Search
  • Follow NativePlanet
Share
» »శని శింగనాపూర్ అడ్డు తొలగింది, కాని శబరిమలలో ఇంకా

శని శింగనాపూర్ అడ్డు తొలగింది, కాని శబరిమలలో ఇంకా

శబరిమల దేవస్థానానికి , శని శింగనాపూర్ కు మధ్య ఉన్న సంబంధం గురించి.

భారత దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా శబరిమల కు సంబంధించిన వార్తా కథనాలు చాలా మంది ఆసక్తిగా చదువుతున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. మహిళలకు రుతుస్రావం ఉంటుంది కాబట్టి కన్నెస్వామి అయిన అయ్యప్ప కొలువై ఉన్న శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్నవారిని అనుమతించబోమని చెబుతారు. అయితే సుప్రీం కోర్టు ఇటీవల ఈ నిబంధన చెల్లదని తీర్పు చెప్పింది. ఈ తీర్పుకు, శబరిమల, శని శింగనాపూర్ కు మధ్య ఉన్న సంబంధానికి సంబంధించిన కథనంతో పాటు శని శింగనాపూర్ పుణ్యక్షేత్రం వివరాలు మీ కోసం...

శని శింగనాపూర్

శని శింగనాపూర్

P.C: You Tube

భారత దేశంలో చాలా క్షేత్రాల్లో మహిళలకు ఇప్పటికీ ప్రవేశం లేదు. కాని కొంతమంది కోర్టుకు వెళ్లి ఆ అడ్డంకులను తొలగించుకొంటున్నారు. అటువంటి వాటిలో శని శింగనాపూర్. ఇక్కడ దేవాలయంలోకి వెళ్లి మహిళలు గతంలో తైలాభిషేకాలు చేయడానకి అనుమతించేవారు కాదు.

శని శింగనాపూర్

శని శింగనాపూర్

P.C: You Tube

అయితే సుప్రీం కోర్టు నేపథ్యంలో మహిళలు నేరుగా వెలుతున్నారు. అయితే ఈ తీర్పు వచ్చిన కొత్తలో కొంతమంది మహిళలే ఈ తీర్పు పై అసంత`ప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కూడా శబరిమల దేవాలయంలోకి కొంతమంది మహిళలు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు.

శని శింగనాపూర్

శని శింగనాపూర్

P.C: You Tube

అయితే మరికొంతమంది మహిళలు అడ్డుకొంటున్నారు. కేవలం శబరిమల లోనే కాకుండా సుప్రీం కోర్టు తీర్పు పై కేరళతో పాటు దేశ వ్యాప్తంగా అసంత`ప్తి వినిపిస్తోంది. ముఖ్యంగా మహిళలే ఈ తీర్పును వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఫలితం ఎలా ఉంటుందనేది సమీప భవిష్యత్తులో తెలియనుంది.

శని శింగనాపూర్

శని శింగనాపూర్

P.C: You Tube

ఇక శని శింగనాపూర్ మహారాష్ట్రలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీ నుంచి కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ క్షేత్రంలో ప్రధాన దైవం శని మహాత్ముడు. భారత దేశంలో ఉన్న అతి తక్కువ శని దేవాలయాల్లో ఈ శని శింగనాపూర్ పుణ్యక్షేత్రం శిఖర స్థానంలో ఉంటుంది.

శని శింగనాపూర్

శని శింగనాపూర్

P.C: You Tube

భారత దేశంలో ఎక్కడా లేనట్లు ఇక్కడ శనిమహాత్ముడు స్వయంభువుగా చెబుతారు. నల్లని రాతి విగ్రహం. ఈ విగ్రహం ఏ కాలానికి చెందినది చెప్పడానికి వీలుకావడం లేదు.

శని శింగనాపూర్

శని శింగనాపూర్

P.C: You Tube

అయితే స్థానికుల కథనం మేరకు కలియుగం ప్రారంభం నుంచి ఈ రాతి విగ్రహం ఈ శని శింగనాపూర్ ప్రాంతంలో ఉందని తెలుస్తోంది. స్థానికంగా వినిపించే కథనం ప్రకారం పూర్వం ఓ గొర్రెల కాపరి చేతికర్ర తగలి ఈ రాయి నుంచి రక్తం స్రవించింది.

శని శింగనాపూర్

శని శింగనాపూర్

P.C: You Tube

దీంతో పల్లె మొత్తం భయబ్రాంతులకు గురయ్యింది. ఆ రోజు రాత్రి స్వామివారు కలలో కనిపించి తాను శనీశ్వరుడినని ఇక్కడ స్వయంభువుగా వెలిశానని చెబుతాడు. అంతేకాకుండా తనకు దేవాలయం వద్దు అని, ఆరు బయట ఉంటానని కూడా చెబుతారు.

శని శింగనాపూర్

శని శింగనాపూర్

P.C: You Tube

అందువల్లే ఇప్పటికీ ఈ క్షేత్రం ఎంత అభివ`ద్ధి చెందినప్పటికీ ఇక్కడి శనీశ్వరుడికి మాత్రం దేవాలయం నిర్మించలేదని చెబుతారు. అంతేకాకుండా శనివారం మాత్రం ఈ విగ్రహానికి తైలాభిషేకం జరుపుతారు.

శని శింగనాపూర్

శని శింగనాపూర్

P.C: You Tube

దీనిని భక్తులు స్వయంగా చేయవచ్చు. ఇందుకోసమే సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడకు ప్రతి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇలా నేరుగా తైలాభిషేకం చేయడం లవల్ల శని, కాలసర్ప దోషాల నుంచి దూరంగా ఉండవచ్చునని భక్తుల నమ్మకం.

శని శింగనాపూర్

శని శింగనాపూర్

P.C: You Tube

ఈ తైలాభిషేకాలు చేయడానికే కొంతమంది మహిళలు సుప్రీం కోర్టు ద్వారా ప్రత్యేక అనుమతులు తీసుకువచ్చారు. ప్రస్తుతం మహిళలు నేరుగా ఆ శనిమహాత్ముడికి ఈ శని శింగనాపూర్ లో తైలాభిషేకాలు చేస్తున్నారు.

శని శింగనాపూర్

శని శింగనాపూర్

P.C: You Tube

అంతేకాకుండా ఈ ఊరిలో ఏ ఇంటికిగాని, ప్రభుత్వకార్యాలయాలకు గాని తలుపులు ఉండవు. అయినా ఇప్పటి వరకూ ఒక్క దొంగతనమూ కూడా ఇక్కడ జరగలేదు. దీనికంతటికీ ఆ శని మహాత్ముడి చల్లని చూపే కారణమని చెబుతారు.

శని శింగనాపూర్

శని శింగనాపూర్

P.C: You Tube

శని త్రయోదశి స్వామికి ఇష్టమైన రోజు. అదేవిధ:గా అమావాస్య రోజు కూడా శనీశ్వరుడికి అత్యంత ఇష్టమైనది. ఈ రెండు రోజుల్లో ఈ క్షేత్రం కిక్కిరిసి ఉంటుంది. ఆ రోజున ప్రత్యేక ప్రార్థలనుల కూడా జరుగుతాయి. ముఖ్యంగా తైలాభిషేకాలు జరుపుతారు.

శని శింగనాపూర్

శని శింగనాపూర్

P.C: You Tube

షిర్డీ వెళ్లిన వారు తప్పకుండా శని శింగనాపూర్ కు వెళ్లి వస్తారు. షిర్డీ నుంచి రానుపోను దాదాపు రూ.600 నుంచి రూ.1,000 ట్యాక్సీ ఛార్జ్ చేస్తారు. ఇక్కడికి దగ్గర్లోనే ప్రముఖ పర్యాటక కేంద్రం ఔరంగాబాద్ కూడా ఉంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+