Search
  • Follow NativePlanet
Share
» »ఒకేసారి 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని..

ఒకేసారి 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని..

ఒకేసారి 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని..

భార‌త‌దేశంలో అత్యంత సౌక‌ర్య‌వంతంగా, అతి త‌క్కువ ఖ‌ర్చుతో ప్ర‌యాణించే మార్గాలు రైలు మార్గాలు. ఎక్కువ మంది జాబితాలో ఉండే మార్గాల‌లో రైలు మార్గాలు ముందు వ‌రుస‌లో ఉంటాయి. ఇప్పుడు వాటిలో కూడా అత్యంత వేగ‌వంతంతో ప్ర‌యాణించే రైళ్లు కూడా వ‌చ్చాయి. అవే వందేభార‌త్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు. ఇవి గంట‌కు 180 కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణించ‌గ‌ల‌వు. వీటికి ప్ర‌జ‌ల్లో అత్యంత ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. త‌క్కువ స‌మ‌యంలో ప్ర‌యాణికుల‌ను వారి వారి గ‌మ్య‌స్థానాల్లో చేర్చ‌డం వీటి ప్ర‌త్యేక‌త‌.

ఈ ట్రైన్లు ప్రయాణికులకు అత్యంత అనువైన, సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణం కోసం రూపొందించినవి. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ తొలి ట్రైన్ 2019 ఫిబ్రవరి 15న ప్రారంభించారు. ఇప్ప‌టికే దేశంలో అన్ని ప్రాంతాల నుంచి ప్ర‌యాణించేలా వీటిని ప్రారంభించారు. ప్ర‌స్తుతం మ‌రోసారి ప్రధాని నరేంద్ర మోదీ ఒకేసారి మరో తొమ్మిది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 24వ తేదీన ఇందుకోసం ముహూర్తం కూడా ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది. రండి వాటి గురించి విశేషాల‌ను తెలుసుకుందాం.

1

34కి చేరిన సంఖ్య‌..

ఇప్పటికే దేశవ్యాప్తంగా 25 మార్గాల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాకపోకలు కొన‌సాగుతున్నాయి. ఇక, కొత్తగా అందుబాటులోకి వచ్చే ఈ తొమ్మిది రైళ్ల‌ను క‌లిపితే మొత్తం వాటి సంఖ్య 34 కి చేరనుంది. ఇప్పటివరకు లాంచ్ అయిన అన్ని వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగానే ప్రారంభోత్సవం జ‌రిగిన‌వే. ఇక‌, కొత్త‌గా ప్రారంభం కానున్న ఈ తొమ్మిది రైళ్లను కూడా ఈ నెల 24న ప్రధాని మోదీనే వాటికి పచ్చ జండా ఊపి ప్రారంభించనున్నారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన కోచ్‌లను ఈ తొ్మ్మిది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల కోసం వినియోగిస్తున్నట్టు రైల్వే శాఖ తమ ప్రకటనలో స్పష్టంచేసింది.

2

ప్రధాని కొత్తగా ప్రారంభించనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల మార్గాలను ఒక‌సారి చూద్దాం

హైదరాబాద్ - బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ,

విజయవాడ - చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ,

కాసరగోడ్ - త్రివేండ్రం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ,

పూరి - రూర్కెలా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ,

ఉదయపూర్ - జైపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ,

రాంచీ - హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ,

తిరునెల్వేలి - చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ,

పాట్నా - హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ,

జామ్‌నగర్ - అహ్మదాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు.

రెండు రాష్ర్టాల‌కు ఒక్కో రైలు..

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాకపోకలు రెండూ కలిపి మొత్తం 50 మార్గాలను కవర్ చేస్తూ 25 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు దేశవ్యాప్తంగా రైలు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. అయితే ఇప్పటికే కేరళ, ఒడిషా రాష్ట్రాల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు సేవలు అందిస్తుండగా కొత్తగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న ఈ తొమ్మిది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలోనూ రెండు రాష్ట్రాలకు ఒక్కో రైలు చొప్పున కేటాయించారు. అందులో ఒకటి కేరళలో కాసరగోడ్ - త్రివేండ్రం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కాగా, మరొకటి ఒడిషాలో పూరి - రూర్కెలా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మార్గాల్లో సేవలు అందించనున్నాయి. ఇక‌, ప్ర‌యాణికులు అత్యంత వేగంగా వారి వారి గ‌మ్య‌స్థానాల‌ను చేరుకోవ‌చ్చు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+