Search
  • Follow NativePlanet
Share
» »ఢిల్లీలోని మెహ్రౌలీ ఆర్కియోలాజికల్ పార్క్‌ను సంద‌ర్శిద్దామా..?

ఢిల్లీలోని మెహ్రౌలీ ఆర్కియోలాజికల్ పార్క్‌ను సంద‌ర్శిద్దామా..?

దేశ రాజ‌ధాని ఢిల్లీని హృదయాల నగరం అంటారు. దేశ రాజధాని అయినందున, ఢిల్లీలో పరిపాలనా భవనాలకు కొరత లేదు. ఇక్క‌డి ప్రతి భవనపు నిర్మాణం ఇత‌ర భ‌వన నిర్మాణాల కంటే ఉన్న‌తంగా ఉంటుంది. మరోవైపు, ఢిల్లీ మొఘలుల నుండి మహాభారత కాలం వరకు వివిధ సంఘటనలకు సాక్షిగా నిలుస్తుంది. ఈ కారణంగా, దాని చారిత్రక ప్రాముఖ్యత కూడా చాలా ఎక్కువ‌గానే ఉంటుంది. ఢిల్లీ అనేది ఆధునికతతో కలగలిసిన చరిత్ర మిశ్రమమ‌ని చెప్పుకోవాలి.

ఇక్క‌డ ప్ర‌సిద్ధిచెందిన ప్ర‌దేశాలు ఎన్నో ఉన్నాయి. ఢిల్లీకి ద‌క్షిణం వైపున మెహ్రౌలీ ఆర్కియాలజికల్ పార్క్ ఉంది. ఇది భారతదేశ చరిత్ర మాత్రమే కాకుండా ఢిల్లీ నగర చరిత్ర గురించి కూడా ప‌ర్యాట‌కుల‌కు వివ‌రిస్తుంది. ఈ శీతాకాలపు సాయంత్రాన కుటుంబంతో క‌లిసి ఎక్కడికైనా వెళ్లాలని భావిస్తే, మెహ్రౌలీ పురావస్తు పార్క్ ఎంతో అనువైన ప్రదేశమ‌నే చెప్పుకోవాలి. ఢిల్లీకి వచ్చే యాత్రికులెవరైనా మెహ్రౌలీ పురావస్తు ఉద్యానవనాన్ని సందర్శించకుండా వారి యాత్ర‌ను పూర్తి చేయలేరు.

mehrauliarchaeologicalpark

మెహ్రౌలీ ఆర్కియోలాజికల్ పార్క్ అంటే ఏమిటి?

మెహ్రౌలీ పురావస్తు ఉద్యానవనం ఒక భారీ కాంప్లెక్స్‌లో విస్తరించి ఉన్న ప్రాంతం. ఇందులో ఒకప్పుడు ఢిల్లీ సింహాసనంపై కూర్చున్న అన్ని రాజవంశాలకు సంబంధించిన సావనీర్‌లు ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీ సుల్తానేట్‌పై మొఘలుల పాలన స్థాపించబడిన తర్వాత మాత్రమే మెహ్రౌలీ ప్రాంతం ఇక్క‌డ ఎంత‌గానో అభివృద్ధి చెందింది. నేటికీ, ఈ ప్రాంతంలో అనేక అద్భుతమైన వాస్తుశిల్ప ఉదాహరణలు ఉన్నాయి. వీటిని చూసేందుకు పర్యాటకులు త‌ర‌లి వ‌స్తుంటారు.

మెహ్రౌలీ ఆర్కియోలాజికల్ పార్క్ యొక్క ప్రధాన ఆకర్షణలు

కుతుబ్ మినార్

కుతుబ్ మినార్, ఢిల్లిలోని ప్ర‌ధాన ప‌ర్యాట‌క ప్రాంతం. ఇది మెహ్రౌలీ ప్రాంతంలో ఉంది. ఈ మినార్ నిర్మాణాన్ని 13వ శతాబ్దంలో కుతుబుద్దీన్-ఐబక్ ప్రారంభించారు. కుతుబుద్దీన్ ఐబక్‌ను ఢిల్లీ సుల్తానేట్ స్థాపకుడు అని కూడా పిలుస్తారు. ఇది ఈ రోజు ఢిల్లీకే కాకుండా భారతదేశానికి కూడా గుర్తింపుగా ప్రసిద్ధి చెందిన నిర్మాణంగా పేరుగాంచింది. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో కూడా చేర్చబడింది.

కువాతుల్-ఇస్లాం మసీదు

కుతుబ్ మినార్‌కు ఆనుకొని ఉన్న ఖువాతుల్-ఇస్లాం మసీదు భారతదేశంలో నిర్మించిన పురాతన మసీదులలో ఒకటిగా చెప్పుకోవ‌చ్చు. ఈ మసీదు నిర్మాణం హిందూ-ఇస్లామిక్ వాస్తుశిల్పం నుండి ప్రేరణ పొందింది. కుతుబ్ మినార్‌కు వచ్చే ప్రతి పర్యాటకుడు ఖచ్చితంగా ఈ మసీదును ఒకసారైనా సందర్శించాల్సిందే.

mehrauliarchaeologicalpark1

ఇనుప స్తంభం

మెహ్రౌలీ ఆర్కియోలాజికల్ పార్క్‌లోని ఇనుప స్తంభం ఒక అద్భుతమనే చెప్పుకోవాలి. వేల సంవత్సరాలుగా చ‌రిత్ర క‌లిగిన ఈ ఇనుప స్తంభం ఇప్ప‌టికీ తుప్పు పట్టలేదు. ఈ స్తంభంపై గుప్త రాజవంశం చక్రవర్తి చంద్రగుప్త II గౌరవార్థం సంస్కృతంలోని శ్లోకాలు కూడా ఉన్నాయి.

మొఘలుల సమాధులు

మెహ్రౌలీ ఆర్కియోలాజికల్ పార్క్‌లో బాల్బన్ సమాధితో సహా అనేక మంది మొఘల్ పాలకుల సమాధులు కూడా ఉన్నాయి. వీటితో పాటు, ఇల్తుమిష్ సమాధి కూడా ఇక్కడ ఉంది. ఈ సమాధిని ఎంతో అందంగా నిర్మించారు. దీనితో పాటు, జమాలి కమలి మసీదు సంక్లిష్ట నిర్మాణాలు మరియు దాని అద్భుతమైన వాస్తుశిల్పం కూడా ఇక్కడ పర్యాటకులను ఎంత‌గానో ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రదేశాన్ని మొఘల్ వారసత్వ సంపద అని పిల‌వొచ్చు.

మెహ్రౌలీ ఆర్కియాలజికల్ పార్క్ ఏడాది పొడవునా పర్యాటకులకు తెరిచి ఉంటుంది. ఈ చారిత్రక ప్రదేశం ప్రాముఖ్యతను లోతుగా అర్థం చేసుకోవాలనుకునే వారికి, టూర్ గైడ్ సౌకర్యం కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. ఢిల్లీని సంద‌ర్శించాల‌నుకునే వారు త‌ప్ప‌కుండా మెహ్రౌలీ పురావస్తు పార్కును సందర్శించడం మర్చిపోవద్దు. ఢిల్లీలోని మెహ్రౌలీ ఆర్కియాలజికల్ పార్క్ శీతాకాలంలో సూర్యరశ్మిని ఆస్వాదిస్తూ చరిత్ర వీధుల్లో షికారు చేయడానికి సరైన ప్రదేశమ‌నే చెప్పుకోవాలి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+