రక మరియు మతపర ప్రాధాన్యతతో కూడిన దేవాలయాలు, మఠాల కారణంగా సోండా లేదా సోడి తప్పక చూడదగిన ప్రదేశం.

శ్రీ త్రివిక్రమ దేవాలయం

శ్రీ త్రివిక్రమ దేవాలయం

చిన్న గ్రామమైన సోండాలో శ్రీ త్రివిక్రమ దేవాలయం ప్రధాన ఆకర్షణ. ఈ దేవాలయం రామ త్రివిక్రమ దేవరుకు అరసప్ప నాయక కట్టించారని దీని నిర్వహణలు బదరికాశ్రమ నుండి శ్రీ వాదిరాజ తీర్ధ కొరకు శ్రీ భూత రాజ నిర్వహిస్తారని చెపుతారు. గర్భగుడిలో త్రివిక్రమ విగ్రహం ఎంతో అందంగా నిలబడి ఉంటుంది.

చిత్రకృప : Sritri

హుణసేహోండా వెంకటరమణ దేవాలయం

హుణసేహోండా వెంకటరమణ దేవాలయం

ఈ దేవాలయంలో వెంకటరమణ మూర్తి విగ్రహం ఉంటుంది. సోండాలో ఈ దేవాలయం చిన్నది. అందమైన గోడల చెక్కడాలు చూచేందుకు ప్రతిరోజూ జరిగే ప్రార్ధనలకు ఈ దేవాలయానికి పర్యాటకులు వస్తారు.

ముత్తినకెరె బర్డ్ శాంక్చువరి

ముత్తినకెరె బర్డ్ శాంక్చువరి

ముత్తినకెరె పక్షుల సంరక్షణాలయం సోండా గ్రామంలో ప్రధాన ఆకర్షణలలో ఒకటి. ఈ శాంక్చువరి ముత్తినకెరె సరస్సు వద్ద ఉంది. వివిధ రకాల పక్షులు జూన్ నుండి అక్టోబర్ వరకు ఈ శాంక్చువరీకి వచ్చి సంతానోత్పత్తి చర్యలు చేపట్టి వెళతాయి.

చిత్రకృప : Nagesh Kamath

ముత్తినకెరె వెంకటరమణ దేవాలయం

ముత్తినకెరె వెంకటరమణ దేవాలయం

ముత్తినకెరె సరస్సు వద్ద గల ఈ దేవాలయాన్ని పర్యాటకులు తప్పక దర్శించాలి. ఈ చిన్న దేవాలయం 17వ శతాబ్దంలో నిర్మించబడి విజయనగర శైలి శిల్ప సంపద కలిగి ఉంటుంది.

చిత్రకృప : Ajaya.n.g

స్వర్ణవల్లి మఠం

స్వర్ణవల్లి మఠం

పర్యాటకులు హొన్నావల్లి మఠం గా చెప్పబడే స్వర్ణవల్లి మఠాన్ని సోండా వచ్చినపుడు తప్పక సందర్శిస్తారు. ఈ మఠాన్ని శ్రీ శ్రీ భాస్కరేంద్ర సరస్వతి అద్వైత వేదాంత స్ధాపకుడు ఆది శంకరాచార్యులవారి కోరికతో స్ధాపించారు.

Pc: telugu native planet

శివగంగ జలపాతాలు

శివగంగ జలపాతాలు

సోండా సందర్శించే పర్యాటకులు శివగంగ జలపాతాలు తప్పక చూడాలి. ఇవి షలమల నది నుండి పుడతాయి. ఈ జలపాతం 74 మీటర్ల ఎత్తునుండి ఒక లోతైన వ్యాలీలోకి పడుతుంది. ఇక్కడ ఎన్నో దట్టమైన అందమైన మొక్కలు కనపడతాయి. జలపాతానికి దగ్గరగా చిన్న గణేశ విగ్రహం దొరకటంచేత గణేశ్ పాల్ అనే ద్వీపం పెట్టబడింది.

చిత్రకృప : Sharath Venkatagiri

తపోవన

తపోవన

పర్యాటకులు ఇక్కడగల తపోవనాన్ని కూడా దర్శించవచ్చు. ఈ ప్రదేశాన్ని శ్రీ వాదిరాజ స్వామి తన ధ్యానానికి వినియోగించేవారు. ఇది వాదిరాజ మఠానికి 5 కి.మీ.ల దూరంలో షలమాల నది సమీపంలో ఉంది. తపస్సుకు అనువైన స్ధలం. తపోవనంలో శ్రీ వాదిరాజ స్వామి ప్రభువు హయగ్రీవుడి కొరకు ప్రార్ధించిన అనేక చిహ్నాలు కనపడతాయి.

చిత్రకృప : Sritri

వాదిరాజ మఠం

వాదిరాజ మఠం

సోండా పర్యాటకులు సోండాలో ప్రధాన ఆకర్షణ అయిన వాదిరాజ మఠం తప్పక చూడాలి. ఈ మఠం నలువైపులా పొడవైన కొండలు, దట్టమైన అడవులు, అందమైన పచ్చటి ప్రదేశాలు, ఒక నది ఉండి పర్యాటకులకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మరువలేని అనుభూతి నిస్తుంది.

చిత్రకృప : Prof tpms

సోండా ఎలా చేరుకోవాలి ?

సోండా ఎలా చేరుకోవాలి ?

సమీప విమానాశ్రయం : సోండా కు 111 కి.మీ. ల దూరంలో హుబ్లీ విమానాశ్రయం కలదు.

రైలు మార్గం : సోండా కు సమీపాన కుంటా రైల్వే స్టేషన్ కలదు.

బస్సు మార్గం : ఉడుపి, కుంటా, మంగళూరు తదితర ప్రాంతహలా నుండి సోండా కు పప్రభుత్వ/ప్రవేట్ బస్సులు వస్తాయి.

చిత్రకృప : Vaikoovery

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+