Search
  • Follow NativePlanet
Share
» »మంచు కురిసే వేళ‌లో... సిమ్లా ద‌ర్శ‌నం చేయాల్సిందే...

మంచు కురిసే వేళ‌లో... సిమ్లా ద‌ర్శ‌నం చేయాల్సిందే...

నేటి ఉరుకుల ప‌రుగుల జీవితంలో ఎవరికీ తమకంటూ గ‌డిపేందుకు సమయం ఉండదు. అలాంటి వారు కాస్త స‌మ‌యం దొరికితే చాలు ప్ర‌యాణాలు చేస్తుంటారు. ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో, ప్ర‌కృతి అందాల న‌డుమ సేద‌తీరుతుంటారు. మీరు కూడా అలా చేయాల‌నుకుంటే విహార‌యాత్ర‌ల‌కు వెళ్లేందుకు ప్ర‌ణాళికలు సిద్ధం చేసుకోండి. అలా విహ‌రించేందుకు భార‌త్‌లో అనువైన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. అందులో సిమ్లా మొద‌టి స్థానంలో ఉంటుంది. ఇక్క‌డ అందమైన గ్రామాలు, ప‌ర్యాట‌కుల‌ను ఆకట్టుకునే చారిత్రక భవనాలు, నోరూరించే పండ్ల తోటలు, పురాతన నిర్మాణాల‌తోపాటు, మంచు పర్వత దృశ్యాల‌ను ఖ‌చ్చితంగా చూడాల్సిందే. ఇంకా ఇక్క‌డ చూడాల్సిన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. ఈ ప్రాంతంలో ప్రాముఖ్యత పొందిన ప్రదేశాలు కూడా ఉన్నాయి. అవెంటో చూద్దాం..

ది రిడ్జ్

సిమ్లాను సంద‌ర్శ‌న‌కు వెళ్లిన‌ప్ప‌డు త‌ప్ప‌కుండా ఒకసారైనా 'ది రిడ్జ్' ప్రదేశాన్నిచూడాల్సిందే. ఇది మాల్ రోడ్‌లో నిర్మించిన ఒక అద్భుత‌మైన చర్చి. ఇక్కడ నుండి కనిపించే అద్భుతమైన దృశ్యాలు ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీకి ఈ ప్రాంతం ఎంతో ఉత్తమమైనదిగా పరిగణించబ‌డుతుంది. అంతేకాకుండా, ఇక్క‌డ రుచిక‌రమైన‌ వంట‌కాలు, పానీయాలు కూడా ల‌భిస్తాయి. సిమ్లాలో తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేయడానికి మాల్ రోడ్‌లో చాలా దుకాణాలు కూడా అందుబాటులో ఉంటాయి.

shimlawintersport

కుఫ్రి

సిమ్లా నుండి సుమారు 17 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న కుఫ్రీని త‌ప్ప‌కుండా సంద‌ర్శించాల్సిందే. ఎందుకంటే, ఇక్కడ అనేక రకాల సాహసాలను చేయొచ్చు. దీని ఖరీదు దాదాపు ఒక్కో వ్య‌క్తికి రూ.1500 ఉంటుంది. ఇక్కడ గుర్రపు స్వారీ, జీప్ రైడ్, జీప్ లైన్, యాపిల్ తోటలు వంటి వాటిని కూడా ఆనందించవచ్చు. కుఫ్రీ పాయింట్‌లో యాక్‌పై కూర్చుని ఫోటోలు కూడా తీసుకోవ‌చ్చు. ఇక్కడ విలువిద్యను కూడా ఆస్వాదించవచ్చు.

జఖూ దేవాలయం

జఖూ దేవాలయం సిమ్లా నుండి దాదాపు రెండు కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. ఇది ఎంతో పురాత‌న‌మైన ఆల‌యం. ఇక్కడ హనుమాన్ జీ యొక్క 108 అడుగుల ఎత్తైన విగ్రహాన్నిచూడొచ్చు. ఇక్క‌డ ఎక్కువ‌గా కోతులు సంచ‌రిస్తుంటాయి. కాబ‌ట్టి ఇక్క‌డికి వెళ్లేట‌ప్ప‌డు కాస్త జాగ్ర‌త్త‌ వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. విలువైన వస్తువుల‌ను భ్ర‌దంగా దాచుకోవాలి. అద్దాలు, మొబైల్ పర్స్ మొదలైన వాటిని దాచిపెట్టుకోవాల్సి ఉంటుంది. సిమ్లాను సందర్శించే ప్ర‌తి ఒక్క పర్యాటకుడు ఈ ఆల‌యాన్ని త‌ప్ప‌కుండా సంద‌ర్శిస్తారు.

shimlawinter

న‌ర్కంద‌

సిమ్లా సమీపంలో ఉన్న మరో అంద‌మైన , ర‌మ‌ణీయ‌మైన ప్రదేశం నర్కంద. శివాలిక్ పర్వత శ్రేణులు చుట్టూ కలిగిన ఈ ప్రదేశం సిమ్లా నుండి సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హిమాచల్ యొక్క ప్రత్యేక స్కీయింగ్ రిసార్ట్ గా నర్కంద పేరుగాంచింది. ఇది సిమ్లా, రాంపూర్ మధ్య కనెక్టింగ్ లింక్‌ను క‌లిగి ఉంటుంది. ఇక్కడ అనేక అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను చూడవచ్చు. మ‌రెన్నో సాహ‌స కార్య‌క‌లాపాల‌ను కూడా చూడొచ్చు. తన్ను జుబ్బర్ సరస్సు, హతు శిఖరం, నర్కంద ఆలయం, కచేరీలోని మహామాయ ఆలయం, స్టోక్స్ ఫామ్, స్కీయింగ్ వంటి ప్ర‌దేశాల‌ను కూడా చూడొచ్చు.

సిమ్లా చేరుకోవడం ఎలా

సిమ్లా చేరుకునేందుకు అన్ని మార్గాలు ఉన్నాయి. ఢిల్లీ మరియు చండీగఢ్ నుండి సాధారణ విమానాలతో జుబ్బల్ హట్టి వద్ద విమానాశ్రయం ఉంటుంది. రైలు మార్గం ద్వారా వెళ్లాల‌నుకుంటే మాత్రం రైల్వే స్టేషన్ నగరంలోనే ఉంది. అక్క‌డినుండి బ‌స్సులు, టాక్సీలు, ఆటోలు ల‌భిస్తాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+