నేడు గుడ్ ఫ్రైడే ప్రతి సంవత్సరం ఈస్టర్ ఆదివారం ముందు శుక్రవారం జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఈస్టర్ ఆదివారం మార్చి 31న వస్తుంది. గుడ్ ఫ్రైడే ఈ ఏడాది మార్చి 29న జరుపుకుంటారు. శుక్రవారం సెలవు. శని-ఆదివారం ఎలాగో సెలవు కాబట్టి. ఈ మూడు రోజులు ఇంట్లో కూర్చుని బోర్ ఫీల్ అవ్వకుండా లాంగ్ వీకెండ్ ప్లాన్ చేసుకుంటే చాలు. అలా వెళ్లాలనుకుంటే దేశంలోని ఈ ప్రాంతాలకు ఎంతో ఉత్తమం అని చెప్పుకోవాలి. రోజువారీ బిజిలైఫ్ నుంచి ఉపశమనం పొందాలనుకునేవారు. తీరిక దొరికితే చాలు వీకెండ్ ట్రిప్‌కు ప్లాన్ చేయాలనుకునేవారికి ఈ ప్రదేశాలు ఎంతో ఉత్తమం.

ముక్తేశ్వర్
ముక్తేశ్వర్ భారతదేశంలోని ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలో ఉన్న ఒక అందమైన గ్రామం. ఇది ఒక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుంది. నైనిటాల్ నుండి 51 కిలోమీటర్లు, హల్ద్వానీ నుండి 72 కిలోమీటర్లు, ఢిల్లీ నుండి 343 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రదేశం ఉంది. ఇది 2171 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ముక్తేశ్వర్ కుమావోన్ కొండలలో వెలసింది. లాంగ్ వీకెండ్‌కు వెళ్లాలనుకునేవారు తప్పకుండా ఈ ప్రాంతాన్ని చుట్టేయాల్సిందే. రెండు మూడు రోజుల సెలవులను ప్రశాంతంగా అతితక్కువ తక్కువ బడ్జెట్‌లో గడపడానికి ముక్తేశ్వర్ ప్రదేశం ఎంతో ఉత్తమమైనది. ఈ ప్రదేశం ముఖ్యంగా అడ్వంచర్ ట్రిప్‌కు బెస్ట్. ఇక్కడకు రావడం ద్వారా రాపెల్లింగ్, రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్ వంటివాటిని ఆస్వాదించవచ్చు. వీటితో పాటు ఇక్కడ ప్రసిద్ధిచెందిన ఆలయాలు కూడా ఉన్నాయి.

పాలంపూర్
లాంగ్ వీకెండ్‌కు వెళ్లాలనుకునేవారికి పాలంపూర్ ఎంతో ఉత్తమమైన గమ్యస్థానం. హిమాచల్‌లో ఉన్న పాలంపూర్ చాలా అందమైన ప్రాంతం. ఇదిఒక బడ్జెట్ డెస్టినేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతపు అందాలను వీక్షించేందుకు రెండు మూడు రోజులు సరిపోతుంది. తేయాకు తోటలు చూడాలంటే దక్షిణ భారతదేశానికి వెళ్లనవసరం లేదు. పాలంపూర్ వచ్చి కూడా ఈ సుందర దృశ్యాన్ని వీక్షించవచ్చు. ట్రెక్కింగ్ ప్రియులకు ఈ ప్రాంతం ఎంతో అనువైనది. ఇక్కడికి సమీంలోని కరేరి సరస్సు ఎంతో ప్రసిద్ధిచెందింది. అంతేకాకుండా, బిర్‌లో పారాగ్లైడింగ్‌ను కూడా ఆస్వాదించొచ్చు.
తెహ్రీ
ఉత్తరాఖండ్‌లోని ధనౌల్తి నుండి కొన్నిగంటలు ప్రయాణంతో తెహ్రీ ని చేరుకోవచ్చు. ఈ ప్రదేశం స్నేహితులతో కలసి సరాదాగా గడిపేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడ అనేక సాహస కార్యకలాపాలను చేయొచ్చు. ఇక్కడ స్టేయింగ్ చేసేందుకు చాలామంది తేలియాడే గుడిసెలను ఎంపిక చేసుకుంటారు. ఇక్కడి ఆహ్లదకరమైన వాతావరణం పర్యాటకులను మాల్దీవులలో ఉన్న అనుభూతిలోకి చేరుస్తుంది. ధనౌల్తి నుండి తెహ్రీకి వెళ్లే మార్గంలో కూడా కనాటల్ ప్రాంతాన్ని సందర్శించొచ్చు.

గోషాల్
గుడ్‌ఫ్రైడే సందర్భంగా లాంగ్‌వీకెండ్‌కు వెళ్లాలనుకునేవారు తప్పకుండా గోషాల్‌ను సందర్శించండి. సిమ్లా-మనాలి సుదీర్ఘ వారాంతాల్లో ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతం. ఈ ప్రదేశం ఇక్కడి హోటళ్ల నుండి ఆహారం వరకు ప్రతిదీ ఎంతో ఖరీదుతో కూడుకున్నది. అటువంటి పరిస్థితిలో, తక్కువ బడ్జెట్ ఎంచుకునేవారు మనాలి ప్రాంతాన్ని ఎంచుకుంటే ఎంతో ఉత్తమం. ఇది పాత మనాలి నుండి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మంచుతో కప్పబడిన పర్వతాలు, యాపిల్ తోటలు ఈ గ్రామం యొక్క అందాన్ని మరింత పెంచుతాయి. ఇక్కడికి రావడం ద్వారా హిమాచల్ సంస్కృతిని మరింత దగ్గరగా చూసే అవకాశం లభిస్తుంది.



Click it and Unblock the Notifications














