Search
  • Follow NativePlanet
Share
» »ఆదిశక్త్యాత్మక శ్రీ అన్నపూర్ణేశ్వరి టెంపుల్, హొరనాడు !!

ఆదిశక్త్యాత్మక శ్రీ అన్నపూర్ణేశ్వరి టెంపుల్, హొరనాడు !!

జాతి, మత, ప్రాంత మరియు భాషా విభేదాలు లేకుండా అందరూ కలిసి తప్పక చూడవలసిన పుణ్యక్షేత్రం ... హొరనాడు లోని శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవాలయం.

By Mohammad

హొరనాడు పట్టణం గురించి ప్రధానంగా చెప్పాలంటే అక్కడి అన్నపూర్ణేశ్వరి దేవాలయం గురించి చెప్పాలి. అంతేకాక ప్రకృతి అందాలకు పరవశం చెందేవారు, ఆ మాత యొక్క ఆశీర్వాదం కోరేవారు తమ ఇంద్రియాలను సంతుష్టి పరచేటందుకు హొరనాడు తప్పక సందర్శించాల్సిందే. ఈ పచ్చటి పట్టణం మల్నాడు ప్రాంతంలో చిక్కమగళూరుకు 100 కిలోమీటర్ల దూరంలో నైరుతి దిక్కున ఉంది. ఈ ప్రదేశం దట్టమైన అడవులచే కప్పబడి ఎంతో సారవంతమైన ప్రదేశాలు, లోయలు కలిగి ఉంది. ఈ ఆకర్షణలతో కూడిన హొరనాడు పట్టణం అంటే ఇష్టపడని వారుండరు.

పచ్చదనంతో అలరారుతున్న హొరనాడు

పచ్చదనంతో అలరారుతున్న హొరనాడు

చిత్రకృప : Prof. Mohamed Shareef

దేవాలయ పురాతన చరిత్ర

పకృతి అందాలే కాక, హొరనాడు పట్టణ సందర్శనలో మాత అన్నపూర్ణేశ్వరి దేవాలయం వంటివి కూడా ప్రతి ఒక్కరిని అక్కడకు ఆకర్షిస్తాయి. ఈ దేవత విగ్రహం బంగారంతో తయారు చేయబడి ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రం సందర్శించిన యాత్రికులకు తమ జీవితంలో ఆహార కొరత ఉండదని నమ్ముతారు. ఇతిహాసాల మేరకు శివ భగవానుడు ఒకప్పుడు శపించబడగా, ఈ మాత ఆశీర్వాదాలతో ఆ శాపం వరంగా మారిందని కూడా చెపుతారు. ఈ దేవాలయం సందర్శించిన ప్రతి యాత్రికుడికి రుచికర ఆహారం మాత్రమేకాదు, చక్కగా నిద్రించేందుకు స్ధలంగూడా ఇవ్వబడుతుంది.

అన్నపూర్ణేశ్వరి దేవాలయం

హొరనాడు పట్టణ పర్యాటకులు అన్నపూర్ణేశ్వరి దేవాలయాన్ని తప్పక చూడాలి. ఇది కర్నాటకలోని పడమటి కనుమలలో భద్ర నది ఒడ్డున ఉంది. దీనినే శ్రీ క్షేత్ర హొరనాడు అని కూడా పిలుస్తారు. ఈ దేవాలయం చుట్టూ అడవులు, పచ్చటి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. పురాతన దేవాలయాన్ని పునరుద్ధరించి దానికి ఆది శక్త్యాత్మక శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవాలయంగా నామకరణం చేశారు.

అన్నపూర్ణేశ్వరి టెంపుల్ ఎంట్రెన్స్

అన్నపూర్ణేశ్వరి టెంపుల్ ఎంట్రెన్స్

చిత్రకృప : Gnanapiti

ఈ దేవాలయంలో పర్యాటకులు మాత అన్నపూర్ణేశ్వరి శ్రీ చక్రాన్ని, చక్ర, శంకు ధరించి చూస్తారు. దేవి గాయత్రిని కూడా తన నాలుగు చేతులతో చూడగలరు. ఎన్నో శతాబ్దాల కిందట, ఆదిశక్త్యాత్మక శ్రీ అన్నపూర్ణేశ్వరి విగ్రహాన్ని ఆగస్త్య మహర్షి ప్రతిష్టించారు. అన్నపూర్ణేశ్వరి అంటే అందరికి అన్నం పెట్టే తల్లిగా ఈమె కీర్తించబడుతోంది. ఈ కారణంగానే అక్కడి భక్తులకు రోజులో మూడు సార్లు భోజనాలు పెడతారు. నిద్రించేందుకు స్ధలం చూపుతారు.

అన్నపూర్ణేశ్వరి దేవాలయం సందర్శనవేళలు : ఉదయం 6:30 నుండి 9:00 గంటల వరకు, 11:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు మరియు సాయంత్రం 7:00 నుండి రాత్రి 9:30 వరకు దేవాలయాన్ని దర్శించవచ్చు.

అన్నపూర్ణేశ్వరి మాత

అన్నపూర్ణేశ్వరి మాత

చిత్రకృప : S172142230149

కలశేశ్వర దేవాలయం

పర్యాటకులు కలశేశ్వర దేవాలయాన్ని కూడా హొరనాడులో సందర్శించవచ్చు. ఈ దేవాలయం హొరనాడుకు అరగంట ప్రయాణంలో కలశ అనే ప్రదేశంలో సమీపంలో భద్ర నది పారుతూండగా ఒక కొండపై ఉంటుంది. దేవాలయంలో రెండు ఏనుగుల విగ్రహాలుంటాయి. వాటిలో ఒకటి గణేశుడుగాను మరి ఒకటి అతని భార్య లేదా ఆడ ఏనుగుగాను చెపుతారు. రెండూ ఒకే మాదిరిగా ఉంటాయి. అయితే, మగ ఏనుగు తన కాలికింద ఒక రాక్షస విగ్రహం కలిగి ఉంటుంది. ఈ రాక్షసుడిని భతవంతుడైన గణేశుడు వధించాడని చెపుతారు. పర్యాటకులు కలశేశ్వర విగ్రహాన్ని ఒక లింగం రూపంలో చూస్తారు. దీనినే కలశంలో సాక్షాత్కరించిన శివ భగవానుడిగా కూడా భావిస్తారు.

అన్నపూర్ణేశ్వరి టెంపుల్ మెట్ల మార్గం

అన్నపూర్ణేశ్వరి టెంపుల్ మెట్ల మార్గం

చిత్రకృప : Wind4wings

సమీపంలో ఉన్న ఇతర దేవాలయాలు

హొరనాడు సందర్శించేవారు సమీపంలోనే ఉన్న ఇతర దేవాలయాలు కూడా సందర్శించవచ్చు. శృంగేరి ఇక్కడకు 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హొరనాడు వెళ్ళే మార్గంలో ధర్మస్ధల మరియు ఉడుపి క్రిష్ణ దేవాలయం, కొల్లూరు మూకాంబికా ఆలయం, కలశ లో ఉన్న కాళేశ్వరి ఆలయం కూడా సందర్శించవచ్చు. ఈ వరుసలో హొరనాడు చివరి మజిలీ.

ఇది కూడా చదవండి : కుద్రేముఖ్ ను పర్యాటకులు ఎందుకు ఇష్టపడతారంటే ?!

వసతి సదుపాయాలు

హొరనాడు లో దేవస్థానం వారు ఏర్పాటు చేసిన సత్రాలు వసతికి అనుకూలంగా ఉన్నాయి. కొన్ని ప్రవేట్ లాడ్జీలు, హోటళ్ళు కూడా గదులను అద్దెకు ఇస్తుంటారు. పండుగలు, ఉత్సవాల సమయంలో గదులు ఒక్కోసారి దొరకవు. అలాంటప్పుడు భక్తులు కలత చెందవలసిన అవసరం లేదు. చిక్కమగళూరు లో భేషుగ్గా వసతి సదుపాయాలు దొరుకుతాయి.

అన్నపూర్ణేశ్వరి టెంపుల్ వెలుపలి దృశ్యం

అన్నపూర్ణేశ్వరి టెంపుల్ వెలుపలి దృశ్యం

చిత్రకృప : Prof tpms

హొరనాడు ఎలా చేరుకోవాలి ?

హొరనాడు బెంగళూరు నుండి 330 కిలోమీటర్ల దూరంలో, షిమోగా నుండి 45 కిలోమీటర్ల దూరంలో, శృంగేరి నుండి 75 కిలోమీటర్ల దూరంలో, చిక్కమగళూరు నుండి 100 కిలోమీటర్ల దూరంలో కలదు. బెంగళూరు నుండి ప్రతిరోజూ కె ఎస్ ఆర్ టి సి, ప్రవేట్ బస్సులు హొరనాడు కు బస్సులు లభిస్తాయి.

హొరనాడు సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ షిమోగా. ఇక్కడి నుండి ప్రభుత్వ బస్సు లేదా జీప్, టాక్సీ అద్దెకు తీసుకొని హొరనాడు చేరుకోవచ్చు.

విమాన మార్గంలో వచ్చే యాత్రికులు మంగళూరు విమానాశ్రయం చేరుకొని, అక్కడి నుంచి క్యాబ్ లేదా టాక్సీ ఎక్కి 136 కిలోమీటర్ల దూరంలో ఉన్న హొరనాడు సులభంగా చేరుకోవచ్చు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+