Search
  • Follow NativePlanet
Share
» »గిరిజ‌నుల ఆరాథ్య ప్రాంతం అర్జున్‌లొద్ది విశేషాలు మీకోసం!

గిరిజ‌నుల ఆరాథ్య ప్రాంతం అర్జున్‌లొద్ది విశేషాలు మీకోసం!

అర్జున్‌లొద్ది ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలోని కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని ప‌ర్యాక‌ట ప్ర‌దేశాల‌లో ఇప్పిడిప్పుడే గుర్తింపు పొందుతోంది. తిర్యాణి మండల కేంద్రానికి 15 కిలోమీట‌ర్ల దూరంలో మెస్రంగూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఈ ప్ర‌కృతిసిద్ధ‌మైన ప‌ర్యాట‌క ప్ర‌దేశం సంద‌ర్శ‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ర్షిస్తోంది. ఎటుచూసినా దట్టమైన ప‌చ్చ‌ని అటవీప్రాంతం మ‌న‌సుకు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుంది. ఇక్క‌డి ఎత్తయిన గుట్టల మధ్యలో దాగిన‌ అతిపెద్ద సొరంగం ఓ స‌రికొత్త ప్ర‌పంచ‌డంలో అడుగుపెట్టిన అనుభూతిని అందిస్తుంది.

నిజానికి అర్జ‌న్‌లోద్దిలోని ఈ సొరంగం స్వాతంత్య్రోద్యమ స‌మ‌యంలో ఉద్యమకారులకు ఎంతో ఉపయోగపడిందని స్థానికులు చెబుతున్నారు. పాండ‌వుల్లో ఒక‌రైన అర్జునుడి ఆలయం ఇక్కడ చూడొచ్చు. పూర్వం పాండవులు అర్జున్‌లొద్ది గుహల్లో బంగారు కిరీటాలను ఉంచారని చెబుతారు. అరణ్యవాస సమయంలో భీముడు గిరిజన స్త్రీని వివాహమాడి ఈ ప్రాంతాన్ని పరిపాలించాడని, తామంతా భీముడి సంతానమని స్థానిక గిరిజ‌నుల విశ్వాసం.

అందుకే, ఈ ప్రాంతంలోని గిరిజనులు ఎక్కువ శాతం భీముడు, అర్జునుడు పేర్లతోనే పిలుచుకుంటారు. ఇక్క‌డి అర్జున్‌లొద్ది సొరంగం లోప‌ల‌కు పూర్తిగా వెళ్లేందుకు ఎంతోమంది ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ అది జ‌ర‌గ‌లేదు. అలా ప్ర‌య‌త్నించిన‌వారు చాలామంది కొంత దూరంలోకి వెళ్లగా, ఊపిరాడక వెనుదిరిగారు. నేటికీ సొరంగం ఎంత లోతులో ఉంది? ఎంత దూరం వరకు ఉంద‌న్న విష‌యంలో స్ప‌ష్ట‌త‌లేదు. ఈ సొరంగం లోపల భాగంలో వజ్రపు మెరుగు ఉంటుందని, లోప‌ల ఒక‌ స్తంభం నిత్యం మెరుస్తూ ఉంటుంద‌ని గిరిజ‌న‌లు చెబుతుంటారు.

arjunloddicaves

నిత్యం పూజ‌లందుకునే అర్జున్‌లొద్ది..

తెలంగాణ‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా నుంచి సంద‌ర్శ‌కులు పెద్ద సంఖ్య‌లో ఇక్క‌డికి త‌ర‌లివ‌స్తుంటారు. ఈ కారణంగా అర్జున్‌లొద్ది గొప్ప‌ ఆరాధన స్థలంగా పేరుగాంచింది. నిత్యం గిరిజ‌నులు ఇక్క‌డ పూజ‌లు నిర్వ‌హిస్తుంటారు. ప్ర‌ధానంగా పొలాల్లో విత్తనాలు చల్లేటప్పుడు, పంటను కోసే ముందు గిరిజనులు ఈ సొరంగం వద్ద పెద్ద‌ పండుగను చేసుకుంటారు. సకాలంలో వర్షాలు కుర‌వ‌నప్పుడు ఇక్కడ పూజలు చేస్తే వ‌ర్షాలు కురుస్తాయ‌ని స్థానిక గిరిజ‌నుల విశ్వాసం. అంతేకాదు, ఈ సొరంగం వద్దకు వచ్చే వారు భక్తితో, నియమ నిష్ఠలతో రావాలట‌. లేక‌పోతే, దేవునికి కోపం వచ్చి తేనేటీగల రూపంలో వచ్చి తప్పు చేసిన వారికి తగిన బుద్ధి చెబుతాడని అంటారు. ప్ర‌తి సంవ‌త్స‌రం సంస్కృతీ, సంప్రదాయం ప్రకారం ఆలయ వార్షికోత్సవాన్ని నిర్వ‌హిస్తుంటారు. ఈ సంద‌ర్భంగా గిరిజ‌నుల‌తోపాటు సుదూర ప్రాంతాల‌నుంచి వ‌చ్చే భ‌క్తులు మొక్కులు తీర్చుకుంటారు.

arjunloddicaves1

ఆవు పొదుగులాంటి ప్రదేశం

చుట్టూ దట్టమైన అడవులు, కొలను, జలపాతాలు ప‌ర్యాట‌కుల‌కు ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తాయి. ఈ సొరంగం లోపల ఆవు పొదుగులాంటి ప్రదేశం ఎంతో ఆక‌ర్షిస్తుంది. దాని కింద చేయిపెడితే అదృష్టవంతులకు పాల‌దార‌లు కురుస్తాయ‌ని ప్ర‌చారంలో ఉంది. గుహ‌కు వెనుక భాగంలో ఎత్తయిన కొండల నుంచి జాలువారే నీటి ప్ర‌వాహం తెల్లటి పాల నురగలా చూప‌రుల‌ను క‌నువిందు చేస్తుంది. ఈ ప్ర‌దేశంలోనే ద్రౌపతి స్నానం చేస్తుండేదని స్థానికులు చెబుతారు. అయితే, గుహ వ‌ర‌కూ రోడ్డు సౌక‌ర్యం లేక‌పోవ‌డంతో ఇక్క‌డికి చేరుకునేందుకు కొంత‌మేర‌కు సాహ‌సం చేయాల్సిందే. గుహ వ‌ద్ద‌కు చేరుకున్నాక మాత్రం మీ క‌ష్టం ఇట్టే మ‌ర్చిపోతారు. మ‌రెందుకు ఆల‌స్యం మీ ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టండి.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+