Search
  • Follow NativePlanet
Share
» »ఈ గుడిని సందర్శిస్తే మోక్షమే?

ఈ గుడిని సందర్శిస్తే మోక్షమే?

జైనులకు అత్యంత పవిత్రమైన ప్రాంతం ఈ సావిర కంబద బసది. దీని చరిత్రను తెలుసుకొందాం

కర్నాటకలోని రేవు పట్టణం మంగళూరు సుమారు 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న మూడబిదరిలో ఒక ప్రఖ్యాత దేవాలయం ఉంది. ఈ దేవాలనిర్మాణం తెలంగాణలోని రామప్ప దేవాలయాన్ని పోలి ఉంటుంది. ఈ దేవాలయంలో 8 అడుగుల జైన తీర్థాంకరుడైన చంద్రప్రభనాథుడికి వైభవంగా పూజలు చేస్తారు. చరిత్ర పక్రకారం ఈ దేవాలయాన్ని క్రీస్తుశకం 1430లో నిర్మించినట్లు తెలుస్తోంది. దేశ విదేశాల్లోని జైనులు జీవితంలో ఒక్కసారైనా ఈ త్రిభువన తిలక చూడామనిని చూడాలని భావిస్తారు. తద్వారా తమ జీవితం సార్థకమైనట్లు భావిస్తారు. ఈ త్రిభువన తిలక చూడామని లేదా సావిర కంబద బసదిని సందర్శించడం వల్ల మరో జన్మ ఉండదని ముక్తి లభిస్తుందని చెబుతారు. గత ఐదేళ్లుగా క్రూయిజ్ నౌకలో మంగళూరుకు వచ్చే యాత్రికుల సంఖ్య పెరుగుతోంది. దరిమిల మూడబిదిరికి ఇప్పుడిప్పుడే విదేశాల్లో కూడా ఆదరణ పెరుగుతోంది. మూడబిదిరికి వచ్చేవారు ఇక్కడికి దగ్గర్లో ఉన్న వేణూరుకు తప్పక వెలుతారు.

సావిర కంబద బసది, మూడబిదిరి

సావిర కంబద బసది, మూడబిదిరి

P.C: You Tube

త్రిభువన తిలక చూడామని, లేదా చంద్రనాథ దేవాలయాన్నే సావర కంబద బసది అని పిలుస్తారు. ఈ దేవాలయంలో 8 అడుగుల జైన తీర్థాంకరుడైన చంద్రప్రభనాథుడికి వైభవంగా పూజలు చేస్తారు. చరిత్ర పక్రకారం ఈ దేవాలయాన్ని క్రీస్తుశకం 1430లో నిర్మించినట్లు తెలుస్తోంది.

సావిర కంబద బసది, మూడబిదిరి

సావిర కంబద బసది, మూడబిదిరి

P.C: You Tube

కఠిన శిలతో నిర్మించడం వల్ల ఈ దేవాలయం అనేక విపత్తులను తట్టుకొందని చెబుతారు. ఈ దేవాలయ నిర్మాణానికి మొత్తం 31 సంవత్సరాలు పట్టిందని చరిత్ర చెబుతోంది. అదే విధంగా ఈ దేవలయం మూడు దశల్లో నిర్మితమైంది.

సావిర కంబద బసది, మూడబిదిరి

సావిర కంబద బసది, మూడబిదిరి

P.C: You Tube

మొదటి దశలో దేవాలయ గర్భగుడిని అందులో మూలవిరాట్ అయిన చంద్రనాథ్‌ని నిర్మించారు. అటు పై ఈ దేవాలయంలో ఒక ప్రత్యేకమైన ప్రార్థనా మందిరాన్ని నిర్మించారు. ఈ ప్రార్థినామందిరంలో మనం అద్భుతమైన శిల్పాలతో కూడిన స్తంభాలను చూడవచ్చు.

సావిర కంబద బసది, మూడబిదిరి

సావిర కంబద బసది, మూడబిదిరి

P.C: You Tube

భారతీయ సంప్రదాయాలకు అద్ధం పట్టే ఎన్నో శిల్పాలు ఈ స్తంభాల పై ఉన్నాయి. ఈ ప్రార్థనామందిరంలోనే వెయ్యి స్తంభాలు ఉన్నాయి. ఇన్ని స్తంభాలు ఉన్నా ఏ ఒక్కటీ మరో స్తంభాన్ని పోలి ఉండదు. ఇదే ఇక్కడ విశేషం.

సావిర కంబద బసది, మూడబిదిరి

సావిర కంబద బసది, మూడబిదిరి

P.C: You Tube

ఇక చివరిదైన మూడోదశలో అత్యంత ఎత్తైన ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 60 అడుగుల ఎత్తు ఉన్న ఈ ధ్వజస్తంభాన్ని ఏకశిలతో నిర్మించడం విశేషం. జైన సంస్క`తి సంప్రదాయాలను తెలిపే అనేక కుడ్య చిత్రాలను కూడా ఈ ఆలయ ప్రధాన గోడల పై మనం చూడవచ్చు.

సావిర కంబద బసది, మూడబిదిరి

సావిర కంబద బసది, మూడబిదిరి

P.C: You Tube

అనేక ఏళ్లు గడిచినా ఈ కుడ్య చిత్రాలు తమ ప్రభావాన్ని కోల్పోకపోవడం గమనార్హం. హిందువులకు కాశీ క్షేత్రం ఎంతటి ప్రాముఖ్యం కలిగినదో మూడబిదరిలోని ఈ త్రిభువన తిలక చూడామని జైనులకు అంత ప్రాముఖ్యం కలిగినది.

సావిర కంబద బసది, మూడబిదిరి

సావిర కంబద బసది, మూడబిదిరి

P.C: You Tube

దేశ విదేశాల్లోని జైనులు జీవితంలో ఒక్కసారైనా ఈ త్రిభువన తిలక చూడామనిని చూడాలని భావిస్తారు. తద్వారా తమ జీవితం సార్థకమైనట్లు భావిస్తారు. ఈ త్రిభువన తిలక చూడామని లేదా సావిర కంబద బసదిని సందర్శించడం వల్ల మరో జన్మ ఉండదని ముక్తి లభిస్తుందని చెబుతారు.

సావిర కంబద బసది, మూడబిదిరి

సావిర కంబద బసది, మూడబిదిరి

P.C: You Tube

ఈ మూడబిదరిలోని సావిర కంబద బసిదిని దక్షిణ జైన కాశీ అని పేర్కొంటారు. ఇక్కడికి వచ్చిన జైన మునుల్లో చాలా మంది కనీసం నెల రోజులైనా ఈ సావిర కంబద బసదిలో గడుపుతారు. ఈ సావిర కంబద బసదితో పాటు గురు బసది, కోటిశెట్టి బసది, విక్రమశెట్టి బసది మొదలైన 18 దేవాలయాలు ఉన్నాయి.

సావిర కంబద బసది, మూడబిదిరి

సావిర కంబద బసది, మూడబిదిరి

P.C: You Tube

ఇందులో అత్యంత ప్రాచీనమైన బసది గురు బసది. దీనిని క్రీస్తుశకం 714లో నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ దేవాలయాలన్నీ దగ్గరదగ్గరగా ఉండటం వల్ల మూడు గంటల్లోపు ఈ దేవాలయాలన్నీంటినీ చూడటానికి వీలవుతుంది.

సావిర కంబద బసది, మూడబిదిరి

సావిర కంబద బసది, మూడబిదిరి

P.C: You Tube

ఇక గురుబసదిలో వందల కోట్ల రుపాయల విలువచేసే 52 విగ్రహాలు ఉన్నాయి. ఇందులో కొన్నింటిని దొంగలు ఎత్తుకుపోయారు. ఇక ఈ గురుబసదిలో 3.5 మీటర్ల పార్శ్వనాథ విగ్రహం కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్శిస్తోంది.

సావిర కంబద బసది, మూడబిదిరి

సావిర కంబద బసది, మూడబిదిరి

P.C: You Tube

ఈ గురుబసదిలో దాదాపు 12, 13 శతాబ్దాలకు చెందిన తాళపత్రగ్రంధాలను భద్రపరచబడ్డాయి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ దేవాలయానికి ప్రభుత్వం మరింత ప్రాచూర్యం కల్పించాల్సిన అవసరం ఉంది.

సావిర కంబద బసది, మూడబిదిరి

సావిర కంబద బసది, మూడబిదిరి

P.C: You Tube

ఇక్కడికి వచ్చే విదేశీయుల్లో దాదాపు 90 శాతం మంది మూడబిదిరికి వచ్చి ఈ సావిర కంబద బసదిని తప్పక సందర్శిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఈ ప్రాంతం విదేశీ పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది.

సావిర కంబద బసది, మూడబిదిరి

సావిర కంబద బసది, మూడబిదిరి

P.C: You Tube

గత ఐదేళ్లుగా క్రూయిజ్ నౌకలో మంగళూరుకు వచ్చే యాత్రికుల సంఖ్య పెరుగుతోంది. దరిమిల మూడబిదిరికి ఇప్పుడిప్పుడే విదేశాల్లో కూడా ఆదరణ పెరుగుతోంది. మూడబిదిరికి వచ్చేవారు ఇక్కడికి దగ్గర్లో ఉన్న వేణూరుకు తప్పక వెలుతారు.

సావిర కంబద బసది, మూడబిదిరి

సావిర కంబద బసది, మూడబిదిరి

P.C: You Tube

ఇక్కడ కూడా అతి ఎత్తైన గోమఠేశ్వరుడి విగ్రహం ఉంది. మంగళూరు నుంచి మూడబిదిరి 32 కిలోమీటర్లు. అదే విధంగా బెంగళూరు నుంచి మూడబిదిరి 400 కిలోమీటర్లు. ఇక ప్రముఖ పర్యాటక కేంద్రం ఉడిపి నుంచి మూడబిదిరికి చేరుకోవడానికి 55 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

సావిర కంబద బసది, మూడబిదిరి

సావిర కంబద బసది, మూడబిదిరి

P.C: You Tube

మంగళూరుతో పాటు బెంగళూరు, ఉడిపి నుంచి మూడ బిదరికి బస్సు సర్వీసులు ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మంగళూరుకు విమానాలు, రైళ్లద్వార చేరుకుంటే అక్కడి నుంచి ట్యాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+