Search
  • Follow NativePlanet
Share
» »రామేశ్వరం - ఒక యాత్రా స్థలం !

రామేశ్వరం - ఒక యాత్రా స్థలం !

హిందువులకు ప్రముఖ యాత్రా స్థలం అయిన రామేశ్వరం శైవులకు , వైష్ణవులకు కూడా పవిత్రమినదే. రామేశ్వరం చారిత్రక పంబన్ ద్వీపం లో ఒక భాగంగా వుంది.రామేశ్వరం శ్రీలంక కు సమీపంగా వుంటుంది.

హిందువులకు ప్రముఖ యాత్రా స్థలం అయిన రామేశ్వరం శైవులకు , వైష్ణవులకు కూడా పవిత్రమినదే. రామేశ్వరం చారిత్రక పంబన్ ద్వీపం లో ఒక భాగంగా వుంది. ఇండియన్ ద్వీపాలలో కల రామేశ్వరం భారత దేశానికి పంబన్ బ్రిడ్జి చే కలుపు బడి వుంది. రామేశ్వరం శ్రీలంక కు సమీపంగా వుంటుంది. రామేశ్వరం లో రామనాథ స్వామి టెంపుల్ ప్రధాన దేవాలయం. ఈ టెంపుల్ చార్ ధం యాత్రా లో ఒక భాగంగా వుంటుంది.భారత దేశంలో దొరికిన ఆనవాళ్ల మేరకు, శ్రీరాముడు ఇక్కడ అనేక రోజులు గడిపాడు. సీతను లంక నుండి తీసుకు వచ్చేందుకు తన ప్రణాళికలలో భాగంగా ఈ పంబన్ బ్రిడ్జి ని ప్రణాళిక చేసాడు. శ్రీరాముడు కొంత కాలం ఇక్కడ నివసించటం వలన రామేశ్వరం ఒక యాత్రా స్థలంగా ప్రసిద్ధి చెందినది.

దక్షినాది కాశి క్షేత్రం

దక్షినాది కాశి క్షేత్రం

హిందువులు తమ పవిత్ర యాత్రా స్థలం కాశి కి వెళతారు. అయితే, కాశి కి వెళ్లి వచ్చినవారు రామేశ్వరం కూడా సందర్శించాలని లేకుంటే, కాశి వెళ్ళిన ఫలితం ఉండదని చెపుతారు. రామేశ్వరం చుట్టుపక్కల సుమారు 64 పవిత్ర కొలనులు కలవు. ఇవి ఈ యాత్రా స్థలానికి మరింత పవిత్రతలను చేకూరుస్తున్నాయి.

రామనాథ స్వామి టెంపుల్

రామనాథ స్వామి టెంపుల్

రామేశ్వరం లో ప్రధాన ఆకర్షణ రామనాథ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ ప్రధాన దేవుడు శివ భగవానుడు. ఈ దేవాలయం 12 వ శతాబ్దానికి చెందినా పాండ్య వంశ రాజులచే నిర్మించబడింది. అద్భుత శిల్ప సంపద కల ఈ ప్రాసాదంలో 1212 స్తంభాలు కలవు.

ఆడమ్స్ బ్రిడ్జి

ఆడమ్స్ బ్రిడ్జి

పంబన్ ద్వీపం లోని సున్నపు రాయి కొతార్ల వరుసలు మరియు మన్నార్ ద్వీపం లను ఆడమ్స్ బ్రిడ్జి గా చెపుతారు. దీనిని గతంలో రామ సేతు అనే వారు. చారిత్రక ఈ బ్రిడ్జి ని శ్రీరాముడు తన వానర సైన్యం తో నిర్మించాడు. ఈ బ్రిడ్జి గురించి ఒక బ్రిటిష్ కార్తో గ్రాఫర్ పెర్కొనతంవలన దీనిని ఆడమ్స్ బ్రిడ్జి అంటారు.

పంబన్ బ్రిడ్జి

పంబన్ బ్రిడ్జి

పంబన్ బ్రిడ్జి ఇండియా లో పొడవైన బ్రిడ్జి లలో రెండవది. పంబన్ బ్రిడ్జి, భారత ప్రధాన భూభాగాన్ని రామేశ్వరం తో కలుపుతుంది. ఈ బ్రిడ్జి పొడవు 2.3 కి. మీ. లు. రైల్వే బ్రిడ్జి 1914 సంవత్సరంలోనే ప్రజలకు నిర్వహనలోనికి వచ్చింది.

ఉత్తిరాకోసమంగాయి

ఉత్తిరాకోసమంగాయి

పాండ్య రాజులు నిర్మించిన దేవాలయాలలో ఉతిరాకోసమంగాయి ఒక దేవాలయం. రామనాథపురం సమీపంలో కల ఈ టెంపుల్ లో శైవ ప్రాధాన్యత కలదు. ఈ టెంపుల్ లో అందంగా పచ్చ లతో చెక్కబడిన ఒక పురాతన నటరాజ విగ్రహం వుంటుంది. టవున్ లలోని టెంపుల్స్ ఆనితి లోకి దీనికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.

ధనుష్కోడి ధనుష్కోడి

ధనుష్కోడి ధనుష్కోడి

ధనుష్కోడి ద్వీపం యొక్క దక్షిణ భాగం చివరలో కలదు. ధనుష్కోడి లో కోదండరామ స్వామి టెంపుల్ కలదు. ఈ ప్రదేశం ఇండియా లోని ఘోస్ట్ టవున్ ల లో ఒకటిగా పేరొందినది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+