Search
  • Follow NativePlanet
Share
» »హాట్ ఎయిర్ బెలూన్ విహ‌రానికి అర‌కు సిద్ధమైంది..!

హాట్ ఎయిర్ బెలూన్ విహ‌రానికి అర‌కు సిద్ధమైంది..!

శీతాకాల‌పు మంచు పొర‌లు క‌మ్మేస్తున్నాయి.. ప‌చ్చ‌ని ప్ర‌కృతి అందాలు రార‌మ్మ‌ని ఆహ్వ‌నిస్తున్నాయి. ఆకాశాన్నంటే కొండ‌కోన‌లు ప‌ర్యాట‌కానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. ఈ మ‌నోహ‌ర దృశ్యాల‌ను మేఘాల‌ను తాకుతూ హాట్ ఎయిర్ బెలూన్‌పై ద‌గ్గ‌ర‌గా ఆస్వాదించాల‌నుకునేవారికి ఇదొక గొప్ప అవ‌కాశం. ఇదెక్క‌డో విదేశాల్లో అని ఆలోచిస్తున్నారా...? వెంట‌నే మీ ఆలోచ‌న‌ల‌ను మ‌నసులోంచి తీసేయండి.. ఎందుకంటే, ఈ సాహ‌స ప‌ర్యాట‌క క్రీడ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌సిద్ధ ప‌ర్యాట‌క ప్రాంతం అర‌కులో ముస్తాబ‌వుతుంది. మ‌రెందుకాల‌స్యం అక్క‌డి స‌రికొత్త ప‌ర్యాట‌క ప్ర‌ణాళిక‌ల‌ను మ‌నము తెలుసుకుందామా..?

సాహ‌స క్రీడ‌..

రాష్ట్రంలోని అర‌కు ప్రాంతం ఎప్పుడూ ప‌ర్యాట‌కుల‌తో సంద‌డి చేస్తోంది. ఇక్క‌డికి వ‌చ్చే ప‌ర్యాట‌కుల కోసం స‌రికొత్త అనుభ‌వాన్ని అందించేందుకు పాడేరు ఐటీడీఎ అధికారులు చ‌ర్య‌లు తీసుకున్నారు. ఆంధ్ర ఊటీగా ప్ర‌సిద్దిచెందిన అర‌కులోయ‌లోని ప‌ద్మాపురం ఉద్యాన‌వ‌నంలో సాహ‌స క్రీడ‌ను ప‌ర్యాట‌కుల‌కు అందించేందుకు అధికారులు కొత్త‌గా హాట్ ఎయిర్ బెలూన్‌ను ప్రారంభించారు. అర‌కు ప‌ర్యాట‌క ప్రాంతానికి నిత్యం ప‌ర్యాట‌కుల సంద‌డి ఎక్కువ‌గా ఉంటుంది. ఇక్క‌డికి ప్ర‌తి సంవ‌త్స‌రం సుమారు రెండు ల‌క్ష‌ల మంది వ‌స్తుంటారు. ఈ క్ర‌మంలోనే అర‌కు లోయ‌ను మ‌రింత విభిన్నంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇక్క‌డ నూత‌నంగా ఏర్పాటు చేసిన హాట్ ఎయిర్ బెలూన్‌తో పాటు మ‌రికొన్ని సాహాసక్రీడ‌ల‌ను కూడా ప‌ర్యాట‌కుల కోసం అందుబాటులోకి తీసుకరానున్నారు.

300 అడుగుల మేర..

అర‌కులోయలో పారా మోట‌ర్ గ్లైడింగ్‌ల‌ను కూడా అధికారులు ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపారు. వీటితో పాటు ప‌ద్మాపురం ఉద్యాన‌వ‌నంలో రాత్రి ప‌దిగంట‌ల వ‌ర‌కు టూరిస్టులు ఉండేందుకు వీలుగా విద్యుత్ దీపాల వెలుగుల‌ను విస్త‌రించేందుకు అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు. హాట్‌ ఎయిర్ బెలూన్‌‌ను టూరిస్టుల‌ కోసం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ మేరకు అధికారుల ట్రయల్‌రన్‌ని నిర్వహించారు. ఈ హాట్‌ ఎయిర్ బెలూన్ పర్యాట‌కుల‌ను సుమారు 300 అడుగుల మేర పైకి తీసుకువెళ్లి మళ్లీ కిందకి దించుతుందని అధికారులు తెలిపారు.

hot-air-balloon

లేజర్‌ లైటింగ్..

వీటితోపాటు కొత్తవలస వ్యవసాయ ప్రదర్శన క్షేత్రంలో త్వరలోనే పారా గ్లైడింగ్‌ని ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. పద్మాపురం ఉద్యానవ‌నంలో కొత్త ఐలవ్‌ అరకు హోర్డింగ్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. వీటితోపాటు పార్క్‌లో ఫ్ల‌డ్‌ లైట్లు, రోప్‌ లైట్లు, హెడ్‌ లైట్‌లను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యానవ‌నంలో జపనీస్‌ ఆర్చ్, వివిధ గార్డెన్‌లలో నేమింగ్‌ బోర్డుల‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ప‌ర్యాట‌కుల సౌక‌ర్యార్థం కాలి మార్గాన్ని అందుబాటులోకి తెస్తామని అధికారులు తెలిపారు. కొత్తపల్లి జలపాతం దగ్గర లేజర్‌ లైటింగ్, కాలిబాటవంటి సౌక‌ర్యాల‌ను కూడా క‌ల్పించ‌నున్నారు. కొత్తపల్లి, కొత్తవలస జలపాతాలను చాపరాయిలా మరింత అభివృద్ధి చేస్తామని అధికారులు అన్నారు.

araku balllon festival

బొటానికల్‌ గార్డెన్ ఏర్పాటు..

మరోవైపు పద్మాపురం ఉద్యాన‌వనాన్ని బొటానికల్‌ గార్డెన్ లా ఏర్పాటు చేయ‌నున్నారు. పద్మాపురం గార్డెన్‌లో ఎన్నో రకాల అరుదైన మొక్కలు ఉన్నాయి. వీటన్నింటి ప్రాముఖ్యతను వివరించే విధంగా బోర్డులను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు. అరకు ప్రాంతానికి నవంబర్ నెల నుంచి పర్యాటకుల‌ తాకిడి ఎక్కువ‌గా ఉంది. ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ తాకిడి కొనసాగుతుంది. అందుకే పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ఇప్పుడు హాట్ ఎయిర్ బెలూన్, పారా గ్లైడింగ్ వంటివి ఏర్పాటు చేయనున్న‌ట్లు అధికారులు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+