Search
  • Follow NativePlanet
Share
» »పంద్రాగ‌స్టు పండుగ వేళ బెంగుళూరులోని ఫ్ల‌వ‌ర్ షోను వీక్షిద్దామా..?

పంద్రాగ‌స్టు పండుగ వేళ బెంగుళూరులోని ఫ్ల‌వ‌ర్ షోను వీక్షిద్దామా..?

బెంగుళూరులో సంద‌ర్శించేందుకు అనువైన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. అయితే, స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా సిలికాన్ సిటిని సంద‌ర్శించాల‌నుకుంటే మాత్రం ఇక్క‌డ ప‌ర్యాట‌కుల కోసం కొత్త‌గా ఫ్ల‌వ‌ర్ షోను ఏర్పాటు చేశారు. ఈ ఫ్ల‌వ‌ర్ షోను వీక్షించేందుకు ప‌ర్యాట‌కులు చాలామంది ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చేస్తున్నారు. ఇంత‌కీ ఈ ఫ్ల‌వ‌ర్ షో ఎక్క‌డ నిర్వ‌హించారు. దాని విశేషాలేంటో ఇప్ప‌డు తెలుసుకుందాం.

అంబేద్కర్ సేవ‌లను వివ‌రిస్తూ..

సిలికాన్ సిటిగా పేరొందిన బెంగళూరుకు నిత్యం టూరిస్టులు సంద‌ర్శిస్తూనే ఉంటారు. అయితే ప్రతి ఏటా ఇక్క‌డ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్‌లో విభిన్నమైన థీమ్‌తో ఫ్లవర్ షోను నిర్వహిస్తారు. ఇక‌, ఈ ఏడాది కూడా ఈ ఫ్ల‌వ‌ర్ షో ప్రారంభ‌మైంది. లాల్‌బాగ్ గార్డెన్‌లో నిర్వ‌హించే ఫ్ల‌వ‌ర్ షోలో వివిధ రకాల పువ్వుల‌ను ఎంతో అందంగా అలంక‌రిస్తారు. ఇక‌, ఈ ఏడాది రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి అందించిన సేవ‌ల గురించి వివ‌రించేలా ఫ్ల‌వ‌ర్ షోను నిర్వ‌హిస్తున్నారు. ఈ సంవ‌త్స‌రం సుమారు 12 లక్షల మందికి పైగా సందర్శకులు వస్తారని అధికారులు భావిస్తున్నారు. రండి.. ఈ ఫ్ల‌వ‌ర్ షో గురించి పూర్తి వివ‌రాలు తెలుసుకుందాం.

pandragastufestival2

ప‌ది రోజుల ప్ర‌ద‌ర్శ‌న‌...

ఈ ఏడాది నిర్వ‌హిస్తున్న ఈ ఫ్ల‌వ‌ర్ షో లో మొత్తం 27 లక్షల రకాల పువ్వులను ఉపయోగిస్తున్నారు. పుష్ప ప్ర‌ద‌ర్శ‌న ఈ నెల (ఆగస్టు) 8వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఉండ‌నుంది. మొత్తం ప‌ది రోజుల‌పాటు ఈ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. ఇక‌, ఈ కార్యక్రమంలో మొత్తం 85 రకాల వార్షిక పువ్వులతో పాటు 27 రకాల సమశీతోష్ట పువ్వులు కూడా ఉండ‌నున్నాయి. పుష్ప ప్ర‌ద‌ర్శ‌న‌కు సుమారు 28 కోట్ల రూపాయ‌ల వరకు ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. లాల్‌బాగ్ గార్డెన్ గురించి మాట్లాడుకుంటే ఈ గార్డెన్‌లో అనేక ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. అందులో ఒక‌టి ఇందులో ఉండే గ్లాస్ హౌస్‌. ఇది ఎంతో అద్భుతంగా ఉంటుంది.

ఈ గ్లాస్ లండ‌న్‌లోని ప్ర‌సిద్ధ ప్యాలెస్‌లా ఉంటుంది. ఇందులో అనేక ర‌కాల మొక్క‌లు ఉంటాయి. ఈ మొక్క‌ల‌తో ప్ర‌తి సంవ‌త్స‌రం రెండు పెద్ద పుష్ప ప్ర‌ద‌ర్శ‌న‌ ఉంటుంది. ఈ గార్డెన్‌లో కేవ‌లం పుష్ప ప్ర‌ద‌ర్శ‌న మాత్ర‌మే కాదు. అంద‌మైన స‌ర‌స్సు కూడా ఉంది. ఈ స‌ర‌స్సులోని ప‌క్షులు ప‌ర్యాట‌కుల‌కు సాద‌ర ఆహ్వానం ప‌లుకుతాయి. ప్ర‌కృతి ప్రేమికుల‌కు ఈ ప్రాంతం స్వ‌ర్గ‌ధామ‌మ‌నే చెప్పాలి.

pandragastufestival1

వీరికి ఉచిత ప్ర‌వేశం..

ఈ లాల్‌బాగ్ పుష్ప ప్ర‌ద‌ర్శ‌నను చూడాలనుకునే ప‌ర్యాట‌కులకు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పర్యాటకులకు అనుమతి ఉంటుంది. ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లో వెళ్లేందుకు పెద్ద‌ల‌కయితే రూ.80, పిల్లల‌కు రూ.30, స్కూల్ డ్రస్సులో వచ్చే విద్యార్థుల‌కు ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. వీరితో పాటు ప‌న్నెండు సంవత్సరాలలోపు చిన్నారులకు ఉచిత ప్రవేశం. లాల్‌బాగ్ ఫ్లవర్ షో చూసేందుకు ఉత్త‌మ స‌మ‌యం ఉద‌యం. ఈ స‌య‌మంలో ఇక్క‌డి వాతావ‌ర‌ణం ఎంతో ఆహ్లాద‌భ‌రితంగా ఉంటుంది. అంతేకాదు ఉద‌యం వేళ్ల సంద‌ర్శ‌కుల తాకిడి కూడా త‌క్కువ‌గా ఉంటుంది. ప్ర‌శాంతంగా అన్ని ర‌కాలను పువ్వుల‌ను చూడొచ్చు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+