Search
  • Follow NativePlanet
Share
» »ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణ‌లోని ఈ ప్రాంతం బెస్ట్‌..!

ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణ‌లోని ఈ ప్రాంతం బెస్ట్‌..!

ఈ వీకెండ్‌లో కుటుంబంతో క‌లిసి స‌రాదాగా విహారాల‌కు వెళ్లాల‌నుకుంటున్నారా? అయితే, తెలంగాణ‌లోని ఈ ప్ర‌దేశం ఎంతో బెస్ట్ అని చెప్పుకోవ‌చ్చు. ఇది కేవ‌లం ఫ్యామిలీ ట్రిప్ మాత్ర‌మే కాదు. వేస‌వి విహారంగా కూడా ఉంటుంది. ఈ ప్రాంతం తెలంగాణ ఊటీగా ప్ర‌సిద్దిచెందింది. చ‌ల్ల‌ని ప్ర‌దేశాల‌న‌గానే దేశంలోని ప్ర‌సిద్ధిచెందిన ప్ర‌దేశాల పేర్లు చాలామందికి గుర్తుకొస్తాయి. అందుకే, విహార‌యాత్ర‌ల‌కు ఎక్క‌డెక్క‌డికో వెలుతుంటారు. కానీ, తెలంగాణ‌లోని, హైద‌రాబాద్ స‌మీపంలో ఉండే ఇలాంటి అంద‌మైన ప్ర‌దేశాల గురించి తెలుసుకోరు. కాబ‌ట్టి, ఈ వీకెండ్‌కు త‌ప్ప‌కుండా కుటుంబంతో క‌లిసి తెలంగాణ ఊటీగా ప్రసిద్దిచెందిన గొట్టంగుట్టకు వెళ్లాల్సిందే. ఇది మెదక్ జిల్లాలో ఉంది. ఇక్క‌డ సంద‌ర్శించేందుకు అనువైన ప్ర‌దేశాల‌ను చాలానే ఉన్నాయి. మ‌రెందుకాల‌స్యం ఆ ప్రాంత విశేషాలేంటో తెలుసుకుందాం ప‌దండి..

తెలంగాణ‌లోని ఈ ప్ర‌దేశం అతి త‌క్కువ మందికి మాత్ర‌మే తెలుసు. ఇది హైదరాబాద్ నుంచి సుమారు 130 కిలోమీటర్ల దూరం ఉంటుంది. గొట్టంగుట్ట ప్రాంతం గురించి చాలామంది ప‌ర్యాట‌కులకు అస్స‌లు తెలీనే తెలీదు. గొట్టంగుట్ట వెళ్లాలనుకునే వాళ్లు ముందుగా జహీరాబాద్ నుంచి ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. జహీరాబాద్ నుంచి గొట్టం గుట్ట సుమారు 30 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. ఒక‌వేళ ఇక్క‌డే ఓ రెండు మూడు రోజులు ఉండాల‌నుకుంటే మాత్రం ఇక్క‌డ ఎలాంటి వ‌స‌తి సౌక‌ర్యాలు లేవు. స‌మీపంలోని జహీరాబాద్లో బస చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి గొట్టంగుట్ట వెళ్లి ఒక్కరోజులోనే రావొచ్చు.

ooty3

రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు..

ప్ర‌కృతి ఒడిలో కాసేపు సేద‌తీరాలనుకునేవారు, ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో గ‌డ‌పాల‌నుకునేవారు త‌ప్ప‌కుండా ఈ ప్రాంతానికి వ‌స్తుంటారు. ఈ ప్ర‌దేశంలో చుట్టూ ఎటు చూసినా పచ్చని అందాలు ప‌ర్యాట‌కుల‌కు తార‌స‌ప‌డ‌తాయి. ఇక్క‌డికి వెళ్లాలంటే అడవి మ‌ధ్య‌లో ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. ఆ ప్ర‌యాణం ప‌ర్యాట‌కుల‌కు ఎన్నో మధురానుభూతుల్ని మిగులుస్తుంది. ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించేందుకు ఒక్క తెలంగాణ వాసులే కాకుండా ఏపీ, కర్ణాటక రాష్ట్రాల ప‌ర్యాట‌కులు వ‌స్తుంటారు. ఇది తెలంగాణ, క‌ర్ణాట‌క రాష్ట్రాల సరిహద్దులో ఉంటుంది.

chandragiridam

ఎన్నో పురాత‌న‌మైన దేవాల‌యాలు..

ఈ ప్ర‌దేశంలో అనేక పురాతనమైన దేవాలయాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ఈ ప్రాంతానికి వెళ్లే మార్గమధ్యంలో చించోలి అభయారణ్యంతో పాటు చిన్న చిన్న దేవాలయాలు భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తాయి. అందులో ముఖ్యంగా ఇక్క‌డ శివాలయం, విఘ్నేశ్వరాలయం, భవానీ మాత గుడి ప‌ర్యాట‌కుల‌కు కనిపిస్తాయి. వీటితో పాటు న‌దీ జ‌లాలు కూడా ప‌ర్యాట‌కులను ఆహ్మానిస్తుంటాయి. ఇక్క‌డికి స‌మీపంలో శ్రీ గురు గంగాధర బక్క ప్రభు దేవస్థానం ఉంది. ఇక్క‌డ భ‌క్తులు ప్రతీ శ్రావణమాసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తెలంగాణ నుంచే కాదు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా పర్యాటకులు పెద్దసంఖ్యలో ఇక్కడకు వస్తుంటారు. ఈ అడవిలో దేవాలయాలు ఉండడంతో దీన్నీ రెండో శ్రీశైలంగా కూడా ఇక్క‌డివారు చెబుతుంటారు.

chincholisanctuary1

సినిమా షూటింగ్‌ల‌కు ప్ర‌సిద్ధి..

గొట్టంగుట్ట నుంచి ప‌ది కిలోమీట‌ర్ల దూరంలో మల్కాపూర్ జలపాతం ఉంటుంది. గొట్టంగుట్ట వచ్చిన వాళ్లు తప్పక ఈ జ‌లపాతాన్ని సంద‌ర్శిస్తారు. ఈ జలపాతం చూపరులను ఎంత‌గానో ఆక‌ర్షిస్తుంది. ఈ ప్రాంతంలో లోతైన లోయలు, ఎత్తైన కొండలు ఉన్నాయి. ప్రతి శని, ఆదివారాలు పర్యాటకులు పెద్దసంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడికి దగ్గర్లో చంద్రగిరి డ్యామ్ కూడా ఉంది. విహార‌యాత్ర‌ల‌కు వెళ్లేవారు త‌ప్ప‌కుండా ఈ డ్యామ్‌క్‌ కూడా వ‌స్తుంటారు. ఇది సినిమా షూటింగ్‌ల‌కు కూడా ఎంత‌గానో ప్ర‌సిద్ధిచెందింది. ఈ ప్రాంతంలో అనేక సినిమా షూటింగులు కూడా జరుగుతుంటాయి. ఇది కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల స‌రిహ‌ద్దులో ఉండ‌డంతో అక్కడి ప్రజల భాష, జీవన విధానాలు ఎంతో ప్ర‌త్యేకంగా ఉంటాయి. వాటిని కూడా ప‌ర్యాట‌కులు తెలుసుకోవ‌చ్చు. ప‌చ్చ‌ని ప్ర‌కృతి అందాల‌కు ఈ ప్రాంతం పుట్టినిళ్లు అని చెప్పాల్సిందే. మ‌రెందుకాల‌స్యం మీరు కూడా ఈ వీకెండ్‌లో ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించేయండి మ‌రి..

More News

Read more about: medak telangana
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+