Search
  • Follow NativePlanet
Share
» »ఆధ్యాత్మిక చ‌రిత్ర‌కు పేరుగాంచిన రామేశ్వరం విశేషాలివే..

ఆధ్యాత్మిక చ‌రిత్ర‌కు పేరుగాంచిన రామేశ్వరం విశేషాలివే..

భారతదేశంలో రాముడికి సంబంధించిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వాటిలో రామేశ్వరం అత్యంత ప్రసిద్ధిచెందిన ప్రదేశం. ఈ ప్ర‌సిద్ధి పుణ్యక్షేత్రం త‌మిళ‌నాడులో ఉంది. శ్రీ‌రాముడు ఇక్కడ శివున్ని పూజించాడ‌నే న‌మ్మ‌కం ఉంది. అందుకే ఈ ప్రాంతాన్ని రామేశ్వ‌రం అని పిలుస్తార‌ని నానుడి. దీనిని పాంబన్ వంతెన అని కూడా పిలుస్తారు. దీని దగ్గరే శ్రీరాముడు లంక ఎక్కేందుకు ఒక వంతెన నిర్మించిన‌ట్లు ఆన‌వాళ్లు కూడా ఉన్నాయి. ధనుష్కోడి అని పిలువబడే ఈ ప్రదేశంలో నేటికీ దాని అవశేషాలు మ‌నం చూడొచ్చు. దీనిని కేవ‌లం మ‌త‌ప‌ర‌మైన వ్య‌క్తులు మాత్ర‌మే సంద‌ర్శించ‌డం కాదు, పురాతన భవనాల నిర్మాణంపై ఆసక్తి ఉన్నవారు కూడా ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించొచ్చు. ఇది నిత్యం భ‌క్తుల‌తో రద్దీగా ఉంటుంది.

రామేశ్వరం భారతదేశంలోని అద్భుతమైన సంస్కృతిని కలిగి ఉన్న ప్రదేశం. ఇది ఆధ్యాత్మిక ప్రేమికుల‌ను ఆక‌ర్షించ‌డ‌మే కాకుండా, ప్ర‌కృతి ప్రేమికుల‌ను కూడా ఇట్టే ఆక‌ట్టుకుంటుంది. పురాతన భారతదేశంలోని ఆలయ పట్టణాలు, బీచ్‌లను చూడటానికి ఇష్టపడితే త‌ప్ప‌కుండా రామేశ్వరం సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడి అందాలు ప‌ర్యాట‌కుల‌న్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఇక్కడి ప్ర‌త్యేక ఆకర్షణల గురించి తెలుసుకుందాం ప‌దండి.

pambanbridge

రామేశ్వరంలో చూడదగ్గ ప్రదేశాలు ఇవే..

రామనాథస్వామి దేవాలయం

రామనాథస్వామి దేవాలయం ఇక్కడ అత్యంత ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవాలి. ఇది శివుని పవిత్రమైన పన్నెండు జ్యోతిర్లింగ దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ రెండు శివలింగాలు ఉంటాయి. అవి రాంనాథ్ మరియు విశ్వాంతర్. శ్రీరాముడు ఇక్కడ శివుడిని పూజించాడ‌ని ఇక్క‌డివారి ప్ర‌గాఢ విశ్వాసం. రామనాథస్వామి ఆలయం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం ద్వీపంలో ఉంది. ఇక‌, ఈ ఆలయంలోని ఆకర్షణీయమైన అంశాలలో మ‌రొఒకటి "సేతు కరై" లేదా తేలియాడే రాయి అని పిలువబడే ఒక ప్రత్యేకమైన రాయి. హిందూ ఇతిహాసం రామాయణం ప్రకారం, శ్రీరాముడు శ్రీలంకకు వంతెనను నిర్మించడానికి ఈ రాళ్లనే ఉపయోగించాడ‌ని చెబుతారు.

ఈ ఆలయం 1,212 స్తంభాలతో ఉంటుంది. ఈ స్తంభాలు రామేశ్వరం ఆలయం యొక్క బలమైన పునాదికి దోహ‌ద‌ప‌డ‌తాయి. ఈ స్తంభాలలో ప్రతి ఒక్కటి అద్భుతమైన, కళాత్మకమైన హిందూ శిల్పాలతో చెక్కబడి ఉంటుంది. ఇంకా, ఈ స్తంభాల ఎత్తు 30 అడుగులు, దాని పొడవు 6.9 కిలోమీటర్ల ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన ఆలయ కారిడార్‌గా పరిగణించబ‌డింది. ఇంకా ఈ ఆల‌యంలోని మ‌రో విశేష‌త ఏంటంటే ఆలయం లోపల, 108 పవిత్రమైన శివలింగాలు ఉంటాయి. ప్రతి ఒక్కటి శివుని విభిన్న‌మైన రూపాన్ని సూచిస్తాయి.

పాంబన్ వంతెన

ఇది భారతదేశపు మొదటి సముద్ర వంతెనగా చెబుతారు. రామేశ్వరం చేరుకోవడానికి ఇదొక్కటే మార్గం. పాంబన్ వంతెనను 1914లో నిర్మించారు. అప్ప‌టి నుంచి 2010 లో ముంబయిలోని సీ లింక్‌ను నిర్మాణం జ‌రిగేట‌ప్ప‌టికీ, ఇది భారతదేశంలోనే అతి పొడవైన సముద్ర వంతెనగా పేరుగాంచింది. ఈ ప్రాంతానికి రైలు లేదా రోడ్డు మార్గంలో ప్ర‌యాణించేట‌ప్ప‌డు, రెండు వైపులా విస్తరించి ఉన్న సముద్రం యొక్క అందమైన, అద్భుత‌మైన దృశ్యాల‌ను చూడొచ్చు.

abdulkalam house

అబ్దుల్ కలాం నివాసం

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆజాద్ ఇల్లు కూడా రామేశ్వ‌రంలోనే ఉంటుంది. అతని సోదరుడి కుటుంబం ఇప్పటికీ ఇక్కడే నివసిస్తోస్తూ ఉంది. ఆయ‌న ఇంట్లోని కొంత భాగాన్ని మ్యూజియంగా మార్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌డు ఆ మ్యూజియాన్ని ప‌ర్యాట‌కుల సంద‌ర్శ‌నార్థం తెర‌చి ఉంచుతారు. ఇందులో క‌లాం జీవితానికి సంబంధించిన విషయాలు ల‌భిస్తాయి. ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ మ్యూజియాన్ని సంద‌ర్శించొచ్చు.

gulfofmannarmarinenationalpark1

గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్

రామేశ్వరం నుండి టుటికోరిన్ ద్వీపం వరకు మెరైన్ నేషనల్ పార్క్ ఉంది. మన్నార్ గల్ఫ్ యునెస్కో బయోస్పియర్ రిజర్వ్. ఈ రిజర్వ్ సముద్ర జీవవైవిధ్యానికి ఎంతో పేరుగాచింది. నాలుగు వేలకు పైగా జాతుల సముద్ర వృక్షజాలం, జంతుజాలం ​​దీనిని మరింత ప్రత్యేకం చేయ‌డంలో దోహ‌ద‌ప‌డుతుంది.

More News

    Read more about: rameswaram tamil nadu
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+