Search
  • Follow NativePlanet
Share
» »వామ్మో ...ఇసుకతో చేసే బొమ్మలా ?

వామ్మో ...ఇసుకతో చేసే బొమ్మలా ?

మీరు కనుక ఇండియా లోని తూర్పు భాగంలో కల ఓడిశా రాష్ట్రం సందర్శిస్తే, అక్కడి దేవాలయాల పట్టణం పూరి లో గల బీచ్ విహారాలు చేసినట్లైతే, అక్కడ కల బ్రహ్మాండమైన ఒక ఇసుక తో నిర్మించిన పెద్ద పాలస్ లేదా ఒక అందమైన జలకన్య తన వంపు సొంపులు ప్రదర్శిస్తూ మిమ్మల్ని మంత్ర ముగ్ధులను చేస్తుంది. అదే ఇసుక కళ లేదా సాండ్ ఆర్ట్. ఇండియా లోని ఒక గొప్ప ఆర్ట్. కళ ఉచితం అని చెప్పబడిన మాటలు ఇక్కడ ఇసుకతో తయారు చేసిన సుందరమైన బొమ్మలు చూస్తె తప్పక నిజం అనిపిస్తాయి. చిత్రకారుడు ఒక బొమ్మ వేయాలంటే, ఎంతో ఖరీదైన వస్తువులు సమకూర్చుకోవాలి. కాని ఈ ప్రదేశంలోని సైకత కళ లేదా ఇసుకతో బొమ్మలు చేయటం ఎట్టి వ్యయం లేని బీచ్ లో కల ఇసుక, సముద్రంలోని నీటితో చేయబడుతోంది.

సుందరమైన బొమ్మలు

సుందరమైన బొమ్మలు

ఇసుక కళ లేదా సాండ్ ఆర్ట్. ఇండియా లోని ఒక గొప్ప ఆర్ట్. కళ ఉచితం అని చెప్పబడిన మాటలు ఇక్కడ ఇసుకతో తయారు చేసిన సుందరమైన బొమ్మలు చూస్తె తప్పక నిజం అనిపిస్తాయి.

ఒరిస్సా ప్రత్యేకత

ఒరిస్సా ప్రత్యేకత

ఈ సాండ్ ఆర్ట్ ఎప్పటి నుండి చేయబడుతోందో ఎవరికీ తెలియదు. ఇండియా లో ఓడిశా లో ఈ కళ ఒక ప్రత్యేకత.

ఫోటో క్రెడిట్ : Os Rúpias

స్వామీ జగన్నాథ మహిమ

స్వామీ జగన్నాథ మహిమ

ఒడిష లోని ఈ సాండ్ ఆర్ట్ గురించిన ఒక ఆసక్తి కర గాధ కూడా కలదు. ఒడిషా రాష్ట్రంలో 14 వ శతాబ్దంలో బలరాం దాస్ అనే ఒక కవి ఉండేవాడు. ఆయన భగవంతుడు జగన్నాథ్ స్వామికి గొప్ప భక్తుడు. వార్షిక రధ యాత్ర లలో ఆయనకు జగన్నాధుడి రధం ఎక్కాలని అనిపించేదట. అయితే, అతడు తక్కువ కులం వాడు కావటం వలన పూజారులు అతనిని అనుమతించక పోగా, అతడిని అవమానించి, పంపి వేస్తారు.

ఇసుక తయారీ బొమ్మలు

ఇసుక తయారీ బొమ్మలు

ఎంతో నిరాశ చెందిన ఈ భక్తుడు సముద్ర తీరానికి వెళ్లి స్వామీ జగన్నాదుడి , దేవి సుభద్ర, లార్డ్ బలభద్ర ల బొమ్మలను ఇసుకతో తయారు చేసి, వాటిని పూజిస్తాడు. అతని నిర్మలమైన భక్తికి మెచ్చిన ఈ ముగ్గురు దేముళ్ళు, తమ రధాలను వదిలి, యాత్ర నుండి బయటికి వచ్చి సముద్రపు ఒడ్డున తమ చిత్రాలను పూజిస్తున్న బలరామ దాస్ కు దర్శనమిస్తారు.

కొత్త రకాల పబ్లిసిటీ

కొత్త రకాల పబ్లిసిటీ

ఆసక్తి కరమైన ఈ చారిత్రక గాధ కు సాక్ష్యాలు లేనప్పటికీ, ఓడిశా ప్రజలు ఎంతో కాలం నుండి అభ్యసించే ఈ సాండ్ ఆర్ట్ దిన దినాభి వృద్ధి చెందుతోంది. టూరిజం అభివృద్ధి కావటం, కొత్త రకాల పబ్లిసిటీ రావటం, ఇసుకతో శిల్పాలు చేయటం అనే ఈ కళ సుదర్శన్ పట్నాయక్ అనే ఒక గొప్ప కళాకారుడి చే దేశంలో గుర్తించబడింది.

 ఓపెన్ ఎయిర్ లెర్నింగ్ స్కూల్

ఓపెన్ ఎయిర్ లెర్నింగ్ స్కూల్

1995 లో పట్నాయక్ చే మొదలు పెట్టబడిన ఈ ఇసుక బొమ్మల కళ దిన దినాభివృద్ధి చెంది నేడు, ప్రపంచ వ్యాప్త అంశాలైన ఉగ్రవాదం, భౌగోళిక ఉష్ణోగ్రత ల వంటివి కూడా చేయబడుతున్నాయి. ఈ కళాకారుడు ఒక సాండ్ ఆర్ట్ సంస్థను నిర్వహిస్తున్నాడు. ఇది ఒక ఓపెన్ ఎయిర్ లెర్నింగ్ స్కూల్. సరిగ్గా, పూరి బీచ్ లో వుంటుంది. ఒక సాండ్ నిర్మాణం చేయాలంటే, కొంత సమయం పడుతుంది, మరియు ఇసుక ఎప్పటికపుడు రాలిపోవటం వలన ఈ కళ అతి తక్కువ మందిచే అభ్యసిన్చబడుతోంది. అయితే, దీని ప్రాధాన్యత మాత్రం గ్లోబల్ స్థాయి కి ఎదిగింది. ఈ సాండ్ ఆర్ట్ బొమ్మల పోటీలు ప్రపంచ స్థాయి లో కూడా నిర్వహించ బడుతున్నాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+